S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/22/2017 - 03:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మారేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐఎఎస్ అధికారులను నిలదీశారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ మోదీ ఐఎఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మార్పు తీసుకువచ్చేందుకు అవసరమైన రాజకీయ సంకల్పం తనకు ఉందని, అయినా మీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

04/22/2017 - 03:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డు పొందడానికి ఆధార్‌ను ఎందుకు తప్పనిసరి చేశారంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొంతమంది తప్పుడు పత్రాల ఆధారంగా తీసుకున్న పాన్ కార్డు వివరాలను సమర్పిస్తున్నట్టు తేలిందని కేంద్రం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి న్యాయమూర్తి ఎకె సిక్రి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పారు.

04/22/2017 - 03:31

చెన్నై, ఏప్రిల్ 21: తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె వైరి వర్గాల మధ్య విలీనానికి శుక్రవారం నాడు పరిణామాలు నేపథ్యంలో కొంతమేర మార్గం సుగమం అయింది. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తేతప్ప విలీనానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పట్టు సడలించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడిఎంకె బృందం విలీన చర్చలు జరిపేందుకు తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

04/22/2017 - 03:25

చిత్రం..న్యూఢిల్లీలో శుక్రవారం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తో
కరచాలనం చేస్తున్న ఇయు విదేశాంగ విధానం చీఫ్ ఫెడ్రికా మెఘేరిని

04/22/2017 - 03:01

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21: దేశానికి అందిస్తున్న వివిధ సేవల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లోని ఎంఆర్ కురుప్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన శాస్తవ్రేత్తలు, ఉద్యోగుల ప్రతిభా పురస్కార అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

04/22/2017 - 02:54

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే నెలలో మరో రెండు ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం ఇందుకు వేదికకానుంది. జిఎస్‌ఎల్‌వి-ఎప్ 09, పిఎస్‌ఎల్‌వి-సి 38 ప్రయోగాలకు సంబంధించిన పనులు షార్ వేగంగా జరుగుతున్నాయి.

04/22/2017 - 02:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశ రాజధానిలో నెల రోజులకు పైగా నిరసన తెలుపుతున్న తమిళ రైతులకు సిపిఐ సంఘీభావం తెలిపింది. కరవు ఇబ్బందులు ఏదుర్కొంటున్న తమను ఆదుకోవాలంటూ జంతర్ మంతర్‌లో వివిధ రకాల పద్ధతుల్లో రైతులు నిరసన తెలుపుతూనే వున్నారు. శుక్రవారం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ ఇతర పార్టీల నేతలు తమిళ రైతులను కలిశారు.

04/22/2017 - 01:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: గుజరాత్‌లో 2002లో జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైన కారణంగా ధ్వంసమైన ప్రార్థనా స్థలాలను పునరుద్ధరించడానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించవచ్చా అనే అంశంపై ఒక ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.

04/22/2017 - 01:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21:యాభై శాతం రాయితీపై ప్రయాణం చేసేందుకు సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా మరింత వెసులుబాటు కల్పించింది. ఈ రాయితీ అర్హత వయోపరిమితిని 63 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించింది. అరవై సంవత్సరాలు దాటిన ప్రయాణికులకు ఎకానమీ క్లాస్‌లో పర్యటించేందుకు టికెట్ ధరలో 50శాతం రాయితీని ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వెసులుబాటు దేశీయ విమానాలకే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

04/22/2017 - 01:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలు తప్పనిసరి కాదని కేంద్ర ఆహార, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ శుక్రవారం స్పష్టం చేశారు. కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే ఈ చార్జీలను తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ మేరకు సర్వీస్ చార్జీలపై నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించి ఆమోదించినట్లు ఆయన చెప్పారు.

Pages