S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/26/2018 - 02:51

హైదరాబాద్, మే 25: కేరళలో పదిమంది ప్రాణాలు తీసిన నిఫా వైరస్ (అతి సూక్ష్మక్రిమి) రాజధానిలోకి చొరబడిందంటూ సోషల్ మీడియా చేసిన ప్రచారంతో 24 గంటలపాటు రాజధాని అల్లాడిపోయింది. గంటల్లోనే ప్రచారం విస్తృతం కావడంతో మహానగరంలోకి ఆస్పత్రులన్నీ అలర్టయ్యాయి. ప్రభుత్వం ఒకవిధంగా హైఅలర్ట్ ప్రకటించింది. నిఫా అనుమానంతో ఫీవర్ ఆస్పత్రికి ఇద్దరు రోగులు రావడంతో, సోషల్ మీడియాలో సాగిన ప్రచారానికి ఊతంవచ్చింది.

05/26/2018 - 04:09

హైదరాబాద్, మే 25: రాష్ట్రంలో రైతులందరికీ వర్తించేలా రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించి రైతులందరికీ బీమా పత్రాలు అందిస్తామని ప్రకటిం చారు. రైతు జీవిత బీమా పథకం విధి విధానాలను ఈ సందర్భంగా ప్రకటించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు బీమా పథకంపై చర్చించి ఆమోదించనున్నట్టు వెల్లడించారు.

05/26/2018 - 02:45

హైదరాబాద్, మే 25: ప్రభుత్వ యంత్రాంగంలో జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఖరారు చేసిన ప్రభుత్వం, స్థానిక, స్థానికేతరులకు రిజర్వేషన్ల కోటాపై కూడా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేడర్ నియామకాల్లో స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం రిజర్వేషన్లు, జోనల్ కేడర్‌లో 70/30 శాతం రిజర్వేషన్లు అమలు జరిగాయి.

05/26/2018 - 04:14

హైదరాబాద్, మే 25: జోనల్, మల్టీ జోనల్‌తోపాటు స్టేట్, డిస్ట్రిక్ట్ క్యాడర్లతో నాలుగంచల వ్యవస్థ ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, సిబ్బంది, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలాగే సీఎం కేసీఆర్ ప్రకటించిన ఏడు జోన్లలో కొన్ని చేర్పులు, మార్పులనూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. తమ ప్రతిపాదనలను సీఎస్ ఎస్‌కె జోషికి జేఏసీ అందజేసింది.

05/26/2018 - 04:28

శ్రీకాకుళం, మే 25: రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన ఇచ్చిన డిమాండ్లపై 48 గంటల గడువులోగా స్పందించకపోవడంతో దీక్షకు సిద్ధమయ్యారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్‌కళ్యాణ్ తాను చెప్పినట్టే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తాను బస చేసిన రిసార్ట్స్‌లోనే నిరహారదీక్ష ప్రారంభించారు.

05/26/2018 - 02:22

గుంటూరు, మే 25: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు గుంటూరు జిల్లా దాచేపల్లి కేంద్రంగా మారుతోంది. ఇటీవల వరుస అత్యాచారాలతో ఆందోళనలు అట్టుడికిన నేపథ్యంలో తాజాగా జెడ్పీటీసీ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ బాధితురాలు జిల్లా రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు, మంత్రుల వద్ద వాపోయింది.

05/26/2018 - 02:22

తిరుపతి, మే 25: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి భక్తుల రద్దీ శుక్రవారం కూడా కొనసాగింది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు కావడంతో శుక్రవారం ఉదయం నుండి తిరుమలలో రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి 48 గంటలు పడుతోంది. అలిపిరి కాలినడక మార్గాలు, శ్రీవారి మెట్టు, రోడ్డు మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భక్తులకు తిరుమలకు వస్తున్నారు.

05/26/2018 - 04:31

రాజమహేంద్రవరం, మే 25: వివిధ సంస్థలకు సహజవాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా సందర్భంగా తలెత్తే ప్రమాదాల నివారణకు ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లో అత్యాధునిక విధానంలో చేపట్టిన గ్యాస్ డీహైడ్రేషన్ ప్లాంట్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సహజవాయువులో ఉండే తేమను తొలగించేవే ఈ డీహైడ్రేషన్ ప్లాంట్లు.

05/26/2018 - 05:01

ఏలూరు, మే 25: వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా జిల్లాలో జన్మించిన క్షత్రియ యోధునికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పాదయాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, గుమ్మలూరు సెంటర్లలో బహిరంగ సభలో మాట్లాడారు.

05/25/2018 - 04:34

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శకంగా సేవలందించే క్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం(టైంస్లాట్) కౌంటర్లలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరుమల, తిరుపతిలలో నిర్ణీత సంఖ్యలో టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు.

Pages