S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాలు

కడప,మే 30: జిల్లాలో ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణపట్నం, సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి జిల్లాకు సరఫరా అయ్యే విద్యుత్‌లో సాంకేతిక లోపాలు ఏర్పడిన అనంతరం ఇండోర్ విద్యుత్ కేంద్రాల పరిధిల్లోని సబ్‌స్టేషన్లలో విద్యుత్‌ను ఇచ్చేవారు. వ్యవసాయానికి, గృహాలు, కమర్షియల్, పరిశ్రమల కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఇండోర్ విద్యుత్‌తోపాటు సోలార్, గాలిమర్రల విద్యుత్ కూడా వినియోగదారులకు సరఫరా చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంది.

భ్రూణ హత్యల నివారణ కృషి

కడప,మే 30: జిల్లా అధికారులు భ్రూణ హత్యల నివారణ చట్టాన్ని సమగ్రవంతంగా అమలుచేసి ఆడపిల్లలను రక్షించాలని, అలాగే వారిని చదివించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను, తల్లిదండ్రులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక సభాభవన్‌లో బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంపై బ్రోచర్ విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని భారత ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ అమలుచేస్తోందన్నారు. ఈ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయడం ద్వారా భృణహత్యలు అరికట్టవచ్చునని, తద్వారా బాలికల నిష్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

పవిత్ర పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ క్షేత్రం

కడప,(కల్చరల్)మే 30: గండిలో కొలువైన ఆంజనేయుడి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన బాణపు కొనతో మొలిచాడని పురాణ కథలు స్పష్టం చేస్తున్నాయి. రావణాసురుడు సీతను అపహరించి, లంకకు తీసుకుపోయిన తర్వాత సీతను అనే్వషిస్తూ వచ్చిన రామలక్ష్మణులకు వాయుదేవుడు ఆతిథ్యమిచ్చినట్లు పురాణ కథలలో ఉంది. అలాగే లంకకు వెళ్లి విజయంతో వచ్చిన సీతారామలక్ష్మణులకు రెండు కొండల మధ్య బంగారపు విజయతోరణాన్ని కట్టి వాయుదేవుడు స్వాగతం ఇచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ బంగారు విజయతోరణం నేటికీ పవిత్రులకు దర్శనమిస్తుందని పెద్దలు చెబుతున్నారు.

బడుగులకు మొండిచేయి

హైదరాబాద్, మే 30:పార్టీకి బడుగు బలహీన వర్గాలే ప్రాణమని మహానాడు వేదికగా ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే టిడిపి నాయకత్వం తన విధానం మార్చుకుంది. రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో బడుగువర్గాలకు స్థానం లేకుండా, ఇద్దరు ఆగ్రకులాల వారికి స్థానం కల్పించడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి (కమ్మ), టిజి వెంకటేష్ (వైశ్య)ను రాజ్యసభ అభ్యర్ధులుగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. అంతా అనుకూలిస్తే నాలుగవ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఖరారు అయ్యే అవకాశాలున్నాయి.

ఆలయాలు నిర్మించడం పూర్వజన్మ సుకృతం

కమలాపురం,మే 30: ఆలయాలను నిర్మించడం పూర్వజన్మ సుకృతమని అందరికీ ఆ అదృష్టం కలగదని స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానందస్వామి పేర్కొన్నారు. ఆయన సోమవారం మండల పరిధిలోని రామాపురం గ్రామంలోని మోక్షనారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు సాయినాథశర్మ, వేదపండితులు మారుతీ శర్మ, కిరణ్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని మోక్షనారాయణస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, మహాలక్ష్మి, ఆంజనేయస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా కొత్తగా చెక్కబడిన శిల్పాలకు ఆలయాలు నిర్మించడం జరుగుతోందన్నారు.

చరిత్రకు ఆనవాలైన బౌద్ధారామాలు అభివృద్ధికి నోచుకోవా.!

నందలూరు, మే 30:విభిన్న మతాలు, సంస్కృతికి నిలయమైన మనదేశంలోని రాయలసీమ ప్రాంతంలో అరుదుగా ఉన్న నందలూరు మండలంలోని ఆడపూరు వద్ద ఉన్న బౌద్దారామాలు యేళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోలేదు. 1, 2 శతాబ్దంలో ఇక్కడ బౌద్దులు నివాసం ఉండినట్లు చరిత్ర చెబుతుంది. 1913లోనే బ్రిటిష్ పరిశోధకులు ఏపి లాంగ్‌హర్స్ ఇక్కడ బౌద్దారామాలు ఉన్నాయని గుర్తించారు. 1978-80లో రాష్ట్ర పురావస్తు శాఖ బౌద్దారామాల వద్ద త్రవ్వకాలు సాగించారు. ఇక్కడ ఒక మహాస్ధూపం, 21 స్మారక స్ధూపాలు లభ్యమయ్యాయి.

చంద్రన్న బీమా కార్మిక కర్షకులకు ధీమా

కమలాపురం,మే 30: జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాసమాఖ్య ఇన్సురెన్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులకోసం ఏర్పాటుచేసిన చంద్రన్న బీమా పథకం కార్మిక కర్షకులకు ధీమా అని ఎంపిడివో ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐకెపి కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకం 19సంవత్సరాల నుంచి 70సంవత్సరాల వరకు వయస్సున్న అసంఘటిత రంగ కార్మికులకు ఎంతో ఉపయోగమన్నారు. బీమా నమోదుపై బీమా సేవల నిమిత్తమై నమోదుచేసుకున్న వారు ఏడాదికి రూ.15లు చెల్లించి అర్హత పొందాలన్నారు.

చంద్రన్న బీమాపై అవగాహన సదస్సు

వల్లూరు,మే 30: రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చంద్రన్న ప్రమాద బీమా పథకంపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని స్ర్తి శక్త్భివన్‌లో ఐకెపి ఏపిఎం రాధిక ఆధ్వర్యంలో మహిళలకు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.15లు బీమా పథకంతో రూ.5లక్షలు ప్రమాద బీమా పథకానికి అర్హులౌతారని చెప్పారు. ఈ పథకంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ కారక్రమంలో విఓల అధ్యక్షురాళ్లు, సభ్యులు, ఆనిమేటర్లు పాల్గొన్నారు.
చెన్నూరులో...

అభివృద్ధి నిధులు కొన్ని ప్రాంతాలకే పరిమితమా!

కడప,మే 30: జిల్లా అభివృద్ధి నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఇటీవల రూ.126కోట్లు కేటాయించగా, ఆ నిధు లు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశా రు. పరపతి ఉన్న నేతలు తమ ప్రాం తాలకు ఆ నిధులను తరలించుకువెళ్లా రు. జిల్లావ్యాప్తంగా పలుప్రాంతాల్లో అభివృద్ధిలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా పరపతి ఉన్న నేతలు తమ ప్రాంతాలకు నిధులు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన 7 నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ ప్రాంతాల్లో నిధులు అంతంతమాత్రంగానే విడుదల చేశా రు.

అరకొరగా ‘అమృత’ నిధులు..

కడప,మే 30: అమృత్ పథకం కింద జిల్లాలోని కడప నగరపాలకం, ప్రొద్దుటూరు పురపాలకానికి మొదటి ఫేస్ కింద రూ.44.32కోట్లు విడుదలయ్యాయి. కడప నగర పాలకం తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్రప్రభుత్వం ద్వారా రూ.7.11కోట్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.17.78కోట్లు, నగరపాలకం రూ.18.43కోట్లు ఖర్చు చేయాల్సివుంది. అలాగే ప్రొద్దుటూరు పురపాలకానికి కేంద్రప్రభుత్వం రూ.25లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు, పురపాలక సంఘాలు రూ.15లక్షలు వెచ్చించాల్సివుంటుంది.

Pages