S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/16/2018 - 00:13

కావలి టౌన్, జూన్ 15: పట్టణ పరిధిలోని కొనెదినె్న గిరిజన కాలనీకి చెందిన మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన అద్దూరి తిరుపతయ్య(35) పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. కావలి 1వ పట్టణ ఎస్సై అంకమ్మ తెలిపిన వివరాల మేరకు బాధితురాలి తండ్రి ఆరేళ్ల కిందట మరణించాడని అప్పటి నుంచి ఆమె నానమ్మ సంరక్షణలో ఉంటోందన్నారు.

06/15/2018 - 23:59

గుంటూరు, జూన్ 15: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో గురువారం ఉదయం జరిగిన భారీ దోపిడీ కేసును నగర పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు శుక్రవారం అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు విలేఖర్లకు వివరించారు.

06/15/2018 - 04:33

హైదరాబాద్, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు కరీంనగర్ ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 18న ట్రయల్‌కోర్టు ముందు హాజరుకావాలని కోడెలకు సమన్ల జారీ అయ్యాయి.

06/15/2018 - 03:38

న్యూఢిల్లీ, జూన్ 14: ఢిల్లీ ఎయిర్ పోర్టులో గత మూడు రోజుల్లో 14 మంది విదేశీయుల నుంచి రూ.8కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురు చైనీయులు, ఇరాన్ దేశస్థుడు ఒకరు, ఐదుగురు అజర్‌బైజాన్‌కు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్దమొత్తంలో స్మంగ్లింగ్ బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారని కస్టమ్స్ జాయింట్ కమిషనర్ అనుభా సిన్హా తెలిపారు.

06/15/2018 - 03:31

విశాఖపట్నం, జూన్ 14: గతంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో క్లర్క్ కం క్యాషియర్‌గా పనిచేసి, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి బ్రాంచీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వి.సంతోషి రాము ఆర్థిక నేరానికి పాల్పడినందుకు అతనిపై సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు.

06/15/2018 - 01:58

వికారాబాద్, జూన్ 14: స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ళ విద్యార్థి మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని నారాయణ పాఠశాలలో రామయ్యగూడకు చెందిన పాపయ్య, లక్ష్మిల కొడుకు సాయి విఘ్నేష్(4) చదువుతున్నాడు. గురువారం సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వ్యాన్‌లో వెళ్ళి స్టేజి వద్ద దిగాడు.

06/15/2018 - 01:17

చెన్నై, జూన్ 14: తమిళనాడులో 18మంది ఏఐడిఎంకె ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ పి.్ధన్‌పాల్ తీసుకున్న నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు పరస్పర విరుద్ధ తీర్పులను ఇచ్చింది. స్పీకర్ నిర్ణయం సమర్థనీయమేనని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ పేర్కొనగా, దీనిని మరో జడ్జి ఎం.సుందర్ విభేదించారు. తుది తీర్పు నిమిత్తం కేసును మరో బెంచ్‌కు పంపాలని నిర్ణయించారు.

06/15/2018 - 01:04

హైదరాబాద్, జూన్ 14: లంచం తీసుకున్న కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ విక్టర్ దినేశ్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి భాస్కరరావు తీర్పు చెప్పారు.

06/15/2018 - 00:48

విజయవాడ (క్రైం), జూన్ 14: ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో ఎట్టకేలకు గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో గత ఎనిమిది సంవత్సరాలుగా జైలులో ఉంటూ నేరారోపణలు ఎదుర్కొన్న మోర్లా శ్రీనివాసరావు, వెంపరాల జగదీష్, పంది వెంకట్రావ్ గౌడ్‌లకు జీవితఖైదుతోపాటు రూ.4,500 చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.

06/15/2018 - 00:38

దర్శి, జూన్ 14 : ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన గురువారం తెల్లవారు జామున దర్శి పట్టణంలోని జెండా చెట్టు వీధిలో చోటు చేసుకుంది. జెండా చెట్టువీధిలో నివాసం ఉంటున్న పానెం ఖాశీంవలిని తన భార్య ఖాశీంబి , ప్రియుడు రమణయ్యతో కలిసి గురువారం తెల్లవారు జామున నైలాన్ వైరుతో గొంతు బిగించి హత్య చేశారు.

Pages