S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/27/2018 - 06:19

విశాఖపట్నం, మే 26: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా జోన్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వేకార్మిక సంఘాలు సైతం జోన్ వస్తుందనే అంటున్నాయి. అలాగే ప్రజాప్రతినిధులకు కూడా జోన్ సంకేతాలు అందుతున్నాయి. తెలుగు ప్రాంతాలతో కూడిన రైల్వేజోన్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చేయాలనేది కేంద్రం ఆలోచనగా తెలిసింది.

05/27/2018 - 06:15

న్యూఢిల్లీ, మే 26: ఇప్పుడు దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న నిఫా వైరస్ గబ్బిలాల వల్ల సంక్రమిస్తుందనని ఎలాంటి నిరూపణ కాలేదని వైద్యనిపుణులు నిర్ధారించారు. ఈ వైరస్ సోకి కేరళలోని కోజికోడ్, మల్లాపురం జిల్లాల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు.

05/27/2018 - 05:49

న్యూ ఢిల్లీ, మే 26: వచ్చే ఎన్నికల్లో బీజేపీ మంచి మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 2019లో జరిగే ఎన్నికలు నరేంద్ర మోదీ సుపరిపాలనకు, మోదీని గద్దెదించాలన్న ఒకే లక్ష్యంతో అపవిత్ర బంధం ఏర్పాటు చేస్తున్న పార్టీలకు మధ్య పోటీ అని ఆయన అభివర్ణించారు. విపక్షాలకు అధికారం పట్ల ఉన్నంత యావ, దేశాభివృద్ధి పట్ల లేదన్నారు.

05/27/2018 - 04:45

తిరుపతి, మే 26: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 175 అసెంబ్లీ, 25పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. నాలుగు సంవత్సరాల బీజేపీ పాలనను నిరసిస్తూ శనివారం తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

05/27/2018 - 05:51

హైదరాబాద్, మే 26: హైదరాబాద్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. వింగ్స్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.

05/27/2018 - 04:31

గజ్వేల్, మే 26: రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది. ఆర్టీసీ రాజధాని ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఓవర్ టేక్ చేయబోయి లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ అదుపుతప్పి రోడ్డుకు కుడివైపునకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీ, టాటా క్వాలీస్ వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. దుర్ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని రిమ్మనగూడ వద్ద జరిగింది.

05/27/2018 - 04:30

హైదరాబాద్, మే 26: పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మండలాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మండల పరిషత్తు అభివృద్ధి అధికారులను (ఎంపీడీఓ) మొదటిదశలో బదిలీ చేయాలని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై సమీక్షించారు.

05/27/2018 - 04:29

హైదరాబాద్, మే 26: గత కొన్ని రోజులుగా విత్తన కంపెనీలపై విరుచుకుపడిన తూనికలు కొలతల శాఖ ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపార సంస్థలపై ఉక్కుపాదం మోపింది. తెలంగాణవ్యాప్తంగా 89 కేసులు నమోదు చేసి రూ.6.65 కోట్ల ఎరువులను సీజ్ చేశారు. ఎరువులు, పురుగుల మందుల విక్రయాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు.

05/27/2018 - 04:26

హైదరాబాద్, మే 26: కౌనె్సలింగ్‌కు ముందే ప్రభుత్వ ఉత్తర్వులతో నేరుగా అక్రమ బదిలీలు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పటికే సిద్ధం చేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని, కొత్తగా ఎవరికీ అడ్డదారిలో బదిలీలు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. జాక్టో, యుఎస్‌పిసి ఆధ్వర్యంలో డిఎస్సీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

05/27/2018 - 02:51

న్యూఢిల్లీ, మే 26: సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలను బోర్డు శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షల్లో 11 లక్షల మంది హాజరవ్వగా, 83.01 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఈ ఉత్తీర్ణతా శాతం 82.02 శాతం ఉంది. ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 88.31 శాతం ఉండగా, బాలుర శాతం 78.99 శాతం ఉందని సిబిఎస్‌ఇ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Pages