S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/26/2017 - 06:52

ఒకసారి ధర్మరాజు యాత్రలను సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్పాన్నింటికి శ్రీకృష్ణుడే అధిపతి అని అనుకునేవాడు. ఆ సంకల్పాలను శ్రీకృష్ణుడితో చెప్పి వాటిని ఆరంభించేవాడు. తాను ఒక అనుకొన్న యాత్రల గురించి కృష్ణుడితో చెప్పాలని అనుకొని ఆయన దగ్గరకు వెళ్లాడు. శ్రీకృష్ణుని చూచి ఆనందంతో నమస్కరించి ఆమాట ఈమాటమాటాడేలోపులే అక్కడికొక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కృష్ణునికి నమస్కరించి మహానుభావా నేను కాశీకి వెళ్లదలిచాను.

01/24/2017 - 21:07

ప్రతి వ్యక్తి, మాతృగర్భంనుండి బయటకు వచ్చి, నడక నేర్చుకొని మాటలు మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత అతని జీవితంలో ప్రాధాన్యత కలిగియుండి, అతని భవిష్యత్‌కు దారులు వేసేది మహానుభావులయిన గురువులే.

01/22/2017 - 22:13

సర్వ ప్రాణికోటి జీవనాధారం ఆహారమే! మనలోని ఆకలిని చల్లబరిచి, శరీరంతోపాటు పంచ ప్రాణాలకూ ఆధారమై, పంచభూతాల సాక్షిగా శక్తిని సమకూర్చే అన్నం సృష్టి యజ్ఞానికే ఆలంబన. ఈ ఆహారం వల్లనే మనిషిలో సత్వరాజస తామస గుణాలు ఏర్పడుతాయని అంటారు.

01/22/2017 - 00:05

అహంకారాన్ని, లోభితనాన్ని వదిలివేసినవారికి ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. మనిషిలో అజ్ఞానం ఉంటే వారిలో అహంకారం మొదలవుతుంది. తెలిసింది తక్కువైతే అదే అజ్ఞానానికి హేతువు అవుతుంది. అంతే కాక మానవునిలో లోభత్వం కూడా మనిషిని దుర్గుణాలవైపుకు ప్రయాణం చేసేలా చేస్తుంది.

01/20/2017 - 21:30

వగగొను లోభముం తిశున భావము సత్యము చిత్తశుద్ధియుం
దగు సుజనత్వమున్ సుమహితత్వము విద్యయు లోకనిందయుం
దగిలిన, దుర్గుంణబు దురితంబు దపంబును తీర్థ సేవ భృత్యగణము సొమ్ములుం ధనచయంబును జావును వేఱయున్నవే?

01/20/2017 - 21:27

సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే

01/19/2017 - 21:15

హ్రీరమ్యుంజడుగాంగ, సువ్రతుని మాయింగా, శుచిందంభిగా
శూరున్ నిర్దయుగా, మునిన్ విమతిగా, శ్రోత్రప్రియాలాపు ని
స్వారుంగా బలవంతు గర్వితునిగా సద్వక్త వాచాలుగా
గ్రూరుండెన్ని సుధీగుణంబు దురితారూఢంబు జేయుంగదా!

01/19/2017 - 21:11

ఏ కాలమైనా శివపూజకు అడ్డు ఉండదు. శివా అనినోరారా పిలవడానికి ఏ కార్తీకమో లేక వైశాఖ కానక్కర్లేదు. గుణీతీతుడైన శివునకు ఫలానా మాసాలు ఇష్టం ప్రీతికరం అని శాస్త్రాలు చెపుతున్నాయంటే అందులో ఒక అంతరార్థం ఉండి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. సామాన్యులు మూఢులు శివానుగ్రహం అనే వస్తువు తెలీని వారు చాలా మందే ఉండి ఉంటారు.

01/19/2017 - 05:14

నేడు మానవుడు మనిషిగా మానవత్వం మరిచి మృగంలా మారిపోతున్నాడు. రోజూ మన కళ్ళముందు జరుగుతున్న దారుణాలు, నేరాలు, ఘోరాలు ఎన్నో. కష్టపడి పనిచేయకుండా అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు పాల్పడి ఎంతోమంది యువత తమ విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు. ఇదంతా ఆగాలంటే ఎలా?! మనిషికి సత్ సంకల్పం కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. మనిషి మహనీయుడు కాగలడు. అలాంటి ఉదంతాలు ఈ భారతావనిలో కోకొల్లలు.

01/17/2017 - 21:29

భారతీయ సనాతన ధర్మశాస్తమ్రులలో వేదములలో ఉపనిషత్తులలో యజ్ఞము యొక్క వైశిష్ట్యము విశేషంగా తెలుపబడినది. వైకుంఠంలోని శేషశయనుడై శ్రీమహావిష్ణువే భగవద్గీతలో అర్జునునికి ప్రకృతి సంరక్షణకు, ప్రజా సంరక్షణకు, దేవతల అనుగ్రహ ప్రాప్తికి యజ్ఞములను గురించి, యజ్ఞ విధానముల గురించి, బోధించి లోకోపకారముగావించినాడు.

Pages