S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/30/2018 - 03:24

హైదరాబాద్, మే 29: తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ ఆన్‌లైన్ ద్వారా 1,31,415 మంది దరఖాస్తు చేశారు. ఇంత వరకూ 1,43,657 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,36,788 మంది ఫీజు చెల్లించారు. ఇందులో 1,27,122 మంది దరఖాస్తులను ఇప్పటికే ఆమోదం పొందగా, అభ్యర్ధులు 1,24,877 కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.

05/30/2018 - 02:47

హైదరాబాద్, మే 29: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, చైతన్యం కలిగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై ప్రచారం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి.

05/30/2018 - 01:58

నల్లగొండ, మే 28: నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ క్రమంగా డెడ్ స్టోరేజీ దిశగా పడిపోతోంది. 510 అడుగుల కనీస నీటి మట్టం (డెడ్ స్టోరేజ్)కు గాను ప్రస్తుతం 512 అడుగులుగా 136.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. సకాలంలో రుతు పవనాలు వచ్చి వర్షాలు సమృద్ధిగా కురిసిన పక్షంలో డెడ్ స్టోరేజీకి ముందుగానే సాగర్‌లో నీటి మట్టం పెరుగనుంది.

05/30/2018 - 01:49

అనంతపురం, మే 28: ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో పండుతున్న పండ్లకు అంతర్జాతీయ మార్కెట్ ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుతం మామిడికాయలు అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ పండే పండ్లు, కాసే కాయలు టేబుల్ వెరైటీ (నిల్వ ఉంచుకునే వీలు)వి కావడంతో విదేశాల్లో డిమాండ్ ఏర్పడింది. అలాగే అరటి, దానిమ్మ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

05/30/2018 - 02:36

తిరుపతి, మే 29: అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి తమిళనాడు రాష్ట్రం, తేనే జిల్లాకు చెందిన తంగదొరై అనే భక్తుడు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని రూ. 2కోట్లు విలువ చేసే సువర్ణ సూర్య కఠారీని అందజేశా రు. మూడున్నర అడుగుల పొడవు, 6 కేజీల బంగారం తో తయారు చేయించిన ఈ సూర్య కఠారీని టీటీడీ అధికారులు స్వీకరించారు.

05/30/2018 - 01:03

న్యూఢిల్లీ, మే 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ(సవరణ)చట్టానికి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.దీనికి సంబంధించిన ఫైల్‌పై రాష్టప్రతి సంతకం చేసినట్టు ఏపీభవన్ అధికారులు మంగళవారం వెల్లడించారు.

05/30/2018 - 01:02

కాకినాడ, మే 29: ఏపీ ఎంసెట్-2018 సీబీఎస్‌ఈ విద్యార్థులకు సంబంధించి ర్యాంకులను బుధవారం జేఎన్‌టీయూ (కాకినాడ) ప్రకటించనుంది. ఎంసెట్‌లో అర్హత సాధించి ఇంకా ర్యాంకులు పొందని సీబీఎస్‌ఈ విద్యార్థులు తమ డిక్లరేషన్ ఫారంలను అందజేయడంతో ర్యాంకులను ప్రకటిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు మంగళవారం తెలియజేశారు.

05/30/2018 - 01:01

హైదరాబాద్, మే 29: తెలుగుదేశం పార్టీ గొప్పగా జరుపుకుంటుంన్న మహానాడులో ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలపై ఎందుకు చర్చించలేదో అనంతపురం పార్లమెంట్ సభ్యడు జేసీ దివాకరరెడ్డి చెప్పాలని వైఎస్‌ఆర్ సిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

05/30/2018 - 02:32

హైదరాబాద్: విశ్వాస ఘాతకుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అని, దేశంలో రాజకీయ అవినీతికి ఆధ్యుడని టీడీపీ బహిష్కుృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తనకు పదవి ఇవ్వనుందుకే ఆరోపణలు చేస్తున్నానని చంద్రబాబు చేయిస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

05/30/2018 - 00:47

హైదరాబాద్, మే 29: రైతుబంధు పథకం ఓట్ల కోసం కాదని, రైతన్న అప్పుల పాలు కాకుండా ఉండేందుకే పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామనడం సాధ్యం కాదన్నారు. ఇది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కినట్టే ఉందని సిఎం విమర్శించారు.

Pages