S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/23/2017 - 01:34

పుణే: ఈ మ్యాచ్‌తో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరఫున యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఐపిఎల్‌లో రంగ ప్రవేశం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంకావడంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సుందర్‌కు పుణే ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అవకాశం లభించలేదు.

04/23/2017 - 01:29

పుణే: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను శనివారం నాటి మ్యాచ్‌లో ఓడించే క్రమంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంది. అడ్డంకులను అధిగమించి, విజయభేరి మోగించింది. ప్రత్యేకించి చివరి రెండు ఓవర్లు పుణే ఆటగాళ్ల పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయి. అప్పటికి పుణే విజయానికి 30 పరుగుల దూరంలో నిలిచింది.

04/23/2017 - 01:27

కోల్‌కతా నైట్ రైడర్స్
వర్సెస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఆరంభం.
(ఇప్పటి వరకూ నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలను సాధించింది. నిరుటి రన్నరప్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లే ఆడినప్పటికీ, రెండు మాత్రమే గెల్చుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో
ఓడింది).
**
గుజరాత్ లయన్స్ వర్సెస్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్

04/23/2017 - 01:24

ముంబయ, ఏప్రిల్ 22: ఐపిఎల్‌లో శనివారం జరిగి న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ముంబయ ఇం డియన్స్ 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యా టింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 ప రుగులు మాత్రమే చేసింది. అయతే, ఆతర్వాత ప్రత్యర్థి ని 128 పరుగులకు పరిమితం చేసి, విజయభేరి మో గించింది.

04/23/2017 - 01:23

బెంగళూరు, ఏప్రిల్ 22: మలేసియాలోని ఇఫోలో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో ఆరంభ మ్యాచ్‌లే కీలక పాత్ర పోషిస్తాయని భారత చీఫ్ కోచ్ రొలాంట్ అల్ట్‌మన్స్ అభిప్రాయపడ్డాడు. మొదట్లో బాగా ఆడి, విజయాలను నమోదు చేస్తే, ఆతర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంటుందని శనివారం రాత్రి జట్టుతో కలిసి ఇఫో బయలుదేరే ముందు విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు.

04/23/2017 - 01:21

కింగ్‌స్టన్, ఏప్రిల్ 22: రోస్టన్ చేస్, షేన్ డౌరిచ్ అర్ధ శతకాలతో రాణించడంతో, పాకిస్తాన్‌తో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వెయిట్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో కంగుతిన్న వెస్టిండీస్ చాలా సేపు కోలుకోలేకపోయింది.

04/22/2017 - 01:30

పుణే, ఏప్రిల్ 21: కెప్టెన్ డేవిడ్ వార్నర్, చాలాకాలం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ సత్తాపై భారం వేసి, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో శనివారం జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది.

04/22/2017 - 01:28

కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ‘మిస్టీరియస్ స్పిన్నర్’ సునీల్ నారైన్ 17 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ స్కోరులో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంటే, అతను సాధించిన పరుగులన్నీ బౌండరీల రూపంలో వచ్చినవే. ఐపిఎల్ చరిత్రలో గతంలో సనత్ జయసూర్య తాను చేసిన 36 పరుగులను బౌండరీలతో సాధించాడు. ఆ రికార్డును సునీల్ నారైన్ బద్దలు చేశాడు.

చిత్రం.. సునీల్ నారైన్

04/22/2017 - 01:26

కోల్‌కతా, ఏప్రిల్ 21: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సురేష్ రైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో, 188 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఆరు వికెట్లు కోల్పోయ అందుకుంది.

04/22/2017 - 01:24

మొనాకో, ఏప్రిల్ 21: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ సెకండ్ లెగ్‌లో బొరష్యా డార్ట్‌మండ్‌ను 3-1 తేడాతో ఓడించిన మొనాకో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మొత్తం మీద ఈ జట్టు రెండ లెగ్‌ను 6-3 సగటుతో తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ మూడో నిమిషంలోనే కిలియన్ మాపే ద్వారా మొనాకోకు తొలి గోల్ లభించింది. ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించిన మొనాకో 17వ నిమిషంలో మరో గోల్ సాధించింది.

Pages