S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/04/2016 - 02:34

తిరుమల, అక్టోబర్ 3: ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని, దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్ని ప్రార్థించానని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

,
10/04/2016 - 02:30

హైదరాబాద్, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60 సంవత్సరాలు, నిజాం ప్రభుత్వ హయాంలో నలభై, యాభై ఏళ్లపాటు ఉపయోగపడ్డ హైదరాబాద్ (అబిడ్స్)లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) భవనాన్ని ఏం చేస్తారన్న చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయం తర్వాత అంతటి ప్రాధాన్యత ఈ భవనానికి ఉండటం వల్ల దీనిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. హైదరాబాద్‌లోని హెరిటేజ్ భవనాల జాబితాలో ఈ భవనం పేరు నమోదైంది.

10/04/2016 - 02:19

విజయవాడ, అక్టోబర్ 3: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణం ఆరో బ్లాక్‌లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 15లోపు పూర్తిచేసి చివరివారంలో శీతాకాల సమావేశాలు నిర్వహించబోతున్నామని ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

10/04/2016 - 02:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న రాష్ట్ర సమాచార కేంద్రం ఇంచార్జ్‌గా పి.్భస్కర్‌ని నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తిస్థాయి బాధ్యతలను భాస్కర్ నిర్వహిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం భాస్కర్ హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.

10/04/2016 - 02:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: హైదరాబాద్‌తో సహా ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీవర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రధాని కార్యలయానికి పంపించారు. డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ ప్రతినిధుల బృందం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ ను కలిసిన విషయం తెలిసిందే. నివేదిక ప్రతిని ప్రధాని కార్యాలయానికి సైతం అందజేయాలని రాజ్‌నాథ్ సూచించారు.

10/04/2016 - 02:13

హైదరాబాద్, అక్టోబర్ 3: పోలవరం తరహా ప్రాజెక్టును ఏ రాష్ట్రం, ఏ దేశం నిర్మించలేదని ఇది నిర్మాణ సంస్థలకు ఒక సవాలు వంటిదని, వారు తమ సత్తా చూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలవరం పనులను సమీక్షించారు. 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధికారులు సంకల్పంతో ఉండాలని సూచించారు.

10/04/2016 - 01:18

హైదరాబాద్, అక్టోబర్ 3: తెదేపా అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పార్టీపై పట్టుతప్పుతోందా? పదేళ్లు కష్టపడి సాధించిన అధికారానికి ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల తీరుతో ప్రమాదం వచ్చి పడిందా? ఎమ్మెల్యేల అడ్డగోలు దోపిడీతో సొంత పార్టీనేతలే దెబ్బతింటున్నారా? కోస్తాలో పెరుగుతున్న కులముద్ర మిగిలిన కులాలను ఏకం చేస్తోందా? వైసీపీ నేతల చేరికలు నిజంగానే కొంప ముంచనున్నాయా?..

10/03/2016 - 08:46

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు మాడవీధులలో ఊరేగుతూ ఉత్సవాలను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల సంరంభం మొదలవుతుంది. శ్రీవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

10/03/2016 - 08:39

హైదరాబాద్, అక్టోబర్ 2: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో దక్షిణ మధ్య రైల్వే ఆదివారం స్వచ్ఛ రైల్-స్వచ్ఛ్భారత్ రన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ రవీంద్ర గుప్తా స్వచ్ఛ శపథ్ ప్రతిజ్ఞ చేయించారు. రైల్వే అధికారులు, సిబ్బందితోపాటు సుమారు వెయ్యి మంది స్చచ్ఛ్భారత్ రన్‌లో పాల్గొన్నారు.

10/03/2016 - 08:10

హైదరాబాద్, అక్టోబర్ 2: నైరుతీ రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి రావడానికి పది పదిహేనురోజుల జాప్యం జరగగా, వీటి ఉపసంహరణలో కూడా అంతే జాప్యం జరుగుతోందని వాస్తవపరిస్థితి వెల్లడిస్తోంది. అక్టోబర్ 15-20 వరకు తెలంగాణ నుండి ఉపసంహరణ జరగాల్సి ఉంటుంది. అక్టోబర్ 25 వరకు ఎపి నుండి ఉపసంహరణ జరగాల్సి ఉంటుంది.

Pages