S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/02/2017 - 03:08

కొలంబో, ఆగస్టు 1: గతంలో గొప్పగొప్ప ఆటగాళ్లున్న కొన్ని టీములకన్నా ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఎంతో ఎక్కువ సాధించిందని తాను భావిస్తున్నానని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ అన్నాడు. ‘దాదాపు రెండేళ్లుగా భారత జట్టులోని ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు వారెంతో అనుభవం సంపాదించారు కూడా.

08/02/2017 - 03:06

ఆక్లాండ్, ఆగస్టు 1: న్యూజిలాండ్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు హెచ్‌ఎస్.ప్రణయ్‌తో పాటు 15వ సీడ్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ శుభారంభాన్ని సాధించారు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న అజయ్ జయరామ్ మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను నిరాశపర్చింది.

08/02/2017 - 03:04

దుబాయ్, ఆగస్టు 1: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా, చటేశ్వర్ పుజారా నాలుగో స్థానంలోనూ, ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకేసారి 21 ర్యాంకులను మెరుగుపర్చుకుని 39వ స్థానంలోనూ నిలిచారు.

08/02/2017 - 03:03

హైదరాబాద్, ఆగస్టు 1: మహిళల అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ బాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ అత్యంత విలాసవంతమైన బిఎండబ్ల్యు కారును బహూకరించాడు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో మంగళవారం ఆమెకు ఈ కారును బహూకరించాడు.

08/02/2017 - 03:00

లాస్ ఏంజెల్స్, ఆగస్టు 1: కాలిఫోర్నియాలో జరుగుతున్న స్టాన్‌ఫోర్డ్ ఓపెన్ డబ్ల్యుటిఎ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా ముద్దుగుమ్మ మరియా షరపోవా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న షరపోవా ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో 6-1, 4-6, 6-0 సెట్ల తేడాతో అమెరికా క్రీడాకారిణి జెన్నీఫర్ బ్రాడీని మట్టికరిపించి శుభారంభాన్ని అందుకుంది.

08/02/2017 - 03:00

లాస్‌ఏంజెల్స్, ఆగస్టు 1: 2028 ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనుకుంటున్నట్లు లాస్ ఏంజెల్స్ ప్రకటించడంతో పారిస్ 2024 ఒలింపిక్స్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. కాగా, ఇప్పుడు కుదిరిన ఒప్పందం రెండు నగరాలకే కాక ఒలింపిక్ ఉద్యమానికి కూడా మేలు చేస్తుందని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

08/02/2017 - 02:59

కొలంబో, ఆగస్టు 1: టీమిండియాతో రెండో టెస్టులో తలపడే శ్రీలంక జట్టులో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ లహిరు తిరిమానేకి చోటు లభించింది. గాయంతో బాధపడుతున్న అశీల గుణరత్నే స్థానంలో తిరిమానేని మంగళవారం జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో గత ఏడాది జూన్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన తిరిమానే అప్పటి నుంచి ఏడాదికి పైగా సాంప్రదాయ ఫార్మాట్‌కు (టెస్టు క్రికెట్‌కు) దూరంగా ఉన్నాడు.

08/01/2017 - 01:02

మాడ్రిడ్, జూలై 31: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. పన్ను ఎగవేత కేసులో అతను సోమవారం కోర్టుకు హాజరయ్యాడు. ఆదాయ వివరాలను పూర్తిగా వెల్లడించకుండా, 17.2 మిలియన్ డాలర్లు (సుమారు 117 కోట్ల రూపాయలు) మేరకు పన్ను ఎగవేశాడని అతనిపై అభియోగాలున్నాయి.

08/01/2017 - 01:01

టిల్బర్‌గ, జూలై 31: మహిళల యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌పై ఇంగ్లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 1-0 తేడాతో విజయం సాధించి షాకిచ్చింది. జొడీ టేలర్ అద్భుతమైన గోల్ చేసి, ఫ్రాన్స్‌పై ఇంగ్లాండ్‌కు 43 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మొదటి విజయాన్ని అందించింది. ఈ టోర్నమెంట్‌లో జొడీకి ఇది ఐదో గోల్.

08/01/2017 - 00:57

అట్లాంటా టెన్నిస్ ట్రోఫీతో జాన్ ఇస్నర్. ఫైనల్‌లో అతను ర్యాన్ హారిసన్‌ను 7-6, 7-6 తేడాతో ఓడించి,
కెరీర్‌లో నాలుగో ఎటిపి టైటిల్‌ను అందుకున్నాడు

Pages