S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/25/2018 - 00:26

కర్నూలు, మే 24: తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులుపై చర్యలు తీసుకునే అంశాన్ని బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. కర్నూలులో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు ప్రవర్తించారని ఆరోపించారు.

05/25/2018 - 04:31

విశాఖపట్నం: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంత వెంపర్లాడినా ఫలితం కనిపించడం లేదు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం దగ్గర నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వరకూ దేనికైనా కమ్యూనికేషన్స్ స్కిల్స్, వృత్తి నైపుణ్యంతోపాటు ఆయా అభ్యర్థులు కళాశాలల్లో నేర్చుకున్న సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు. చాలా మంది అభ్యర్థులు వీటిలో ఫెయిల్ అవడం వలనే ఉద్యోగాలు లభించడం లేదు.

05/25/2018 - 00:23

హైదరాబాద్, మే 24: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారనున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. గురువారం నాడు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు సభకు ఆయన హాజరయ్యారు.

05/24/2018 - 04:52

న్యూఢిల్లీ, మే 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడింది, వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. అశోక్ గెహ్లాట్, సుర్జేవాలా బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై సమీక్షించారు.

05/24/2018 - 02:51

నందిగామ, మే 23: జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

05/24/2018 - 02:49

విజయవాడ, మే 23: దేశంలో పశ్చిమ, దక్షిణ రీజియన్లను కలుపుతూ ఏర్పాటు కాబోతున్న హైఓల్టేజీ డైరెక్ట్ కరెంట్ పథకానికి జూన్ నెలాఖరులోగా కడప, చిత్తూరు జిల్లాల నుంచి అటవీ శాఖ అనుమతులు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. దేశంలో అమలవుతున్న 13 కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

05/24/2018 - 04:54

విశాఖపట్నం, మే 23: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆభరణాలున్నాయని ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హైదరాబాద్‌లో నిర్మించుకున్న భవనంలోను, అమరావతిలోని ఆయన అధికార నివాసంలోను వెంకటేశ్వరుని ఆభరణాలు ఉన్నాయన్నారు.

05/24/2018 - 05:01

న్యూఢిల్లీ, మే 23: దేశంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం పీచమణిచేందుకు కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా పది రాష్ట్రాల్లో 4072 మొబైల్ టవర్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. అనేక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

05/24/2018 - 02:22

విజయవాడ, మే 23: ఖరీఫ్ నారుమళ్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాల గురించి బుధవారం రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కృష్ణా రైతులకు జూన్‌లోనే నీరు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

05/24/2018 - 05:00

హైదరాబాద్, మే 23: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యేగా సంభోదించటం సంచలనమైంది. సీఎం లెటర్‌హెడ్‌పై శుభాకాంక్షలు తెలుపుతూ కోమటిరెడ్డి పక్కన ఎమ్మెల్యే అని రాయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. మార్చిలో జరిగిన కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ పట్ల దురుసుగా ప్రవర్తించి కౌన్సిల్ చైర్మన్ కె.

Pages