S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/01/2018 - 21:36

సత్తా వుంటే ఎన్ని విభాగాల్లో అయినా ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ ఆడేయొచ్చని మందిరా బేడీ ఎప్పుడో నిరూపించింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్‌లకు గ్లామర్ రంగరించి ఈమె చేసిన హంగామా మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడీ బ్యూటీ ఏజ్ 45 సంవత్సరాలు అయినా సరే ఏ మాత్రం సంకోచించకుండా తన ఎక్స్‌పోజింగ్ ఫొటోలను నెట్‌లో పెట్టేస్తోంది.

04/01/2018 - 21:34

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరో గా తెరకెక్కుతున్న జంబలకిడిపంబ జె.బి.మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మోడల్, థియేటర్ ఆర్టిస్టు సిద్ధి ఇద్నానిని ఎంపిక చేశారు. చక్కటి వినోదంతో కూడిన ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు నటనకు మంచి స్కోప్ వుండడంతో పలువురిని పరిశీలించి సిద్ధిని ఎంపిక చేశారట.

04/01/2018 - 21:31

పోలీస్.. పోలీస్ హోతీ! న హిందూ పోలీస్.. న ముసల్మాన్ పోలీస్../ హిందు పోలీసులు.., ముస్లిమ్ పోలీసులు అని విడివిడిగా వుండరు. పోలీసులు అంటే పోలీస్‌లే...! అంటూ బిగ్గరగా అరుస్తూ అగ్గి రుద్రుడు అయ్యాడు. జవహర్‌లాల్ నెహ్రూజీ!- ఇప్పుడు కాదు ఎప్పుడో...! మన దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో...

04/01/2018 - 21:30

తెరపైన అందాలు ఆరబోయడంలో ఏమాత్రం లోటు చూపని భామల్లో బాలీవుడ్ భామ రాధిక ఆప్టే ఒకరు. ఈమె కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతుందో లేదా ఈమె ఏం మాట్లాడినా అది వివాదం అయిపోతుందో తెలీదు కానీ రాధిక ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఈమధ్యనే నేహాథూపియా షోకి వచ్చిన ఈ తార హోస్ట్ అడిగిన ఘాటు ప్రశ్నకి ఫన్నీగా సమాధానమిచ్చి తప్పించుకుంది. వచ్చిన గెస్ట్ ఎవరైనా వాళ్లని తన ప్రశ్నలతో చల్లగా కూపీ లాగడంలో నేహాథూపియా దిట్ట.

04/01/2018 - 21:26

బాలీవుడ్‌లో ఇప్పటికే విరాట్-అనుష్కల పెళ్లి పూర్తయిపోగా.. మరో ప్రేమ జంట రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొనెలు కూడా ఇందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది గతేడాది చివరిలో విరుష్కల వివాహం జరిగితే.. ఈ ఏడాది చివరకు డీప్-వీర్ ఒకటి కాబోతున్నారట. రెండు నెలల క్రితమే అంటే సరిగ్గా పద్మావత్ మూవీ రిలీజ్‌కు ఓ వారంరోజుల ముందు ఓ పూజా కార్యక్రమం నిర్వహించారు రణ్‌వీర్-దీపిక.

03/30/2018 - 21:14

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ మొదటిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదివరకే అమితాబ్‌బచ్చన్ అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రంలో ఓ చిన్న గెస్ట్ పాత్రలో కనిపించాడు. ఆయన పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిదే.

03/30/2018 - 21:12

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదట. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం కేర్ తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్ మార్క్ శైలిలో తెరకెక్కే ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, దానికోసం ఎన్‌టిఆర్ కూడా కొత్త గెటప్‌లో కన్పిస్తాడని వార్తలు వస్తున్నాయి.

03/30/2018 - 21:11

సీనియర్ నటి సీత ముఖ్య పాత్రలో కె.ఎం.ఆనంద్ దర్శకత్వంలో ఆర్.పిక్చర్స్ పతాకంపై సిహెచ్.రాంబాబు నిర్మిస్తున్న చిత్రం ‘భద్రకాళి’. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇందులో సీనియర్ నటి సీత అమ్మవారిగా నటిస్తున్నారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం.

03/30/2018 - 21:09

ప్రముఖ నటుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూకీ చిత్రం మెర్క్యురీ. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ సంతానం, జయంతిలాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆప్ లాస్ ఏంజిల్స్‌లో ప్రదర్శనకు ఎంపికైంది.

03/30/2018 - 21:06

కె.వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసల్ ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో శ్రీకృష్ణా శంకర ప్రొడక్షన్స్ పతాకంపై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘అరుంధతి అమావాస్య’. కె.విద్యారాణి సహ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైంది.

Pages