S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/09/2017 - 00:34

ముంబయి, ఫిబ్రవరి 8: ఇంగ్లాండ్, భారత్ అండర్-19 జట్ల మధ్య బుధవారం జరిగిన చివరి, ఐదో వనే్డ టైగా ముగిసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్, చివరి బంతిలో ఇషాన్ పొరెల్ అవుట్‌కావడంతో, విజయానికి అవసరమైన చివరి పరుగును సంపాదించడంలో విఫలమైన భారత్ మ్యాచ్‌ని టైగా ముగింది. అయితే, సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.

02/09/2017 - 00:32

హైదరాబాద్, ఫిబ్రవరి 8: బలమైన, బలహీనమైన జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు గురువారం నుంచి ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆరంభం కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా, తొమ్మిదో స్థానంలోని బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్టులో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఎవరైనా సులభంగానే ఊహించుకోవచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ విజయం ఖాయంగా కనిపిస్తున్నది.

02/09/2017 - 00:32

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రహానే సుమారు రెండేళ్ల కష్టాన్ని విస్మరించడం తప్పని, ఒకటిరెండు మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకొని అతనిపై విమర్శలు చేయడం తగదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

02/09/2017 - 00:31

హైదరాబాద్, ఫిబ్రవరి 8: టెస్టు ఫార్మాట్‌లో తమను తక్కువ చేస్తూ చూపించడం తప్పని, ఎక్కువ టెస్టులు ఆడితే తమ సత్తా ఏమిటో చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం వ్యాఖ్యానించాడు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో అతను మాట్లాడుతూ తమతో ఏ జట్టూ తరచుగా టెస్టు సిరీస్‌లు ఆడడం లేదని, అంతేగాక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లపై ఆసక్తి చూపడం లేదని అన్నాడు.

02/09/2017 - 00:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఫ్రెండ్స్ ఎలెవన్‌తో జరిగిన టి-20 మ్యాచ్‌లో కేవలం 72 బంతుల్లో 300 పరుగులు చేసిన మావి ఎలెవన్ వికెట్ కీపర్ మోహిత్ అల్వాత్‌కు ఐపిఎల్‌లో చోటు దక్కడం ఖాయంగా కని పిస్తున్నది. అతనిని జట్టులోకి తీసుకోవడానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ముందు కొచ్చింది. ఈనెల నాలుగో తేదీన జరగాల్సిన ఐపిఎల్ వేలం 20వ తేదీకి వాయదా పడిన విషయం తెలిసిందే.

02/09/2017 - 00:30

మెల్బోర్న్, ఫిబ్రవరి 8: టెస్టు క్రికెట్‌లో అసాధారణ ప్రతిభావంతుడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను పేర్కొంటారు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా వంటి క్రికెటర్లు ఎన్ని రికార్డులు నెలకొల్పినా, టెస్టు క్రికెట్‌లో తిరుగులేని వీరుడిగా బ్రాడ్‌మన్‌కే అందరూ ముక్తకంఠంతో జేజేలు పలుకుతారు. కెరీర్‌లో 52 టెస్టులు (80 ఇన్నింగ్స్) ఆడిన అతను 6,996 పరుగులు చేశాడు.

02/09/2017 - 00:29

కొలంబో, ఫిబ్రవరి 8: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో థాయిలాండ్ చిత్తుచిత్తుగా ఓడింది. భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన థాయిలాండ్ 29.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 12.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి విజయం సాధించింది.

02/08/2017 - 01:01

దుబాయ్, ఫిబ్రవరి 7: హైదరాబాద్‌లో గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు క్రికెట్ మ్యాచ్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అంతర్జాతీయ ర్యాంకింగ్స్ విషయంలో తన సహచర సభ్యుడు రవీంద్ర జడేజా నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది.

02/08/2017 - 00:59

హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలతో గురువారంనుంచి నగరంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌కి పరిశీలకుడిగా రత్నాకర్ శెట్టిని బిసిసిఐ మంగళవారం నియమించింది. ఈ మ్యాచ్ కోసం హైదరబాద్ క్రికెట్ సంఘం చేసే ఏర్పాట్లను పరిశీలించి, పర్యవేక్షించే బాధ్యతను బిసిసిఐ గేమ్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ అయిన రత్నాకర్ శెట్టికి అప్పగించినట్లు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

02/08/2017 - 00:58

హైదరాబాద్, ఫిబ్రవరి 7: సొంత గడ్డపై ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో సాధించిన విజయాల ఊపును అలాగే కొనసాగించాలని అనుకుంటున్నామని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. గురువారంనుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సందర్భంగా మంగళవారం కుంబ్లే విలేఖరులతో మాట్లాడాడు. ‘ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కనబరిచిన ఊపును అలాగే కొనసాగించాలని మేము అనుకుంటున్నాం.

Pages