S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/12/2017 - 00:55

సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నిఖిల్‌తో ఆడిపాడిన త్రిధా చౌదరికి ఆ తరువాత సరైన అవకాశాలు రాలేదు. అందానికి అందం, నటనకు నటన చేయగల ఈ అమ్మడుకు తెలుగులో సరైన సపోర్టు దొరకకపోవడంతో అవకాశాలు చిన్నచూపు చూశాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల ఆమె చేసిన ఫొటోషూట్‌కు మంచి స్పందన లభించింది. హాలిడే వచ్చిందంటే చాలు ప్రయాణాలు చేస్తూ ఆనందించడానికే ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఈ అమ్మడు.

01/12/2017 - 00:54

ఇటీవల విడుదలైన నేనొస్తా చిత్రంలో తాను నటించిన సైకో పాత్రను అందరూ ఆమోదించారని, ఈ ఒక్క సినిమాతోనే పలు అవకాశాలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నూతన నటుడు జ్ఞానప్రకాష్ తెలిపారు. ఆయన ఇటీవల నటించిన నేనొస్తా చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. హీరోగా అవకాశాలు పొందాలనుకున్న తనకు, తొలి చిత్రమే మంచి పునాది పడినట్లుగా భావిస్తున్నానని తెలిపారు.

01/12/2017 - 00:53

అనీష్ చందర్, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ధృవశేఖర్ దర్శకత్వంలో ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రేయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘లవర్స్ క్లబ్’. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుదలై ఆదరణ పొందుతోందని నిర్మాత భరత్ అవ్వారి తెలిపారు.

01/12/2017 - 00:52

ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గ్లామర్ భామ త్రిష భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ‘నాయకి’ అంటూ భయపెట్టడంలో విఫలమైన త్రిష, మరోసారి మోహినిగా భయపెట్టడానికి సిద్ధమైంది. ఈ సినిమాలతోపాటు 96, 1818 వంటి భిన్నమైన సినిమాలను చేస్తున్న త్రిష లేటెస్టుగా మరో లక్క్ఛీన్స్ కొట్టేసింది.

01/10/2017 - 22:34

జీవా, కాజల్ జంటగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.కె.దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. తమిళంలో విజయవంతమైన కవలై వేండాం చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ, యువతరం మెచ్చే వైవిధ్యమైన కథాకథనాలతో లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తమిళంలో విజయవంతమైందని, తెలుగులో స్ట్రయిట్ సినిమాలా రూపొందించామని తెలిపారు.

01/10/2017 - 22:29

సాగర్ హీరోగా, స్వప్నిక హీరోయిన్‌గా కళింగ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నండూరి వీరేష్ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న చిత్రం ‘సంభవం’. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆత్మీయ అతిథుల మధ్య ప్రారంభమైంది.

01/10/2017 - 22:27

రచయిత్రిగా, డైరెక్టర్‌గా ఓ ఇమేజ్ తెచ్చుకున్న జయ.బి. గతంలో చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్ చిత్రాలను అందించి ప్రస్తుతం ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇపుడు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు..

01/10/2017 - 22:21

మంచు విష్ణు, హన్సిక జంటగా ఎం.వి.వి సినిమా పతాకంపై రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘లక్కున్నోడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేసిన అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ, తాను ఢీ సినిమా చూసినపుడు ఎలా ఫీలయ్యానో ఈ సినిమా చూసేటప్పుడు అలానే ఫీలయ్యానని తెలిపారు.

01/10/2017 - 22:21

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు వినాయక్. ఆయన సినిమాలంటే మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ తన 150వ చిత్రంగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువ హీరో రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు వినాయక్ చెప్పిన విశేషాలు...

01/10/2017 - 22:19

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూ మరోవైపు భిన్నమైన సినిమాలు చేస్తున్నారు. ఈతరం నటుల్లో అటు సాంఘికాలు, ఇటు పౌరాణికాలు చేయగల నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన మరో చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.

Pages