S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/26/2017 - 07:31

లండన్ చేరింది..
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం లండన్ చేరింది. విమానాశ్రయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

05/26/2017 - 07:28

న్యూఢిల్లీ, మే 25: జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లే కాంట్రాక్టు కొనసాగుతుందనీ, ఆ పదవిలో అతనే ఉంటాడనీ చాలాకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కోచ్ పదవికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) విడుదల చేసిన ప్రకటన కుంబ్లే కాంట్రాక్టుకు తెరపడిందనే విషయాన్ని స్పష్టం చేసింది.

05/26/2017 - 07:28

న్యూఢిల్లీ, మే 25: భారత క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో అనుభవజ్ఞుడని, జట్టుకు ఎన్నో వివిష్ఠ సేవలు అందించాడని ప్రశంసించిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో స్థానం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధోనీకున్నంత అనుభవం తనకు లేదా అని జాతీయ సెలక్టర్లను సూటిగా ప్రశ్నించాడు.

05/26/2017 - 07:26

న్యూఢిల్లీ, మే 25: కార్యవర్గ సభ్యుల వివరాలతో కూడిన జాబితాను వెంటనే సమర్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సభ్య సంఘాలను బోర్డు పాలనాధికారుల బృందం (సిఒఎ) ఆదేశించింది. కార్యవర్గ సభ్యుల పేర్లతోపాటు, వారు ఎప్పటి వరకూ పదవిలో ఉంటారనే విషయాన్ని కూడా తప్పనిసరిగా పేర్కొవాలని అన్ని యూనిట్లకు రాసిన లేఖలో తెలిపింది. ఇది వరకు కూడా సిఒఎ ఇలాంటి లేఖనే పంపింది.

05/26/2017 - 07:22

న్యూఢిల్లీ, మే 25: పదో ఐపిఎల్ ముగిసింది. ఎన్నో పొగడ్తలను, అదే స్థాయిలో తెగడ్తలను తన లో ఇముడ్చుకుంది. మొత్తం మీద, ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ, సరికొత్త అందాలను ఆవిష్కరిస్తూ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఐపిఎల్ కు భారీ స్పందనే లభించింది. వచ్చే ఏడాది భారీ మా ర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఏడాది తర్వాత, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

05/25/2017 - 05:52

ముంబయి, మే 24: చాంపియన్స్ ట్రోఫీని చాలా కష్టతరమైన టోర్నమెంట్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభివర్ణించాడు. ప్రపంచ కప్ కంటే ఈ టోర్నీలోనే పోటీ తీవ్రంగా ఉంటుందని బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు. ప్రపంచ కప్‌లో మొదటి సగ భాగంలో పోటీలు సామాన్యంగా ఉంటాయని, రెండో భాగంలో తీవ్రతను సంతరించుకుంటాయని, కానీ చాంపియన్స్ ట్రోఫీలో మొదటి గేమ్ నుంచే హోరాహోరీ పోరు మొదలవుతుందని చెప్పాడు.

05/25/2017 - 05:48

ముంబయి, మే 24: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బయోపిక్ ప్రీమియర్ షోకు హేమాహేమీలు హాజరయ్యారు. సచిన్, అతని భార్య అంజలి స్వయంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానించారు. బాలీవుడ్ నటులు అబితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు ఈ ప్రత్యేక షోను తిలకించారు.

05/25/2017 - 05:47

ముంబయి, మే 24: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్ఠాత్మకమైన సియెట్ క్రికెట్ రేటింగ్ (సిసిఆర్) ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అతను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా నుంచి అందుకున్నాడు.

05/25/2017 - 05:46

బెర్లిన్, మే 24: గత నెల 11న జరిగిన బాంబు దాడిలో గాయపడిన బొరుసియా డార్ట్‌మండ్ ఆటగాడు మార్క్ బర్‌త్రా కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్ సంపాదించినట్టు అధికారులు ప్రకటించగా, అతను వెర్డెర్ బ్రెమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మొనాకాతో చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ని ఆడేందుకు వెళుతున్న డార్ట్‌మండ్‌పై బాంబు దాడి జరిగినప్పుడు మార్క్ చేతికి గాయమైంది. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

05/25/2017 - 05:46

కరాచీ, మే 24: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ఈనెలాఖరులో దుబాయ్‌లో సమావేశమయ్యే అవకాశం ఉంది. పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్, పాలక మండలి అధ్యక్షుడు నజాం సేథీ, చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుభాన్ అహ్మద్ దుబాయ్‌లో జరిగే సమావేశానికి హారవుతారని స్థానిక మీడియా కథనం.

Pages