S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/10/2017 - 02:33

మోసుల్, జూలై 9: నెలల తరబడి ఐసిస్ ఉగ్రవాదులతో సాగిన పోరాటానికి చరమగీతం పడి మోసుల్ పట్టణం విముక్తం అయిందని ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ అల్ అబ్దాదీ ప్రకటించారు. ఆదివారంనాడు ఈ పట్టణంలో పర్యటించిన ఆయన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

07/10/2017 - 02:32

దుబాయి, జూలై 9: దుబాయిలోని ఓ బేకరీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కేక్‌ను తయారు చేసిందని, దీని తయారీకి ఏకంగా 25 వేల డాలర్లు (రూ. 16 లక్షలకుపైగా) ఖర్చయినట్లు ఆదివారం ఓ మీడియా కథనం పేర్కొంది. నాలుగడుగుల ఎత్తుండే ఈ కేక్‌ను పూర్తిగా చక్కెర పాకం, చక్కెర పేస్ట్‌తో తయారు చేశారు. 32 కిలోల బరువుండే దీన్ని వందనుంచి 120 మందికి వడ్డించవచ్చని ఈ కేక్‌ను తయారు చేసిన బ్రాడ్‌వే బేకరీ తెలిపింది.

07/10/2017 - 02:01

జమైకా, జూలై 9: కింగ్స్‌టన్‌లోని సబీనా పార్కులో ఆదివారం భారత్- వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాట్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి సాధించింది.

07/10/2017 - 01:33

హాంబర్గ్, జూలై 9: సుస్థిర అభివృద్ధి, సమీకృత వృద్ధికి భారత్ చేపడుతున్న చర్యలను జీ-20 పారిశ్రామిక దేశాలు జై కొట్టాయి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి భారత్‌ను వృద్ధి కేంద్రంగా మార్చేందుకు మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని శిఖరాగ్ర సదస్సులో చేపట్టిన హంబర్గ్ కార్యాచరణ ప్రణాళికలో కీర్తించాయి.

07/09/2017 - 02:28

హాంబర్గ్, జూలై 8: ఉగ్రవాద నిరోధంపై జి-20 సదస్సులో జరిగిన చర్చల్లో భారత్‌ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.

07/09/2017 - 02:08

సియోల్, జూలై 8: కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాపై అమెరికా శనివారం తీవ్రస్థాయిలో గర్జించింది. తమ యుద్ధ విమానాలతో శనివారం దక్షిణ కొరియాలో లైవ్ ఫైర్ డ్రిల్ నిర్వహించి ఉత్తర కొరియాకు బలమైన హెచ్చరిక పంపింది. అమెరికా ఇటువంటి విన్యాసాలను నిర్వహించడం చాలా అరుదు.

07/09/2017 - 02:03

చిత్రాలు.. అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిసియో మాక్రితో, ఇటలీ ప్రధాని పావ్‌లో జెంటిలోనితో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ

07/09/2017 - 02:00

చిత్రాలు.. జి-20 సమావేశాల సందర్భంగా వియత్నాం అధ్యక్షుడితో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
*భారత్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకుంటూ మోదీకి ఫుట్‌బాల్‌ను బహూకరిస్తున్న నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్

07/09/2017 - 01:56

హాంబర్గ్, జూలై 8: జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధాని షింజే అబేతో భేటీ అయి ఇరు దేశాల సంబంధాల పురోగతిని సమీక్షించారు. వివాదాస్పద దక్షిణ, తూర్పు సముద్రాల్లో చైనా మిలటరీ ఆధిపత్యం పెరిగిపోతున్న తరుణంలో ఇరు దేశాలు మలబార్ నౌకాదళ విన్యాసాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరువురు నేతలు సమావేశం కావడం గమనార్హం.

07/09/2017 - 01:50

హాంబర్గ్, జూలై 8: జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా హాంబర్గ్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అనేక అంశాలను చర్చించారంటూ తాము చేసిన ప్రకటనను వివరించడానికి భారత్ నిరాకరించింది. సిక్కిం సెక్టార్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొని ఉన్న తరుణంలో ఈ సమావేశం జరగడం తెలిసిందే.

Pages