S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/27/2018 - 05:58

విజయవాడ, మే 26: మూడురోజుల పాటు ఆదివారం నుంచి జరిగే టీడీపీ పసుపు పండుగకు విజయవాడ ముస్తాబయింది. ఆదివారం నుంచి విజయవాడ కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగే మహానాడు సర్వం సిద్ధం చేశారు. మరో ఏడాదిలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు మహానాడుకు సిద్ధమవుతున్నాయి.

05/27/2018 - 06:00

శ్రీకాకుళం, మే 26: రాజకీయ గుర్తింపు ఒకరిస్తే తీసుకునే వ్యక్తిని తాను కాదని, జనసైన్యాన్ని నడిపే దళపతిని అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలంతా తెలుగువారేనని, టీడీపీ ప్రజలే ప్రభుత్వానికి అతిముఖ్యులని విమర్శించారు. ముఖ్యమంత్రి రాజకీయ గుర్తింపు కోసం దీక్ష చేస్తున్నట్టు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

05/27/2018 - 02:42

పెళ్లకూరు, మే 26: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి వెళుతూ నలుగురు దుర్మరణం చెందడం, మరో 12 మందికి తీవ్రగాయాలైన హృదయ విదారకమైన సంఘటన మండల పరిధిలోని పెళ్లకూరు వద్ద శనివారం తెల్లవారుఝామున చోటు చేసుకుంది.

05/27/2018 - 06:23

ఏలూరు, మే 26 : పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్ర సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలను సమర్పిస్తూ తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. శనివారం నాటి పాదయాత్రలో భాగంగా కల్లుగీత కార్మికులు జగన్‌ను కలసి తమ సమస్యలను చెప్పుకున్నారు. గౌడ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పాదయాత్ర 172వ రోజుకు చేరుకుంది.

05/26/2018 - 05:23

విజయవాడ: పెరిగిన డీజిల్ ధరలు నష్టాలకు గురిచేస్తున్నప్పటికీ ఆ భారాన్ని ప్రయాణికులపై వేయబోమని ఆర్టీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ (ఎండీ) ఎన్‌వి సురేంద్రబాబు స్పష్టం చేశారు. వరుసగా పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల సంస్థకు ఏటా రూ.219 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు.

05/26/2018 - 05:17

ఒంటిమిట్ట, మే 25: కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రం మాస్టర్‌ప్లాన్ అద్భుతంగా ఉందని టీటీటీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర భద్రాచలంగా ఒంటిమిట్టను ప్రభుత్వం గుర్తించి, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహిస్తోందన్నారు. ఒంటిమిట్టను అత్యద్భుత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

05/26/2018 - 05:18

హైదరాబాద్, మే 25: తెలుగుదేశం పార్టీ కోసం నా రక్తాన్ని ధారపోస్తే తన పట్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడారు. నేనేం తప్పుచేశానో తెలియడం లేదని, చేసిన తప్పుచెబితే సంతోషిస్తానని అన్నారు.

05/26/2018 - 03:25

కరీంనగర్ టౌన్, మే 25: సబ్సిడీ పథకాలతో రైతులను మభ్యపెట్టకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చే పేరుతో ఆర్థికంగా ఉన్నవారి కోసమే పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు.

05/26/2018 - 03:24

సూర్యాపేట, మే 25: తెలంగాణలో కర్నాటక తరహా ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయాత్మకశక్తిగా మారుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పగటి కలలు కంటున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు.

05/26/2018 - 04:07

సిద్దిపేట, మే 25: అభివృద్ధి.. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా కేంద్రమైన సిద్దిపేట స్పెషల్ గ్రెడ్ మున్సిపాల్టీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాల్టీ జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. గడిచిన ఐదునెలల్లో సిద్దిపేట మున్సిపాల్టీ మూడవ సారీ జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది.

Pages