S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/02/2016 - 21:22

అప్పుడెప్పుడో ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణవిజయం’ చిత్రాలలో తన డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ తెలుగులో మళ్లీ ఓసారి కనిపించనున్నది. విషయంలోకెళితే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో రాజమాతగా హేమామాలిని నటించనున్నదని టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

04/02/2016 - 21:21

క్రాంతి పతాకంపై వేణుకుమార్, డింగారి సిద్ధార్థ్, వెంకట్, శ్రీలేఖ, ఉష, సంజన, ప్రసన్న, క్రాంతి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఈరోజుల్లో ప్రేమకథాచిత్రమ్’ (కరీంనగర్‌లో). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

04/02/2016 - 21:19

ఎక్కడికెళ్లినా సోలో హీరోయిన్‌గానే నీరాజనాలు అందుకున్న త్రిష పరిస్థితి అడ్డం తిరిగింది. తెలుగులో అవకాశాలు లేనట్లే. కొద్దోగొప్పో కోలీవుడ్‌లో అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో సోలో హీరోయిన్‌గా అంటే వర్కవుట్ కాదన్న నమ్మకంతో సెకండ్ హీరోయిన్ అయినా సరే ఓకే అంటోంది అందాల తార త్రిష. ప్రస్తుతం ఆమె నటించిన నాయకి విడుదలకు సిద్ధమైంది.

04/02/2016 - 21:17

టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించిన అందాల తార రాశిఖన్నా హైదరాబాద్‌లో గృహప్రవేశం చేసింది. ఇన్నాళ్లు దిల్లీనుంచి విమానాల్లో వస్తూపోతూ స్టార్ హోటల్స్‌లో మకాం పెట్టి విసిగిపోయిన రాశి ఇక్కడే ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె ఎట్టకేలకు ఆ పని పూర్తిచేసింది.

04/02/2016 - 21:14

విజయ్, శ్రీరామ్, నవీన్, రాధిక ప్రధాన పాత్రల్లో స్వామిచంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల నిర్మిస్తున్న చిత్రం కమిట్‌మెంట్. ఐలేష్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ ఆకట్టుకునేలా వుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు.

04/01/2016 - 21:09

‘‘పవర్’ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్ నుండి కలవమని ఫోన్ వచ్చింది. మొదట్లో షాక్ అయినా ఆయనతో సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నా. కథ నచ్చకపోతే కనీసం ఆయనతో ఫొటో అయినా దిగొచ్చనే ఆలోచనతో కలిశాను’ అని అంటున్నాడు దర్శకుడు బాబి. ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు బాబి (కె.ఎస్.రవీంద్ర).

04/01/2016 - 21:07

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలని శుక్రువారంనాడు డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆడియో విడుదలైన క్షణంనుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వస్తోందని తెలిసింది. ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్ సంచలనం క్రియేట్ చేస్తోంది.

04/01/2016 - 21:04

నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన ‘లజ్జ’ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించాడు యువ నటుడు వరుణ్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌న్యూస్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

04/01/2016 - 21:27

తమన్నా కథానాయికగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం అభినేత్రి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ ఈనెల 15న వైజాగ్‌లో ప్రారంభం కానుంది.

04/01/2016 - 20:59

నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ జరుగుతోంది.

Pages