S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

09/04/2017 - 23:35

గురువరా! మీ సందేశం
సర్వ శుభాలకు అదే సంకేతం గు

అజ్ఞానపు చీకటిలో- అలవికాని పోకడలో
తిరుగాడే ఈ మనిషిని తీరానికి చేర్చావు
జ్ఞానజ్యోతి వెలిగించి జాగృతం చేశావు గు

గురుదేవుల గురుతరమె మా భవితకు శుభకరము
తమరొసగిన జ్ఞానధనం మహోన్నతికి మూలధనం
మా ప్రతిభా పాటవాలు - తమ దీక్షా దర్పణాలు
మీ చల్లని వీక్షణాలు - దిగ్విజయపు కేతనాలు గు

09/03/2017 - 23:05

ఓ ప్రముఖ టీవీ చానల్‌లో వస్తున్న ‘బిగ్‌బాస్’ షో చాలా నిరాశపరచేలా వుంది. ఏ కార్యక్రమమైనా చూడడానికి వీక్షకుల్లో ఆసక్తి, ఉత్సాహం కలిగించాలి. ఎంతసేపూ కీచులాటలు, అంతఃకలహాలు, వాగ్వివాదాలు తప్ప అసలు ‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్‌లో పస లేదు. ఒకర్ని ఒకరు నరుక్కుంటారేమో అన్న సందేహం కూడా కలుగుతోంది. అందరు ఒక్కర్నే దోషిగా నిలబెట్టడం ఎలా వుందంటే సినిమాల్లో విలన్లంతా కలిసి హీరోమీద కక్ష సాధింపు చర్యలా వుంది.

09/02/2017 - 00:10

ఆధార్ కార్డు ఒక వ్యక్తి గోప్యతకు సంబంధించినదా? కాదా? ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు సెక్షన్-21 కింద అన్వయించుకోవచ్చా? అనే విషయమై అయిదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారించి ఈ వివాదంలో తుది నిర్ణయానికి అనేక మీమాంసలు వ్యక్తీకరించడంవల్ల ఈ సమస్యను మరలా తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనానికి నివేదించడం జరిగింది.

09/01/2017 - 00:08

ప్రతి ఒక్కరూ ‘కులమతాల కుమ్ములాటలు’ అంటూ నిరసన స్వరంతో మాట్లాడుతుంటారు. ఎప్పుడూ ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసే బిసి సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య- రాజకీయ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలకు చెందిన బిసి నేతలను ఒక చోట చేర్చి పోరాడతామంటారు. పార్టీలకు అతీతంగా నేతలు ఒకచోట చేరి ప్రసంగాలు చేస్తారు.

08/29/2017 - 23:24

విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దే ఒకప్పటి పద్ధతులు ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనుమరుగయ్యాయి. గతంలో నిర్ణీత టైమ్ టేబుల్‌ను అన్ని బడుల్లోనూ అమలు చేసేవారు. విద్యార్థుల చేత ఉదయానే్న ‘డ్రిల్’ చేయించడం గతంలో కనిపించేది. ఆ విధానానికి ఇపుడు పూర్తిగా స్వస్తి పలికారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ‘డ్రిల్’ ఎంతగానో దోహదపడేది.

08/29/2017 - 00:51

ఒకప్పుడు వెలుగు జిలుగులు విరజిమ్మిన తెలుగు భాషకు పరభాషా వ్యామోహమనే గ్రహణం పట్టి మబ్బులు కమ్మేస్తున్నాయి. దాంతో మన తెలుగు భాషకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, సంస్కృతీ సంప్రదాయాలు ఒక్కొక్కటి మరుగునపడుతున్నాయి. కొందరు తెలుగు మాట్లాడితేనే తమ అంతస్తుకి, గొప్పతనానికి భంగమనుకుంటున్నారు. వాళ్ల పిల్లలకు ‘అ’ అంటే అంకుల్ అని, ‘ఆ’ అంటే ఆంటీ అని నేర్పిస్తున్నారు.

08/27/2017 - 23:30

అనుమతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాలు మొక్కాలా?’ అంటూ విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్ని రెచ్చగొట్టడానికి తప్ప కార్యసాధకులు చేయాల్సిన పనులు కావు. ఈ మధ్య గుజరాత్‌లో రాహుల్ ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు, సెక్యురిటీని కాదని ప్రైవేటు కారులో బయలుదేరి రాళ్లవానలో చిక్కుకున్నాడు.

08/25/2017 - 00:23

శ్రీకర.. శుభకరా! సుఖశాంతుల నిలయంగా
జగతిని మార్చుమయ్యా!
ఓ బాలగణపతీ! నీ లీలతో బాలలకు
బంగారు భవితను చూపవయ్యా!
శుక్లాంభరా! మాకు శుద్ధజ్ఞానమందించి
అజ్ఞాన చీకట్లు తొలగించవయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! ఒజ్జవై విచ్చేసి
నాణ్యమైనట్టి విద్యను అందించవయ్యా!
ఓ బుద్ధి గణపయ్య! రావయ్య.. సద్బుద్ధినిచ్చి
యువతను సన్మార్గాన నడుపవయ్యా!

08/22/2017 - 23:52

తమకు అనుకూలంగా ఉండే కొన్ని అంకెలు ఉదహరించి మహాసిద్ధాంతాలు ప్రవచించేస్తాయి వామపక్షాలు. ఈమధ్య జరిగిన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన మీరాకుమార్ కన్నా గోపాలకృష్ణ గాంధీకి 9 ఓట్లు ఎక్కువ వచ్చాయి కనుక విపక్షాల బలం మెరుగుపడిందని, ఇది విపక్షాలకు శుభసూచన అని వామపక్షాలు సిద్ధాంతీకరించాయి. అయితే అవి చెప్పని అంకెలు మరో నిజాన్ని చెప్తున్నాయి.

08/22/2017 - 00:38

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గొర్రెలను, చేపలను పంపిణీ చేయించి సంబంధిత కులాల వారు అభివృద్ధి చెందాలని సెలవిచ్చారు. నిజంగా పేదవర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి గేదెలను, ఆవులను పంపిణీ చేసి పాలు, పాల ఉత్పత్తులను పెంచితే మంచి ఆదాయం లభిస్తుంది. ప్రజలకు కూడా ఇవి తక్కువ ధరలకు లభిస్తాయి. పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధిలోకి తేవాలి.

Pages