S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/19/2018 - 01:04

భారత్, బెల్జియం జట్ల మధ్య న్యూజిలాండ్‌లోని తౌరంగాలో జరిగిన మ్యాచ్‌లో ఓ దృశ్యం. నాలుగు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 0-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. బెల్జియం క్రీడాకారులు సెబాస్టియన్ డాకిర్ (8వ నిమిషం), విక్టర్ వెగ్నెజ్ (34వ నిమిషం) చెరొక గోల్ సాధించి, తమ జట్టును విజయపథంలో నడిపారు.

01/19/2018 - 01:02

మాడ్రిడ్, జనవరి 18: కోచ్ జినెదిన్ జిదానే కాంట్రాక్టును రియల్ మాడ్రిడ్ క్లబ్ 2020 వరకూ పెంచింది. ఈ పొడిగింపు ఒప్పందం కాగితాలపై సంతకాలు చేసినట్టు ఫ్రెంచ్ మాజీ ప్రొఫెషనల్ సాకర్ హీరో జిదానే ప్రకటించాడు. అతని మార్గదర్శకంలోనే యూరోపియన్ చాంపియన్‌షిప్‌ను రియల్ మాడ్రిడ్ కైవసం చేసుకుంది. కోపా డెల్ రే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది.

01/19/2018 - 01:02

లండన్, జనవరి 18: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను దురదృష్టం వెంటాడుతున్నది. ఒక బార్ వద్ద జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడన్న అభియోగాన్ని స్టోక్స్ ఎదుర్కొంటున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైనప్పటికీ, యాషెస్ సిరీస్‌లో ఆడలేకపోయాడు. తాజాగా అతనిని ముక్కోణపు టీ-20 టోర్నమెంట్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.

01/19/2018 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 18: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, ప్రపంచ మూడో నంబర్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ మలేషియాలో ఫిబ్రవరి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ఆసియా బాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ను గెలిపించే భారాన్ని తన భుజాలపై వేసుకొని బరిలోకి దిగుతున్నారు. 2016లో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల విభాగంలో భారత్ సెమీఫైనల్స్ చేరింది.

01/18/2018 - 01:34

సెంచూరియన్, జనవరి 17: సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో దూసుకువెళ్తున్న భారత క్రికెట్ జట్టు సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టుమ్యాచ్‌లో ఆతిధ్య జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ప్రారంభ టెస్టులో 72 పరుగుల తేడాతో వెనుకబడిన భారత్ రెండో టెస్టులో 135 పరుగుల తేడాతో అపజయాన్ని మూటకట్టుకుంది. ఆతిధ్య జట్టు నిర్దేశించిన 287 లక్ష్యాన్ని ఛేదించడంలో పూర్తిగా చతికిలపడింది.

01/18/2018 - 01:33

సెంచూరియన్, జనవరి 17: ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడైన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను పడగొట్టడం తనకో ప్రత్యేక అనుభూతి ఇచ్చిందని, అది మరపురానిదని దక్షిణాఫ్రికా పేసర్ లంగీ ఎంగ్డి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదోరోజు ఆట సందర్భంగా విరాట్‌కోహ్లీని ఎల్‌బీడబ్ల్యు చేయడం తనకు ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుందని అన్నాడు.

01/18/2018 - 01:31

చటేశ్వర్ పుజారా తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పిదమే మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేశాడు. పుజారా 47 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి జట్టును మళ్లీ నిరాశపరిచాడు. ఆట ప్రారంభమైన 19వ బంతికే రన్ అవుటై రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండుసార్లు రన్‌ఔటైన భారత ఆటగాడిగా చెత్తరికార్డును మూటకట్టుకున్నాడు.

01/18/2018 - 01:30

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ :335 భారత్ తొలి ఇన్నింగ్స్ : 307
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ :258 భారత్ రెండో ఇన్నింగ్స్: 151 (50.2 ఓవర్లు)

01/18/2018 - 01:29

సెంచూరియన్, జనవరి 17: సఫారీ గడ్డపై ఓటమికి బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యమే కారణమని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. బౌలర్లు రాణించినా ఫలితం దక్కలేదని అతడు పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లోనూ పట్టుసాధించి దక్షిణాఫ్రికా జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుందని విరాట్ చెప్పాడు. బుధవారం నాటి రెండోటెస్ట్‌లో 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో కోహ్లీ టీమ్ ఓటమి పాలైంది.

01/18/2018 - 01:28

న్యూఢిల్లీ, జనవరి 17: దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు ఓటమి తనను ఏ మాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని మాజీ కెప్టెన్ బిషన్‌సింగ్ బేడీ వ్యాఖ్యానించాడు. శ్రీలంక వంటి చిన్న జట్టుపై గెలిచేందుకు కాలాన్ని వృథా చేయడమే గాక, దక్షిణాఫ్రికాతో తలపడేందుకు కోహ్లీ సేన ఏ విధంగానూ సన్నద్ధం కాలేకపోయిందని అన్నాడు.

Pages