S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/30/2018 - 00:44

కరీంనగర్, మే 29: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఘటన మరువకముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ. పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. ఒళ్లు జలదరించే బీభత్స ప్రమాద ఘటన అందరినీ కలిచివేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామం వద్ద కరీంనగర్ -వరంగల్ హైవేపై మంగళవారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది.

05/30/2018 - 04:35

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో మంగళవారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం పునర్‌వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ తీర్మానాన్ని కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందించారు.

05/30/2018 - 00:32

ఏలూరు, మే 29 : ఏళ్ల తరబడి కొబ్బరి ఒలుపు పనిలోనే ఉండటంవల్ల తమ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడకపోగా అనారోగ్యం చుట్టుముడుతోందని, తమను కాపాడాలంటూ కొబ్బరి ఒలుపు కార్మికులు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అంతేకాకుండా బీమా వంటి సౌకర్యాలను కల్పిస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.

05/30/2018 - 00:29

విజయవాడ, మే 29: కట్టుబట్టలతో..నయాపైసా ఆదాయం లేకుండా రాజధాని ఎక్కడో తెలియకుండా రాష్ట్రాన్ని విభజించినప్పటికీ మా కున్న వనరులు..

05/30/2018 - 02:30

హైదరాబాద్: తెలంగాణలో బి.ఇడి కోర్సుల కోసం 31న ఎడ్‌సెట్-2018 నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. పరీక్షకు 38,693 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈసారి ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 31న ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, తెలంగాణలో 53, ఆంధ్రలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

05/29/2018 - 04:22

ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన 10 మంది యాత్రికులు నేపాల్‌లో చిక్కుకుపోయారు. మానస సరోవరం వెళ్లేందుకు ఖమ్మం నగరంలోని అయ్యప్ప దేవాలయం కార్యదర్శి అప్పారావు ఆధ్వర్యంలో 10 మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన స్టార్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లారు. అందరినీ నేపాల్ రాజధాని ఖాట్మండ్‌కు తీసుకెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ యాజమాన్యం అక్కడి నుంచి మానస సరోవరం పంపిస్తామని చెప్పింది.

05/29/2018 - 02:56

హైదరాబాద్, మే 28: ఏపీ ప్రజలను నాలుగేళ్లుగా మోసం చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీకీ ఇదే ఆఖరి మహానాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బొత్స చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజలను పస్తులుంచిన చంద్రబాబు మహానాడు పేరుతో టీడీపీ నేతలు పిండివంటలు తింటూ పండుగ చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు.

05/29/2018 - 02:53

హైదరాబాద్, మే 28: అభ్యుదయ సిని నిర్మాత, నటుడు మాదాల రంగారావు అంత్యక్రియలు సోమవారం ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. 1980-90 దశకంలో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఎన్నో విప్లవ చిత్రాలను నిర్మించిన మాదాల ఆదివారం ఉదయం మృతిచెందిన విషయం విదితమే. మాదాల మృతదేహాన్ని సీపీఎం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో సందర్శనార్ధం ఉంచారు.

05/29/2018 - 02:53

హైదరాబాద్, మే 28: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షునిగా సీనియర్ ప్రాతికేయుడు దేవులపల్లి అమర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన తెలంగాణలోని వరంగల్ జిల్లా వాస్తవ్యులు.

05/29/2018 - 02:50

హైదరాబాద్, మే 28: ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నాడు మొదలైంది. తొలి రోజు 10వేల మందిని ఆహ్వానించగా, 5699 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. 100లోపు ర్యాంకర్లు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు.

Pages