S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/03/2017 - 00:05

మయన్మార్ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వేలాదిమంది రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వాలని మన రాజకీయ నాయకులు కొందరు చేస్తున్న సూచనలు సహేతుకం కాదు. గాలికిపోయే కంప ఒంటికి తగిలించుకున్న చందంగా ఉంది ఈ సలహా. ఇప్పటికే ఎన్నో సమస్యలతో ఉన్న మనం ఇప్పుడు సరికొత్త సమస్యను కొని తెచ్చుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. మయన్మార్ రోహింగ్యాల సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఆ దేశానికే ఉంది.

10/01/2017 - 23:36

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా సంస్థలు లేకపోవడం పెద్దలోపం. ఇప్పుడు వివిధ రాజకీయ పక్షాల్లో పేరుమోసిన నేతలంతా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే. ఒకప్పుడు కాంగ్రెస్‌లో రాజకీయాలు చేయడం మొదలెట్టిన చంద్రబాబు ఎన్టీఆర్‌ను విమర్శించి ఆ తరువాత తెలుగుదేశంలో చేరినట్టే చాలామంది కాంగ్రెస్‌లో ఎదిగి ఆ తరువాత పార్టీలు మార్చేశారు.

09/30/2017 - 00:09

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ రాష్టశ్రాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

09/29/2017 - 00:21

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లోపించడం ఇప్పుడు సమస్యగా మారుతోంది. ఆ మధ్య మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదం సంచలనంగా మారింది.

09/27/2017 - 19:24

అవయవదానం చేస్తున్నవారి వివరాలు బయటకు వెల్లడి అవుతున్నా లబ్దిదారుల వివరాలు అంతగా బయటకు పొక్కడం లేదు. ఇది అక్రమాలకు తావిస్తోంది. అందువల్ల అవయవదానం చేసినవారి వివరాలు, లబ్దిపొందినవారి వివరాలు ప్రభుత్వమే ప్రత్యేక వెబ్ పేజీల్లో వెల్లడించే ఏర్పాటు చేయాలి. నిజానికి లబ్దిదారుడి వివరాలను ఆన్‌లైన్‌లో చూసే ఏర్పాటు చేస్తే అక్రమాలకు అవకాశం ఉండదు.

09/27/2017 - 00:55

వైశ్యులను కించపరుస్తూ పుస్తకం ప్రచురించిన కంచ ఐలయ్య తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా ఆయన ఆ వివాదానికి చరమగీతం పాడాలి. కోమట్లను స్మగ్లర్లుగా చిత్రీకరిస్తూ రాయడం కన్నా తన వాదనలో తప్పేమిటని ఆయన వివాదాన్ని మరింత ముదిరేలా చేయడంలో విజ్ఞత లేదు. తన జీవితంలో చూసిన సమాజంలో వైశ్య సామాజిక వర్గంలో కొందరిని చూసి ఆ వర్గమంతా అలానే ఉంటుందని సూత్రీకరించడం సరికాదు.

09/26/2017 - 00:34

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూసర్వే కార్యక్రమం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారికి కష్టాలు తప్పవు. రామగుండం పారిశ్రామిక వాడలోని గోదవారిఖని, శ్రీరాంపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపాల్టీలలోని సింగరేణి భూములను చాలామంది ఆక్రమించారు. మంచిర్యాలలోని ఒక సినిమా థియేటర్ సమీపంలోని ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన నేత ఒకరు కబ్జా చేశారు.

09/25/2017 - 00:49

దేశంలో దోమలను పూర్తిగా నిర్మూలించడం ఎవరి చేతుల్లోనూ లేదని, అది అసాధ్యమని, కేవలం భగవంతుడివల్లే అలాంటివి సాధ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం నూటికి నూరుపాళ్లు నిజం. దోమల నివారణలో ప్రభుత్వాలు విఫలమైనాయని, డెంగ్యూ వంటి ప్రాణాంతక రోగాల వ్యాప్తికి అవి కారణమవుతున్నాయని, వాటి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై సుంప్రీం స్పందించింది.

09/22/2017 - 23:36

తెలుగు భాషాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న రీతిలో ఉంది. ఇప్పటికీ మన పరిపాలనా వ్యవస్థలో తెలుగుకు ప్రాధాన్యం లేదు. నిజానికి బ్రిటిష్ వారి హయాంలోనే తెలుగు వెలుగులీనిందంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు అటు ప్రజల్లో, ఇటు ప్రభుత్వం కూడా ఇంగ్లీషుపై మోజు పెరిగింది. ఇప్పటికే మినుకుమినుకుముంటున్న తెలుగు వెలుగు మరింత మసకబారడం ఖాయం.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు.
ఉత్తర కొరియా కొరివి

09/20/2017 - 21:50

చైనాను నమ్మవద్దు

Pages