S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/29/2018 - 00:58

విజయవాడ (బెంజిసర్కిల్), మే 28: గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతో పార్టీపై, పార్టీ అధినేతపై బహిరంగ విమర్శలు చేస్తున్న మోత్కుపల్లి నరసింహులును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్వీ రమణ ప్రకటించారు. తన విపరీత ధోరణితో బహిష్కరించేలా ప్రవర్తించిన మోత్కుపల్లి ఏం అర్హత ఉందని ఎన్టీర్‌తో కేసీఆర్‌ను పోల్చుతారని ఆయన ప్రశ్నించారు.

05/29/2018 - 00:43

ఏలూరు, మే 28: తమ పార్టీ అధికారంలోకి వస్తే తుందుర్రు ఆక్వా పార్కును సముద్ర తీరప్రాంతానికి తరలిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగింది.

05/29/2018 - 00:40

రాజాం, మే 28: ముఖ్యమంత్రి అమరావతిని చూపించి అభివృద్ధిగా గొప్పలు చెప్పుకుంటున్నారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. సోమవారం సాయంత్రం ఇక్కడ రోడ్‌షో నిర్వహించిన అనంతరం అంబేద్కర్ జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నీతి, నిజాయితీ, నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తనను విమర్శించడం మానుకుని అనుభవం, విజ్ఞత చూపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎంకు సూచించారు.

05/29/2018 - 00:37

విజయవాడ, మే 28: ‘లక్షల్లో.. కోట్లలో ఎందరో పుడుతుంటారు.. మరెందరో చనిపోతుంటారు.. వారిలో కొందరు మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు.. వారిలో చరిత్ర సృష్టించే యుగపురుషుల్లో దివంగత ఎన్టీఆర్ ఒక్కరంటూ’ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు.

05/28/2018 - 04:19

విజయవాడ: తెలంగాణ ప్రజలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం కోసం అక్కడ పోరాటం చేస్తున్నామని, అవకాశం వచ్చినప్పుడు సామాజిక న్యాయం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

05/28/2018 - 00:40

హైదరాబాద్, మే 27: నిఫా వైరస్ ఇప్పుడు తెలంగాణను వణికిస్తోంది. హాట్ టాపిక్‌గా మారిన నిఫా వైరస్ అంశమే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు, సోషియల్ మీడియాలో నిఫాకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఊపిరితిత్తుల సమస్య వస్తే నిఫా సోకిందేమోనని అనుమాన పడుతున్నారు.

05/28/2018 - 00:39

హైదరాబాద్, మే 27: కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు రిజర్వేషన్లు, స్థానికతకు ప్రామాణికతను ఖరారు చేసింది. ఇక నుంచి ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95 శాతం, ఇతరులకు 5 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఆదివారం జరిగిన మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుని ఆమోదించింది.

05/28/2018 - 00:35

హైదరాబాద్, మే 27: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం కోసం, మైనారిటీ రిజర్వేషన్లు, హైకోర్టు విభజన వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు సీఎం కే. చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్ళారు. ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో జోన్ల వ్యవస్థ, రైతులకు జీవిత బీమా పథకంపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించింది.

05/28/2018 - 00:31

భీమవరం, మే 27: హౌసింగ్ ఫర్ ఆల్ (హెచ్‌ఎఎఫ్) పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలసి నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అర్హులు చెల్లించాల్సిన మిగిలిన భాగం ( 50శాతం షేర్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తానని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర 173వ రోజు ఆదివారం భీమవరం చేరుకుంది.

05/28/2018 - 00:26

విజయవాడ, మే 27: ‘మాతో పెట్టుకున్న కుట్రదారులూ.. జాగ్రత్త..’ అంటూ బీజేపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బెదిరింపులకు భయపడమని స్పష్టం చేసిన ఆయన ‘రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కష్టం మాది.. సోకు మీదా.. ’అంటూ నిప్పులు చెరిగారు.

Pages