S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/13/2018 - 23:09

నక్కపల్లి, అక్టోబర్ 13: ఇక్కడికి సమీపంలోని వేంపాడు టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారిపై శనివారం తమిళనాడుకు చెందిన కొంతమంది దుండగులు మారణాయుదాలతో వచ్చి అదేరాష్ట్రానికి చెందిన గంజాయి స్మగ్లర్‌గా అనుమానిస్తున్న ఒక యువకుడిని సినీ ఫక్కీలో హత్యోదంతం స్థానికంగా సంచలనం రేగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణానికి సమీపంలో గల పుదూరు గ్రామానికి చెందిన పి.

10/13/2018 - 23:07

నర్సీపట్నం, అక్టోబర్ 13: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని యరకన్నపాలెం గ్రామంలో ఈసంఘటన చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీను అందించిన వివరాల ప్రకారం యరకన్నపాలెం గ్రామానికి చెందిన చిటికెల కోటయ్యనాయుడుకు కోటవురట్ల మండలం సుర్లవానిపాలెంకు చెందిన హేమలత(24)తో 2013 మార్చిలో వివాహం జరిగింది.

10/13/2018 - 23:05

విజయనగరం, అక్టోబర్ 13: అంతర్‌జిల్లా నేరస్తుడు కొర్నాల పైడిరాజును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తికి అందిన సమాచారం మేరకు వన్‌టౌన్ ఎస్సై, సిబ్బందితో కలసి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుని నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరచుకున్నారు.

10/13/2018 - 23:04

విజయనగరం, అక్టోబర్ 13: జిల్లాలోని నాతవలస జంక్షన్ వద్ద ఎకె 47 ఉన్న బ్యాగ్ గల్లంతు కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. శనివారం వేకువఝామున 4.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఇవిఎంలను వాహనంలో తీసుకెళ్తుండగా, అందులో ఒక బ్యాగ్ మిస్సయ్యింది. ఆ బ్యాగ్‌లో ఎకె 47 ఉండటంతో పోలీసులు ఖంగుతిన్నారు.

10/13/2018 - 22:55

ద్వారకాతిరుమల, అక్టోబర్ 13: శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురైన ఒక గుర్తుతెలియని వృద్ధుడు శనివారం మృతిచెందాడు. సుమారు 70 ఏళ్ల వయసున్న ఈ వృద్ధుని ఆచూకీ తెలియరాలేదు. స్థానికుల కథనం ప్రకారం.. దాదాపు రెండు నెలల క్రితం క్షేత్రానికి వచ్చిన ఈ వృద్ధుడు ఆలయ పరిసరాల్లోనే సంచరిస్తుండేవాడు. అనివేణి మండపంలో పురోహితుడు పెట్టేది తింటూ బతికేవాడు.

10/13/2018 - 22:42

చిలకలూరిపేట, అక్టోబర్ 13: చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒక విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. చిలకలూరిపేట పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన రమావత్ బాలు నాయక్ (15), తిరుపాల్, ఖాశిం మిత్రులు. వీరు పురుషోత్తపట్నం సాయిబాబా గుడి దగ్గరలో ఉన్న ఓగేరు వాగులోకి ఈతకు వెళ్లారు.

10/13/2018 - 22:37

అమలాపురం, అక్టోబర్ 13: నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జరుపుతున్న పాన్ షాపులపై అమలాపురం పట్టణ పోటీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడు పాన్ షాపుల్లో గుట్కా విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తించి ఏడుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపుల్లో నిల్వ ఉంచిన పదివేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు.

10/13/2018 - 22:26

కడప,అక్టోబర్ 13: గుట్కాలాంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ, అక్రమ వ్యాపారాలు చేస్తున్న 10మందిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు రెండు టాటా సుమోలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ షేక్ మాసూంబాషా పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు.

10/13/2018 - 01:51

కుప్పం, అక్టోబర్ 12: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేవరాజపురంలో శుక్రవారం వైసీపీ జెండా ఆవిష్కరణను ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో పార్టీ జెండాను ఎలా ఆవిష్కరిస్తారంటూ టీడీపీ, వైసీపీ కార్యకర్తల నడుమ తోపులాటలు జరిగింది. చివరకు ఎలాగోలా పార్టీ జెండాను గ్రామంలో ఆవిష్కరించారు. తోపులాటలో గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రమిల(60), మల్లమ్మ(50), సెల్వి(50), గాంధీయా(30)లకు గాయాలయ్యాయి.

10/13/2018 - 01:17

ఖైరతాబాద్, అక్టోబర్ 12: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇంట్లో చోరికి పాల్పడ్డ నిందితున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

Pages