S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/16/2018 - 03:21

ఆత్మకూరు, అక్టోబర్ 15: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం రూ.7 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం హౌసింగ్ ఏఈ రంగస్వామిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన లబ్దిదారుడు రాజశేఖర్ 2006లో మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఏఈని సంప్రదించగా ఆయన రూ. 10వేలు లంచం అడిగాడు.

10/16/2018 - 02:12

పెనుగంచిప్రోలు, అక్టోబర్ 15: తిరుపతమ్మ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఒక హిజ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట్ల గ్రామానికి చెందిన పాలకూటి రామయ్య ఎలియాస్ రమ్య తన 8మంది స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం తిరుపతమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు.

10/16/2018 - 02:08

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15: తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోలాహలం మొదలయ్యింది. ఇప్పటికే ఎత్తులకు పైఎత్తులతో పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టగా.. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తులు మొదలు పెట్టింది. ఎలక్షన్ కమీషన్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి ముమ్మర తనిఖీలను ప్రారంభించింది.

10/16/2018 - 02:00

గచ్చిబౌలి, అక్టోబర్ 15: పగటిపూట ఇంటికి తాళం కనబడితే ఇల్లు గుల్లవ్వాల్సిందే. క్షణంలో ఇంట్లో ఉన్న నగదు నగలతో ఉడాయించి జల్సాలు చేసే కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఒంటరిగానే దొంగతనాలు చేయడం ఇతని ప్రత్యేకత.

10/16/2018 - 02:00

ఉప్పల్, అక్టోబర్ 15: కుటుంబ సమస్యల పంచాయతీ ఓ యువకుడి మృతికి దారి తీసింది. భార్య, అత్త, బంధువుల వేధింపులతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ వాసవీనగర్‌లో నివసిస్తున్న పడకంటి శ్రీకాంతచారి (28) ఇదే ప్రాంతంలో నివసిస్తున్న భవానీని ఐదునెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

10/15/2018 - 23:42

రేణిగుంట, అక్టోబర్ 15: టాస్క్ఫోర్స్ దాడులతో దిక్కుతోచని స్మగ్లర్లు తాము ఒకప్పుడు స్మగ్లింగ్‌కు ఉపయోగించిన పాత ప్రాంతాలను తిరిగి ఎంపిక చేసుకుని అక్కడ నుంచి అక్రమ రవాణాకు సిద్ధపడుతున్నా వారిని టాస్క్ఫోర్స్ సిబ్బంది వదిలిపెట్టడంలేదు. అటవీప్రాంతంలో అడుగుజాడలు కనిపిస్తే చాలు స్మగ్లర్లు ఎంత దూరం వెళ్లినా వారిని వదిలిపెట్టకుండా వెంటాడుతున్నారు.

10/15/2018 - 23:42

చిత్తూరు, అక్టోబర్ 15: మాదమరి మండలం కోటాల అటవీ సరిహద్దులో ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసుల అరెస్టు చేసారు.

10/15/2018 - 23:41

మదనపల్లె, అక్టోబర్ 15: బతుకుదెరువుకోసం వచ్చిన ఓ యువకుడు కరెంట్‌షాక్ గురై మృతిచెందిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సునీల్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కురున్(22) గత ఆర్నేళ్లుగా మదనపల్లె ప్రాంతంలోని బోరుబండి కార్మికుడుగా పనిచేస్తున్నాడు.

10/15/2018 - 22:46

న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్ 15: గత కొన్ని వారాలుగా యావద్‌భారతాన్ని కుదిపేస్తున్న మీ-టూ ఉద్యమం సోమవారం సరికొత్త మలుపు తిరిగింది. గతంలో తమను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళలపై పరువునష్టం కేసులు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌లు తమపై అరోపణలు చేసిన మహిళలపై పరువు నష్టం కేసులు నమోదు చేశారు.

10/15/2018 - 01:59

నాంపల్లి, అక్టోబర్ 14: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని దామెర గ్రామంలో మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన కూరాకుల రజిత అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో జొరబడిన అదే గ్రామానికి బచ్చనబోయిన రమేశ్ ఆమెను పరుష పదజాలంతో తిడుతూ సమీపంలోని వ్యవసాయ భూమి వద్దకు లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు.

Pages