S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/29/2017 - 02:23

లండన్, ఆగస్టు 28: దక్షిణ ఇంగ్లండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో విప్రోలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లు ఉన్నారు. మినీ బస్సు రెండు ట్రక్కుల మధ్య చిక్కుపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ల మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

08/28/2017 - 02:00

వాషింగ్టన్, ఆగస్టు 27: గత జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశం భారత్-అమెరికా సంబంధాలు మరింత ముందుకు సాగడానికి బలమైన పునాదిని వేసిందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో రక్షణ, ఉగ్రవాద నిరోధం ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

08/28/2017 - 01:34

గ్లాస్గో, ఆగస్టు 27: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కడవరకూ పోరాడిన తెలుగు తేజం పివి సింధు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాతో చివరి క్షణం వరకూ నువ్వా నేనా అన్న చందంగా పోటీపడిన రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు మూడో సెట్ చివరిలో తనకు లభించిన ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

08/25/2017 - 02:17

వాషింగ్టన్, ఆగస్టు 24: దక్షిణాసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వామిగా భారత్ ఎదుగుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. ఆఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా భారత్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొంది.

08/25/2017 - 02:16

బీజింగ్, ఆగస్టు 24: ఆఫ్గనిస్తాన్‌లో శాంతికోసం పాకిస్తాన్ నిర్వహిస్తున్న కీలకపాత్రను అమెరికా గుర్తించాలని చైనా అమెరికాకు సూచించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించటం బాధ్యత అని హితవు పలికింది. చైనా దౌత్య ఉన్నతాధికారి యాంగ్ జీచీ అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌కు పాకిస్తాన్ పట్ల చైనా వైఖరిని స్పష్టం చేశారు. టిల్లర్‌సన్‌తో యాంగ్ ఫోన్‌ద్వారా మాట్లాడారు.

08/25/2017 - 02:06

చోల్‌పోన్-టా (కిర్గిజ్ రిపబ్లిక్), ఆగస్టు 24: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితులకు మరింత మెరుగ్గా స్పందించడానికి 2019లో చైనా, పాకిస్తాన్ సహా షాంఘై సహకార మండలి (ఎస్‌సిఓ) సభ్య దేశాలతో కలిసి సంయుక్తంగా పట్టణ ప్రాంత భూకంప సహాయ, పునరావాస విన్యాసాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ గురువారం తెలియజేసింది.

08/24/2017 - 03:34

మాడ్రిడ్: గత వారం స్పెయిన్‌లో భయోత్పాతాన్ని సృష్టించిన ఉగ్రవాద ముఠా దాడులపై దర్యాప్తును పోలీసులు మరింత విస్తృతం చేశారు. మరింత భారీ దాడిలో బార్సిలోనాలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన కట్టడాలపై దాడి చేయాలని జిహిదీలు పథకం వేసుకొన్నట్లు ఈ దాడుల్లో పట్టుబడిన అనుమానితుడు కోర్టులో చెప్పడంతో పోలీసులు తమ దర్యాప్తును మరింత విస్తృతం చేశారు.

08/24/2017 - 03:33

వాషింగ్టన్: అమెరికా మీడియాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. మీడియాలో నిజాయితీ లోపించిందని, లాబీయింగ్ చేయటానికి మాత్రమే మీడియా ఉపయోగపడుతోందని ఆయన బుధవారం ఆరోపించారు. ఇటీవల వర్జీనియాలో తెల్లజాతీయుల ర్యాలీకి మీడియా పెద్దపీట వేయటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. మీడియా తప్పుడు సమాచారాన్ని అధికంగా ప్రచారం చేస్తూ అమెరికాలో విభజన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

08/24/2017 - 03:31

వాషింగ్టన్: అమెరికా పౌరుల భద్రతకు విఘాతం కలిగిస్తున్న పరిణామాలను అడ్డుకుంటానని, ఇందులో భాగంగా మెక్సికోతో ఉన్న సరిహద్దు పొడవునా గోడ కడతానంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను వ్యతిరేకించడం ద్వారా డెమోక్రాట్లు మొత్తం అమెరికా ప్రజల భద్రతనే ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన అన్నారు.

08/23/2017 - 02:54

సియోల్, ఆగస్టు 22: అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ప్రతి ఏటా నిర్వహించే సైనిక విన్యాసాల ప్రారంభంపై ఉత్తర కొరియా తన సహజసిద్ధమైన బెదిరింపు ధోరణితో స్పందించింది. ఈ విన్యాసాలు తమపై దాడి చేయడానికి జరిపే రిహార్సల్స్‌గా అభివర్ణించిన ఉత్తర కొరియా నిర్దయగా వీటిని తిప్పికొడతామని హెచ్చరించింది. సోమవారం ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు 11 రోజులపాటు సాగనున్నాయి.

Pages