S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/19/2017 - 02:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్‌ను తక్షణం విడిపించుకోవడంలో అంతర్జాతీయ న్యాయస్థానం సాయం తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. కులభూషణ్ జాదవ్‌ను విడిపించుకునేందుకు అంతర్జాతీయ న్యాయస్థానంద్వారా ఉన్న మార్గాలపై కేంద్రం స్పందనను ఆ పిల్‌లో కోరారు.

04/19/2017 - 02:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మదాలీ జిన్నా పార్సీ యువతి రుట్టీ పెట్టీటిని వివాహం చేసుకున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. పెళ్లయిన తర్వాత ఆమె ముస్లిం మతంలోకి మారి తన పేరును మరియం జిన్నాగా మార్చుకుంది. అయితే పెళ్లికి ముందు బుర్రమీసాల్లో కనిపించిన జిన్నా ఆమెతో పెళ్లి తర్వాత మీసాలు లేకుండానే గడపడానికి కారణమేమిటో మాత్రం ఎవరికీ తెలియదు.

04/19/2017 - 01:15

సిబిఐకి లండన్ పోలీసుల సమాచారం
మూడు గంటల్లోనే బెయిల్ మంజూరు
త్వరలోనే భారత్‌కు అప్పగింత?
అంత తేలిక కాదంటున్న న్యాయ నిపుణులు

04/19/2017 - 01:15

దినకరన్‌కు ఉద్వాసన.. అన్నాడిఎంకె సంచలన నిర్ణయం

మంత్రులు, ఎంపీల ఏకగ్రీవ తీర్మానం
పంతం నెగ్గించుకున్న పన్నీర్‌సెల్వం
ఇక విలీనమే తరువాయ
తమిళనాట వేగంగా మారిన రాజకీయం
ఈసీ నిర్ణయం తర్వాత చిన్నమ్మపై అధికారికంగా వేటు

04/19/2017 - 01:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా బిజెపి సీనియర్ నేతలపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చే అవకాశం ఉంది. న్యాయమూర్తులు పిసి ఘోష్, ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన సుప్రీం బెంచి ఈ కేసుపై విచారణ జరుపుతుంది. ఈ కూల్చివేత సంఘటనకు సంబంధించిన అభియోగాలను రెండు కేసులుగా విభజించారు.

04/19/2017 - 01:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రోజురోజుకూ మండుతున్న ఎండలను చూసి ఆందోళన చెందుతున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త మంగళవారం తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాలంలో 96శాతం వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనాలను విడుదల చేసింది. ఈ వర్షాకాలం ఎల్‌నినో ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశాలున్నాయని వివరించింది.

04/18/2017 - 10:26

కోచి, ఏప్రిల్ 17: భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని ప్రపంచ తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో మహాభారత ఘట్టాన్ని తెరకెక్కించేందుకు యుఏఇలో ఉంటున్న భారతీయ వ్యాపారి బిఆర్ శెట్టి ముందుకొచ్చారు. భారత్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌గా నిర్మించనున్న చిత్రాన్ని తెరకెక్కించే దర్శకత్వ బాధ్యత ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్‌మేకర్ విఎ శ్రీకుమార్ మీనన్‌కు దక్కింది.

04/18/2017 - 09:53

సూరత్, ఏప్రిల్ 17: భారీ రేట్లు కలిగిన ఇంగ్లీషు మందులకు బదులు చౌకగా లభించే జనరిక్ మందులనే రోగులకు రాసే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తమ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చిందని దీని వల్ల మందులు, స్టెంట్‌ల రేట్లు భారీగా తగ్గాయని చెప్పారు. అయితే ఇది అనేక ఫార్మా కంపెనీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.

04/17/2017 - 04:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మకమైనవని భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తూ ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు కొనసాగడానికి 2019లో కూడా ఆయనను అధికారంలోకి తీసుకువస్తామని ప్రతినబూనాలని ప్రజలను కోరింది. ఇక్కడ రెండు రోజులుగా జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజయిన ఆదివారం నాడు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

04/17/2017 - 04:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: వేసవి తాపంతో అల్లాడుతున్న ఉత్తర భారతావని మరింత వేడెక్కనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరించింది. అలాగే బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Pages