S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/07/2018 - 23:26

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 7: సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్థానిక మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు రేలంగి జీవరత్నం(50) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు.

09/07/2018 - 23:20

శంఖవరం, సెప్టెంబర్ 7: శంఖవరంలోని ఎస్సీ కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఎస్సీ కాలనీవాసులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఊహించని రీతిలో జరిగిన ఈ హత్యల ఘటనలతో ప్రజలు భీతావహులయ్యారు. ఎక్కడ చూసినా వీధులు నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. కాలనీలో శాంతిభధ్రతల నేపధ్యంలో పోలీస్ పికెట్లు కొనసాగిస్తుండగా, 144 సెక్షన్ అమల్లో ఉండటంతో వీధులన్నీ పోలీసుల పహారాతో కన్పిస్తున్నాయి.

09/07/2018 - 22:31

పొదలకూరు, సెప్టెంబర్ 7: మండలంలోని ఇనుకుర్తి అటవీ ప్రాంతంలో శుక్రవారం గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. పశువుల కాపరులు మృతదేహాన్ని గమనించి గ్రామస్తుల దృష్టికి తీసుకువచ్చారు. మృతురాలి వయస్సు 75 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్సై రవినాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

09/07/2018 - 22:30

పొదలకూరు, సెప్టెంబర్ 7: పెద్దలకు ఇష్టంలేని ప్రేమవివాహం చేసుకున్న ప్రేమజంట శుక్రవారం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. కలువాయి మండలం కుళ్లూరుకు చెందిన నరసింహులు, అదే గ్రామానికి చెందిన స్వప్న గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో నాలుగు రోజుల కిందట పెద్దలకు తెలియకుండా కడపకు వెళ్లి అక్కడ ఒక గుడిలో పెళ్లిచేసున్నారు.

09/07/2018 - 22:30

గూడూరు, సెప్టెంబర్ 7: నగదు కోసం ఓ వ్యక్తిని బ్లేడుతో కోసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి గూడూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె రామకృష్ణారావు ఏడేళ్లు జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

09/07/2018 - 22:23

బి.కొత్తకోట, సెప్టెంబర్ 7: మండలంలోని గుమ్మసముద్రం వద్ద కరెంట్ స్తంభాన్ని స్కూల్ వ్యాన్ ఢీకొని ఆరుగురు పిల్లలకు గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళ్తే బి.కొత్తకోట పట్టణంలోని శ్రీ్భగవాన్ సాయిరాం స్కూల్ విద్యార్థులు వ్యాన్‌లో 20మంది పిల్లలతో గట్టుకు బయలుదేరింది.

09/07/2018 - 22:21

తిరుపతి, సెప్టెంబర్ 7: తిరుమల కాలిబాటలోని జీఎన్‌సీ సమీపంలో ఉన్న చివరి మెట్టు వద్ద శుక్రవారం తెల్లవారు జామున చిరుతపులి సంచారం కనిపించింది. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది కాలి బాట వద్దకు వెళ్లి భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు పులిని అడవిలోకి తరిమేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పటికే చిరుత పులి అక్కడ నుంచి అదృశ్యమైంది. అయితే భక్తులు మాత్రం భయాందోళనకు గురయ్యారు.

09/07/2018 - 22:12

అరకులోయ, సెప్టెంబర్ 7: మండలంలోని యండపల్లివలస సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మైదాన ప్రాంతానికి తరలించారు. అరకులోయ నుంచి అరకు సంత వరకు వెళుతున్న ఆర్.టి.సి. బస్సు అరకు నుంచి అరకులోయ వైపు వస్తున్న ఆటో యండపల్లివలస వద్ద ప్రమాదవశాత్తు డీ కొన్నాయి.

09/07/2018 - 22:02

పొందూరు, సెప్టెంబర్ 7: మండలం రాపాక గ్రామ పరిథిలో గల క్వారి నీటి బంద చెరువులో గురువారం రాత్రి పొందూరు మేజర్ పంచాయతీ కుమ్మరి కాలనీకి చెందిన వజ్జి పోలయ్య (49) పడి దుర్మరణం చెందారు. శుక్రవారం ఉదయం బందలో మృతుని శవం తేలియాడింది. చుట్టుపక్కల చూపరులు చూసి పోలయ్య మృత దేహంగా గుర్తించారు. స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు.

09/07/2018 - 21:39

ధర్మవరం, సెప్టెంబర్ 7: మండలంలోని గొట్లూరు బస్‌షెల్టర్ వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ గొట్లూరు బస్‌షెల్టర్ వద్ద పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని స్థానికులు 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Pages