S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/07/2018 - 21:38

గుత్తి, సెప్టెంబర్ 7 : మున్సిపాలిటి పరిధిలోని గుత్తి ఆర్‌ఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్యాణ్ (25) మృతి చెందాడు. గుత్తి ఆర్‌ఎస్‌లో నివాసం ఉంటున్న కల్యాణ్ చెట్నెపల్లిలో స్నేహితుల వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి బోల్తాపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

09/07/2018 - 06:10

సుల్తానాబాద్, సెప్టెంబర్ 6: బతికినంత కాలం ఒంటరిగా..ఎవరికి భా రం కాకుండా తుది శ్వాస విడిచి తన మిగిలిన పార్థీవదేహంను వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ పాఠంగా మిగిలిపోయి తన జన్మ సార్థకత చేసుకున్న కందుకూరి కళాకర్ చారి ఇక లేరు అ నడం కంటే వైద్య కళాశాల విద్యార్థు ల ప్రయోగశాలకు పాఠంగా వెళ్లారు.

09/07/2018 - 02:42

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి పెరారివళన్ క్షమాభిక్ష దరఖాస్తును పరిశీలించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్‌లు రంజన్ గొగొయ్, నవీన్ సిన్హా, కెఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం నిందితుడి ఇదివరకే తమిళనాడు ప్రభుత్వానికి చేసిన క్షమాభిక్ష అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.

09/07/2018 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: స్వలింగ సంపర్కం నేరం కాదని, ప్రస్తుతం అమలవుతున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 377 సెక్షన్ భారత రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. బ్రిటిష్ పాలనలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించారు. ఆ చట్టాలే స్వతంత్ర భారత దేశంలోనూ అమలవుతున్నాయి. 158 సంవత్సరాల క్రితం స్వలింగ సంపర్కం నేరమంటూ చేసిన చట్టానికి సుప్రీం కోర్టు తీర్పుతో కాలంచెల్లింది.

09/07/2018 - 01:27

నాయుడుపేట, సెప్టెంబర్ 6 : కుటుంబ సమస్యలతో రైలు కింథ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తిరుమలేశు అనే వివాహితుడు త్రుటిలో తప్పిన ప్రమాదంలో ఆసుపత్రిపాలైన సంఘటన గురువారం నాయుడుపేట రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తిరుమలేశుకు వివాహమై ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పట్టణంలో బార్బర్ షాపు ఉంది. గురువారం సాయంత్రం రైల్వేస్టేషన్ వద్దనే ఉంటూ రైలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

09/07/2018 - 01:15

రైల్వేకోడూరు, సెప్టెంబర్ 6: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి ముందు, గురువారం తెల్లవారు జామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సీఐ సాయినాథ్ గురువారం విలేఖరులకు వివరించారు. వారి కథనం మేరకు వివరాలిలావున్నాయి.

09/07/2018 - 04:52

కీసర, సెప్టెంబర్ 6: చెరువులో దూకి బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చీర్యాలలో చోటు చేసుకుంది. సీఐ సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన నిత్యానంద్ కుమార్తె సోనీ (24) చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఇంట్లో తల్లిదండ్రులు మందలించారు. తీవ్ర మనస్థాపానికి గురై కళాశాలకు వెళ్లింది.

09/07/2018 - 00:40

శంఖవరం, సెప్టెంబర్ 6: రెండేళ్లుగా నెలకొన్న పాత కక్షల నేపథ్యంలో ఒక వివాహ వేడుక సందర్భంగా ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల సజీవదహనానికి దారి తీసింది. ప్రత్యర్థుల దాడి నుండి తప్పించుకోవడానికి పెళ్లి ఇంట్లో తలదాచుకున్న సోదరులపై అత్యంత పాశవికంగా కిటికీ నుంచి పెట్రోలు పోసి, నిప్పంటించి సజీవదహనం చేశారు. తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటు చేసుకుంది.

09/07/2018 - 01:15

ఖాజీపేట, సెప్టెంబర్ 6: కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమల బయల్దేరిన తుఫాన్ వాహనం గురువారం ఖాజీపేట వద్ద రివైడర్‌ను ఢీకొని వాగులో పడింది. ఈ ఘటనలో లక్ష్మణ్ (50), గణేశ్ (30), మరొక వ్యక్తి మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడి కడపలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా తండా గ్రామానికి చెందిన 21 మంది ప్రయాణికులు తిరుమల దైవ దర్శనానికి బయల్దేరి వచ్చారు.

09/07/2018 - 01:16

పెద్దపంజాణి: ఓ అమ్మకడుపున పుట్టిన అన్నదమ్ముల పేగుబంధం వీడక కలిసి మృత్యువాత పడ్డారు.ట్రాక్టర్ కూలీకోసం వెళ్ళి, ఇసుకదిబ్బలు విరిగిపడి మీద పడడంతో మృతి చెందారు. మృత్యువులోనూ వీరి రక్తబంధం వీడలేదు. ఈ విషాద సంఘటన పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ముదరంపల్లె పంచాయతీకి చెందిన బాలిరెడ్డి, రామక్కలకు ఆరుగురు సంతానం.

Pages