S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/13/2017 - 23:23

వౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ జహీరాబాద్ నిమ్జ్‌లో 500 ఎకరాల్లో ఏర్పాటు
శ్రేయి ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో తెలంగాణ ఒప్పందం పదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాల కల్పన

12/13/2017 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రధాన చౌరాస్తాల్లో తోరణాల ఏర్పాటు కూడా ప్రారంభమైందని, ఎల్బీస్టేడియంలో ప్రధాన కార్యక్రమం జరిగే పాల్కురికి సోమన ప్రాంగణంలో బమ్మెర పోతన వేదిక సిద్ధమైందని అన్నారు.

12/13/2017 - 04:08

హైదరాబాద్, డిసెంబర్ 12: టిడిపి సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాదవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో తమ అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఉమా మాదవరెడ్డి ప్రకటించారు.

12/13/2017 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకతో పాటు శీతాకాల విడిది కోసం రెండు పర్యాయాలు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాష్టప్రతి పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ మంగళవారం సంబంధిత అధికారులతో చర్చించారు.

12/13/2017 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం (కాన్వొకేషన్) బుధవారం నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయం ఆవరణలోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆడిటోరియంతో పాటు విశ్వవిద్యాలయంలోని ప్రధాన భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

12/13/2017 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 12: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులన్నీ వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్ది ప్రాజెక్టుకు గతంలో విధించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. జలసౌధలో మంగళవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి సమీక్షించారు.

12/13/2017 - 04:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రం విషయంలో ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో పొన్నం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ హక్కులకోసం పార్లమెంట్‌లో ఎంపీలు పోరాటం చేయడం లేదని మండిపడ్డారు. విభజన హామీలు అమలుకాకపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు.

12/13/2017 - 03:45

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 12: తీవ్రమైన కరవుతో రైతులు అల్లాడిపోతున్నా వారి గోడును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

12/13/2017 - 03:44

సంగారెడ్డి, డిసెంబర్ 12: సమాజంలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలకు ఆపన్న హస్తం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో అమలు చేస్తు న్న ఒంటరి మహిళ పింఛన్ పథకం అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల వత్తిళ్లతో పక్కదారి పట్టింది.

12/13/2017 - 03:44

చిగురుమామిడి, డిసెంబర్ 12: తల్లీకొడుకుల పేగుబంధం మరణంలోనూ వీడలేదు. కనిపెంచి, ప్రేమనురాగాలు పంచిన కన్నతల్లి వెంటే తనయుడు తనువు చాలించాడు. ఒకేరోజు తల్లి, కొడుకుల అంతిమయాత్ర, పక్కపక్కనే చితి పేర్చి అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన ఇది. ఈ సంఘటన కరీం నగర్ జిల్లా చిగురుమామిడిమండలంలోని సుందరగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

Pages