S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/09/2016 - 05:45

నల్లజర్ల, జనవరి 8: జాతీయస్థాయి క్రీడలను 2018లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ కప్ క్రీడాపోటీలను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

01/09/2016 - 05:44

చెన్నై, జనవరి 8: చెన్నైలో జరుగుతున్న ఎయిర్‌సెల్ ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ టైటిల్‌పై కనే్నసిన స్విట్జర్లాండ్ క్రీడాకారుడు స్టానిస్లాస్ వావ్రింకా మరోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.

01/08/2016 - 13:50

అనంతపురం : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అనంతపురం కోర్టు నాన్‌బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోని పాదరక్షలు పట్టుకున్న చిత్రం ప్రచురితమైంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

01/08/2016 - 08:20

సిడ్నీ, జనవరి 7: రెండు రోజులకుపైగా ఆట వర్షం కారణంగా రద్దుకాగా, డ్రా అనివార్యంగా మారిన చివరిదైన మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెరుపు శతకాన్ని నమోదు చేశాడు. మొదటి రోజు ఆట చివరిలో వర్షం కురవగా, రెండో రోజు ఆటలో కేవలం 11.2 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆటను అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది.

01/08/2016 - 08:18

న్యూఢిల్లీ, జనవరి 7: స్వీడన్‌లోని సావ్జోలో జరుగుతున్న స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రీలో భారత ఏస్ షూటర్ అపూర్వీ చండీలా వరుసగా రెండో రోజు రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, మహిళల 10 మీటర్ల ట్రై-సిరీస్ ఈవెంట్‌లో 23 ఏళ్ల అపూర్వీ 208.9 పాయింట్లు సంపాదించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.

01/08/2016 - 08:16

వెల్లింగ్టన్, జనవరి 7: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి, ఆరు నెలల జైలు శిక్షను, ఐదేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ అంతర్జాతీయ కెరీర్‌లో రెండు ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధమైంది. అతనికి న్యూజిలాండ్ అధికారులు వీసా మంజూరు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

01/08/2016 - 08:15

పెర్త్, జనవరి 7: వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుతో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. శుక్రవారం టి-20 మ్యాచ్ జరుగుతుంది. ఒక రోజు తర్వాత అదే జట్టుతో 50 ఓవర్ల మ్యాచ్‌లో తలపడుతుంది. వివిధ టోర్నీల్లో పెర్త్ స్కార్చర్స్ పేరుతో ఆడే వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులోని కీలక ఆటగాళ్లకు భారత్‌తో జరిగే రెండు వామప్ మ్యాచ్‌ల నుంచి మినహాయింపునిచ్చారు.

01/08/2016 - 08:15

ముంబయి, జనవరి 7: విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలపై అభిప్రాయాలను వెల్లడించాల్సిందిగా అన్ని సభ్య సంఘాలకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లేఖ రాసింది.

01/08/2016 - 08:14

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌ల్లో ఇదొకటి. మెల్బోర్న్ మైదానంలో, 2000 జనవరి 12న జరిగిన ఈ వనే్డలో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ శతకం వృథా అయింది. భారత అభిమానులు ఆగ్రహించి, మైదానంలోకి సీసాలు, ఇతర వస్తువులను విసిరి గందరగోళం సృష్టించడంతో 17 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది.

01/08/2016 - 08:13

వౌంట్ మంగనుయ్ (న్యూజిలాండ్), జనవరి 7: శ్రీలంకతో గురువారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌ని మూడు పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లకు 179 పరుగులు చేయగలిగింది.

Pages