S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/18/2017 - 03:25

బీజింగ్, ఆగస్టు 17: సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఈ ప్రాంతంలో రక్తదాన, రక్త సేకరణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) ఆదేశాల మేరకు హునాన్ రాష్ట్ర రాజధాని చాంగ్‌షాలోని ఓ ఆస్పత్రి తన బ్లడ్‌బ్యాంక్‌ను ఈ ప్రాంతంలో తిరిగి ఏర్పాటు చేసినట్లు చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్’తెలిపింది.

08/18/2017 - 03:18

వాషింగ్టన్, ఆగస్టు 17: వర్జీనియా రాష్ట్రంలో గత వారం ర్యాలీ సందర్భంగా శే్వత జాతీయులు పాల్పడిన హింను, ఈ హింసాకాండకు శే్వత జాతీయులతోపాటుగా వారి వ్యతిరేక వర్గం కూడా కారణమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికాలోని హిందూ సిక్కు జాతీయులు ఖండించారు.

08/18/2017 - 01:28

బార్సిలోనా, ఆగస్టు 17: స్పెయిన్‌లో పాదచారులపై ఓ మృత్యుశకటం దూసుకెళ్లిన దుర్ఘటనలో అనేకమంది మరణించారు. ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లాస్‌రాంబ్లాస్‌లో సాగించిన ఘాతుకంలో సామాన్యులు మృత్యుఒడికి చేరారని కథనాలు వెలువడుతున్నాయి. బార్సిలోనాలోని లాస్‌రాంబ్లాస్‌ను దిగ్బంధించిన పోలీసులు ఆగంతుకుని కోసం గాలింపు మొదలుపెట్టారు.

08/17/2017 - 02:05

బీజింగ్: లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ గురించి తమకేమీ తెలియదని చైనా బుధవారం వాదించింది. లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు సమీపంలో భారత భూభాగంలోకి చొరబడడానికి యత్నించిన చైనా సైన్యాలను భారత జవాన్లు నిలువరించడానికి యత్నించడంతో ఉద్రిక్తత తలెత్తిందని బుధవారం మీడియా కథనాలు పేర్కొన్న నేపథ్యంలో చైనా వాటిపై స్పందించింది.

08/17/2017 - 02:04

బ్రాటిస్లావా: మధ్య ఐరోపాలోని స్లొవాకియాలో నాలుగువేల సంవత్సరాల నాటి డాగర్ (కత్తి) పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. హ్లోవెక్ పట్టణంలో అరుదైన ఈ ఆయుధం లభించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డేవిడ్ అనే గ్రాడ్యుయేట్ బృందం తవ్వకాల్లో వా నదీ తీరంలో దీన్ని కనుగొన్నట్టు జిన్‌హువా వార్తా సంస్థ పేర్కొంది.

08/17/2017 - 02:03

వాషింగ్టన్: అమెరికా సైనిక కేంద్రంగా ఉన్న గువామ్ ప్రాంతంపై క్షిపణులతో దాడి చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌ను డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. జోంగ్ సహేతుకంగానే ఆలోచించారని పేర్కొన్న ట్రంప్ ఇందుకు భిన్నంగా ఆయన వ్యవహరించివుంటే దాని ఫలితాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉండేవని ట్వీట్ చేశారు.

08/17/2017 - 01:30

వాషింగ్టన్: కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా బుధవారం ప్రకటించింది. దీని కమాండర్ సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. దీని నేపథ్యంలో ఈ సంస్థపై అనేకరకాలుగా అమెరికా ఆంక్షలు అమలవుతాయి.

08/16/2017 - 02:13

బీజింగ్/మెల్‌బోర్న్, ఆగస్టు 15: ‘విజరుూ విశ్వ తిరంగా ప్యారా’ అన్నట్లు విశ్వవ్యాప్తంగా మన త్రివర్ణ పతాకం వినువీధుల్లో రెపరెపలాడింది. ప్రపంచంలోని పలు దేశాల్లో భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అనేక దేశాల్లోని భారతీయ సంస్థలు, దౌత్య కార్యాలయాలు, ప్రవాస భారతీయ సమాజాలు పెద్దఎత్తున వేడుకలను జరుపుకున్నాయి.

08/16/2017 - 02:11

సియోల్, ఆగస్టు 15: తమ దేశానికి దగ్గరలో అమెరికా ఎయిర్ బేస్ ఉన్న గువామ్ దీవిపై క్షిపణి ప్రయోగానికి ఉత్తర కొరియా దాదాపు సన్నద్ధమైంది. గువామ్ దీవిపై క్షిపణిని ప్రయోగించేందుకు రూపొందించిన ప్రణాళికను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ అన్‌కు సైనిక నేతలు వివరించారు.

08/16/2017 - 02:02

ఖాట్మండు, ఆగస్టు 15: డబ్బై ఒకటో స్వాతంత్ర దినోత్సవం జరుపుకొన్న భారత్ పొరుగుదేశం నేపాల్‌కు ఇండిపెండెంట్స్‌డే గిఫ్టు ఇచ్చింది. నేపాల్‌లోని ఆసుపత్రులు, చారిటబుల్ సంస్థలకోసం 30 అంబులెన్స్‌లు అందించింది. వాహనాలకు సంబంధించి తాళం చెవులను ఇక్కడి భారత రాయబారి మంజీత్ సింగ్ పూరి నేపాల్ అధికారులకు అందజేశారు. ఖాట్మండులోని భారత ఎంబసీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ కానుకను అందజేశారు.

Pages