S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/06/2017 - 01:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపుల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మాస్టర్ కార్డ్ గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపి ఐటి సలహాదారు జెఏ చౌదరి, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ భంగ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

10/05/2017 - 21:12

హైదరాబాద్, అక్టోబర్ 4: పాపులేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో 2400 తాజా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు అమెరికా ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.

10/05/2017 - 21:27

హైదరాబాద్, అక్టోబర్ 4: పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు జిఎస్టీ నుంచి మినహాయంపు, లేదా పన్ను శాతం తగ్గింపు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. శ్లాబు రేటు భారీగా తగ్గించకుంటే ప్రాజెక్టులు ముందుకెళ్లే పరిస్థితి ఉండదంటూ తెలంగాణ చేసిన వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

10/05/2017 - 21:27

హైదరాబాద్, అక్టోబర్ 4: అయోధ్యలో రామమందిర నిర్మాణం చట్టపరిధిలోనే జరపాలన్నది తమ ఉద్దేశమని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణం త్వరగా జరగాలన్న ఉద్దేశంతో అయోద్యలో అక్టోబర్ 5 నుండి 15 వరకు శతకోటి రామనామ జప మహాయజ్ఞం చేపడుతున్నామన్నారు.

10/05/2017 - 21:28

హైదరాబాద్, అక్టోబర్ 4: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 191 టిఎంసికి చేరుకోవడంతో, ఈ నీటిని వచ్చే వేసవి వరకు పంచుకునే విషయమై రెండు రాష్ట్రాల సాగు నీటిపారుదల శాఖ మంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. ఈ నెల 15వ తేదీన కృష్ణాబోర్డు సమావేశం జరగక ముందే మంత్రుల స్థాయిలో సమావేశం జరిగితే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు కృష్ణాబోర్డు సంకేతాలు పంపింది.

10/05/2017 - 21:29

నెల్లూరు, అక్టోబర్ 4: నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగకు బుధవారం లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈనెల ఒకటి నుండి ప్రారంభమైన ఈ గంధ మహోత్సవానికి ఇప్పటిదాకా సుమారు ఎనిమిది లక్షల మంది వరకూ భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాల్గవ రోజైన బుధవారం రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఈ పండుగకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

10/05/2017 - 21:35

పాములపాడు, అక్టోబర్ 4 : కృష్ణానది యాజమాన్యం బోర్డు అధికారులు బుధవారం పోత్తిరెడ్డిపాడు నుంచి ఎస్‌ఆర్‌ఎంసికి విడుదలవుతున్న కృష్ణా జలాలను, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పరిశీలించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా ఎస్‌ఆర్‌ఎంసికి చేరుకున్న అధికారులు పాములపాడు మండలం ఇస్కాల వంతెన వద్ద ఏర్పాటుచేసిన టెలిమెట్రీని సాంకేతికంగా పరిశీలించారు.

10/05/2017 - 21:30

నెల్లూరు, అక్టోబర్ 4: వ్యవసాయం లాభసాటిగా లేదని నిరాశ, నిస్పృహలకు లోనైన రైతులు వేగంగా వ్యవసాయాన్ని వదిలివేస్తున్నారని, ఇతర వృత్తుల వారు ఆయా వృత్తుల్లో తమ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నరని, ఈ సంప్రదాయం వ్యవసాయం కూడా అనుసరిస్తూ యువతను వ్యవసాయంపై మక్కువ పెంచుకొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వాలు కూడా సహకరించాలని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

10/05/2017 - 21:30

కర్నూలు, అక్టోబర్ 4 : కృష్ణా, తుంగభద్ర జలాలపై నెలకొని ఉన్న వివాదాలు కరవు ప్రాంతమైన రాయలసీమకు శాపంగా మారాయని చెప్పవచ్చు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమకు తుంగభద్ర, కృష్ణా జలాలే ఆధారం.

10/05/2017 - 21:33

రాజమహేంద్రవరం, అక్టోబర్ 4: నిర్ణీత కాలవ్యవధిలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్న నేపథ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అత్యంత కీలకమైన నిధుల మంజూరు మరింత వేగం పుంజుకోవాల్సివుంది. సవరించిన అంచనాలు సకాలంలో ఆమోదం పొందితే సత్వరం నిధులు విడుదలకు సావకాశం వుంటుంది. పనులు మరింత పరుగులు పెట్టాలంటే నిధుల విడుదల త్వరత్వరగా జరగాల్సివుంది.

Pages