S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/09/2018 - 23:53

కొలంబియా, ఫిబ్రవరి 9: అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది. ప్రభుత్వ ఖర్చుకు సంబంధించి వినిమయ బిల్లుకు ఈసారీ సెనెట్ ఆమోదం లభించలేదు. గత నెల 20న బిల్లుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు మద్దతు ఇవ్వకపోవడంతో ఆమోదం లభించలేదు. వాస్తవానికి బిల్లుకు గురువారం రాత్రికి ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే నిధులు కేటాయింపుపై సంతృప్తి చెందని కెంటకీ రిపబ్లికన్ పార్టీ సెనెటర్ రాండ్‌పౌల్ ఆమోదానికి అంగీకరించలేదు.

02/09/2018 - 23:49

బీజింగ్, ఫిబ్రవరి 9: గత కొన్నిరోజులుగా మాల్దీవుల సంక్షోభంపై వరుస ప్రకటనలు గుప్పిస్తున్న చైనా, తాజాగా భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మరో మెలిక పెట్టింది. మాల్దీవుల్లో సైనిక జోక్యం చేసుకోవాలని, అక్కడి పరిస్థితిని అదుపు చేయాలని భారత్‌పై డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో మాట్లాడిన చైనా ‘ఈ సమస్యను మరో డోక్లాంలా మార్చొద్దు’ అని భారత్‌కు స్పష్టం చేసింది.

02/09/2018 - 23:38

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 9: ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే తమ దేశానికి, ఆఫ్ఘాన్‌కు మధ్య వివాదాస్పదంగావున్న సరిహద్దుకు కంచె వేయాల్సిందేనని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయితే ఇందుకయ్యే ఖర్చును అమెరికా భరించాలని కూడా మెలిక పెట్టింది. ఆఫ్ఘాన్, పాక్‌ల మధ్య దాదాపు 2340 కిలోమీటర్ల మేర పర్వతమయమైన సరిహద్దు ప్రాంతం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇప్పటి వరకూ పది శాతం కూడా కంచె నిర్మాణం పూర్తికాలేదు.

02/09/2018 - 01:53

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: అంతర్జాతీయ మేదోసంపత్తి సూచిక (ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ-ఐపీ)లో భారత్ తన స్థానాన్ని గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఈ విషయంలో తొలి యాబయి ర్యాంకులు సాధించిన దేశాల్లో భారత్‌కు 44వ స్థానం లభించింది. గత ఏడాది ఈ ర్యాంకులు పొందిన తొలి 45 దేశాల్లో భారత్ 43వ స్థానంలో నిలవగా ఇప్పుడు తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంది.

02/09/2018 - 01:52

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొరడా ఝళిపించింది. లష్కరే తోయిబా, తాలిబన్ మిలిటెంట్ సంస్థలకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకరమైన వ్యక్తులకు, సంస్థలకు ఏ విధంగానూ ఆశ్రయం ఇవ్వొద్దని పాకిస్తాన్‌కు తెగేసి చెప్పింది.

02/09/2018 - 04:01

కైరో, ఫిబ్రవరి 8: భారత్‌కు ఈజిప్టు దౌత్యపరంగా, ఆర్థిక పరంగా మంచి మిత్రదేశమేకాకుండా విస్వసనీయమైన భాగస్వామి అని ఆ దేశంలో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య స్పష్టం చేశారు. రాజధాని ఢిల్లీలో మహ్మద్ జకీ ఎల్ సెవడే అధ్యక్షతన జరిగిన ఓ సదస్సులో భట్టాచార్య మాట్లాడుతూ భారత్‌కు ఈజిప్టు సహజ మిత్రదేశమని అన్నారు. పెట్టుబడుల రంగంలోనూ ఇరుదేశాలు పరస్పర సహకారంతోముందుకెళ్తున్నాయని ఆయన చెప్పారు.

02/09/2018 - 01:33

ఢాకా, ఫిబ్రవరి 8: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన 72 సంవత్సరాల ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఖలీదాపై దాఖలైన ఒక కేసులో ఆమె అవినీతికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను ప్రత్యేక న్యాయస్థానం విధించింది. దీనివల్ల ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే.

02/08/2018 - 00:43

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: చూడ్డానికి అదో మహా పర్వతం. గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక దాన్నుంచి బాంబుల వర్షం కురిసిందా భూమీద ఉన్న దేనిపైన అయినా పిడుగులు పడినట్టే. అమెరికా వైమానిక దళానికి చెందిన బీ 52 బాంబర్‌కు ఉన్న ప్రత్యేకతలు ఎన్నో.. గురితప్పకుండా శత్రువులను నిశే్సషం చేసే పటిమ దీనికి ఉంది. కేవలం 96 గంటల వ్యవధిలో 24 తాలిబన్ స్థావరాలను ఈ బాంబర్ నేలమట్టం చేసింది.

02/08/2018 - 00:40

న్యూయార్క్, ఫిబ్రవరి 7: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహణ తీరులో పారదర్శకత లోపించిందని భారత్ ధ్వజమెత్తింది. ముఖ్యంగా వీటో అధికారం కలిగిన దేశాలు వ్యవహరిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసంగా లేదని పేర్కొంది. ఎలాంటి కారణం లేకుండా ఉగ్రవాదులకు సంబంధించి ఈ దేశాలు వ్యవహరిస్తున్నాయని చైనాను పరోక్షంగా దుయ్యబడుతూ భారత్ చురకలు వేసింది.

02/08/2018 - 00:39

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: ‘సర్వసత్తాక సైనిక పాటవానికి ప్రపంచ ప్రశంసలు దక్కేలా వాషింగ్టన్ వేదికపై అద్భుత పరేడ్ నిర్వహించండి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ విభాగాన్ని ఆదేశించారు. అయితే చైనా, ఫ్రాన్స్, ఇండియాలాంటి అనేక దేశాలు తమ సైనిక సత్తాను ప్రదర్శించుకుంటున్నట్టే, ఇదీ సాధారణ పరేడ్ మాత్రమేనని వైట్‌హౌస్ అంటోంది.

Pages