S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/15/2017 - 21:17

పశుపక్ష్యాదులకన్నా ఉత్కృష్టమయినది మానవజన్మ. మనిషికిగల సమీకృత శక్తిని ప్రాథమికంగా నాలుగు విధాలుగా విభజించవచ్చు. అవి- శారీరక (్భతిక) శక్తి, మానసిక శక్తి, బుద్ధిపరమైన / విజ్ఞానపు శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి. ఈ సమీకృత శక్తిని వెలుపలకు తీసుకొని రావడమన్నది ఏకీకృత / ఏకాగ్రత శక్తివలననే సాధ్యమవుతుంది.

01/12/2017 - 21:12

ధనుస్సంక్రమణం నుండీ 3్ధనుర్మాసంగా మనం భావించే నెలనే సంక్రాంతి నెల అని కూడా సంభావించడం తెలిసున్నదే. ఆ నెలరోజులు వాకిళ్లల్లో రంగురంగుల ముగ్గులు తీర్చి ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారు చేసి పసుపు కుంకుమలను అలంకరించి గుమ్మడి పూలను గుచ్చి గొబ్బియల్లో గొబ్బియలో అని కన్యలంతా ఆ గొబ్బెమ్మను గౌరమ్మగా భావించి పూజిస్తారు. ఇలా గొబ్బి పూజ చేయడం వల్ల వారికి మంచి భర్త దొరకుతాడని వారి నమ్మకం.

01/12/2017 - 06:41

వేదములు స్వతఃప్రమాణములని ఋషి పుంగవులు తెలియజేశారు. ఒక్క వేదాలు మాత్రమే స్వతఃప్రమాణములు. మిగిలిన గ్రంథములున్నియూ పరతఃప్రమాణములనబడును. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలగునవన్నీ కూడ వేదానుకూలత ప్రమాణములు. వేదాలు స్వతఃప్రమాణములని మహర్షులు, శంకరాచార్యులు, రామానుజులవారు మధ్వుడు మొదలగు మహానీయులు పేర్కొన్నారు. ‘‘వేద మూలం ఇదం జ్ఞానం.’’

01/11/2017 - 04:34

మనిషి పుట్టుకనుండి మరణం వరకు జరిగేది జీవన ప్రయాణం. జీవికి జన్మ పరంపరలు తప్పనిసరియైనవి. జీవికి జన్మ లేకుండా మోక్షము అనేది కడు దుర్లభం. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం గొప్ప అదృష్టం. జన్మరాహిత్య సాధనకై దొరికిన సువర్ణ అవకాశం. మనిషి పుట్టుక - మరణం మధ్య ప్రయాణం అన్నీ భగవంతుని నిర్దేశంగా జరిగేవి తన ప్రమేయంతో జరుగుతున్నాయని జరుపుతున్నానని అనుకోవడం జరుగుతుంది.

01/08/2017 - 22:01

ఆ శక్తినే వివిధ రూపాల్లో, విభిన్న నామాల్లో దర్శిస్తాం.. పూజిస్తాం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క శక్తి ఉంది. చైతన్య స్వరూపంగా , జ్ఞానజ్యోతిగా ప్రకాశించినప్పుడు సరస్వతీదేవిగా పిలుస్తాం, ఆరాధిస్తాం, ఉపాసిస్తాం.

01/07/2017 - 22:55

ఏకాదశి విష్ణు వరప్రసాది. ప్రతిమాసంలో రెండు చొప్పున 24 లేక 26 ఏకాదశులు సంవత్సరంలో వస్తాయ. వాటిల్లో ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి పవిత్రమైనా అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో పుష్యశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రాచుర్యం పొందిం ది. ఈ రోజున చేసే కార్యాలన్నీ విష్ణుప్రీత్యర్థం చేస్తే వేలకోట్ల పుణ్యరాశులు సొంతం అవుతాయ. వైకుంఠద్వారంలో మహావిష్ణువు దర్శనార్ధం ముక్కోటిమంది దేవీ దేవతలు వస్తారు.

01/06/2017 - 21:12

భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుందని చరిత్ర చెప్తోంది. సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహాలు నిత్యం ప్రదక్షిణం చేస్తూ, ఎంతో శక్తిని పుంజుకుంటున్నాయి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు మొదటగా ఆచరించేది, ధ్వజస్తంభం నుంచి ఆలయం చుట్టూతా ప్రదక్షిణాలు చేయడం. రమణ మహర్షి మాటల్లో ప్రదక్షిణం అనే పదానికి ఒక అర్థం ఉంది.

01/05/2017 - 21:20

కసవుచే నీటిచే మోదకలన చేత
బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరమునకు
శబర కైవర్త సూచక జనులు జగతి
గారము లేని పగవారు గారె తలప
భావము: పరులను పీడింపకుండానే గడ్డిపరకలతో కాలయాత్రను గడుపుకునే లేళ్ళు, మొదలైనవాటికి బోయలు, నీటితో బ్రతికే చేపలకు జాలర్లు, దొరికిన దానితో సంతోషించి కాలయాపన చేసే సజ్జనులకు కొండెగాండ్రు అకార శత్రువులవలె కనిపిస్తారు

01/05/2017 - 21:17

మనుష్యుల ప్రవర్తనను బట్టి మనుష్యులను ఉత్తములు, దుర్మార్గులు, మిశ్రమ వ్యక్తులు అని విభజించారు. ఉత్తములు అనేవారిని సత్పురుషులు అంటారు. వీరిలో ఎప్పడూ మంచిగాను, హృదయము మనస్సు కూడా నలుగురికి మంచి చేయడానికే చూస్తుంది. ఎన్ని ఆటంకాలు కలిగినా మంచినే చేయటానికి చూస్తారు.

01/05/2017 - 08:45

వ్యాసభగవానుడు వేదాలను విభజన చేశాడు. సర్వధర్మాలను తెలుసుకొని ఆచరించేవాడు. సర్వధర్మాలను వివరించే మహాభారతాన్ని రచించాడు. కాని మనశ్శాంతి లేకనిరంతరం దుఃఖంతో ఉండేవాడు. అట్లాంటి ఓ రోజున నారదుడు వ్యాసుని ఆశ్రమానికి వచ్చాడు. నారదునితో తన మనసులోని బాధను వివరించాడు. అపుడు నారదుడు దీనికి కారణం భగవంతుని కథలను వినకపోవడం వినిపించకపోవడమే నన్నాడు.

Pages