S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2017 - 03:02

హైదరాబాద్/ ఉప్పల్, ఆగస్టు 21: బాలికపై అత్యాచారం చేసి, ఆపై వీడియోలో చిత్రీకరించిన ఇద్దరు యువకులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేశారు. ఉప్పల్ భరత్‌నగర్‌లో నివసిస్తున్న జనగాం జిల్లా రఘునాధ్‌పల్లి మండలం పరిధిలోని మంగల్ బండ తండాకు చెందిన గూగులోతు కుమార్ (19) డిగ్రీ విద్యార్థి.

08/22/2017 - 03:01

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు కొందరు కోర్టులకు వెళుతుంటే, వీరి నిర్వాకాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార తెరాస నాయకత్వం తమ పార్టీ శ్రేణులకు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ అంశంపై కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.

08/22/2017 - 03:00

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బిసిల సంక్షేమం కోసం, వారి కార్యకలాపాల నిర్వహణకు హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో వంద కోట్లతో బిసి భవన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇటీవల సిఎం కెసిఆర్ బిసి కమిషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో తాము మరిన్ని డిమాండ్లను తెలియజేశామని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

08/22/2017 - 02:58

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల పెంపకానికి బృహత్ పథకాన్ని రూపొందించాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. రాష్ట్రంలో కూరగాయల పంటల ఉత్పత్తులు, ధరల తీరుతెన్నులపై సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షించారు. ‘మన కూరగాయల పథకం’ కింద రంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నల్లగొండ జిల్లాల్లోని 128 గ్రామాలను గుర్తించి, కాయగూరల పెంపకం చేపట్టామన్నారు.

08/21/2017 - 03:04

నల్లగొండ, ఆగస్టు 20: ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు ఇంటింటికీ మంచినీటి సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనులకు కాంట్రాక్టర్ల కొరత ఆటంకంగా మారింది. మిషన్ భగీరథ పనుల్లో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అంతర్గత పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ల కోసం ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ వేట సాగిస్తున్నా పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు దొరకడం లేదు.

08/21/2017 - 03:02

ఆదిలాబాద్, ఆగస్టు 20: అల్పపీడన ప్రభావంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు లోటుతో దిక్కులు చూస్తున్న రైతులకు విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరియగా, ఖరీఫ్ పనులు జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్నాయి.

08/21/2017 - 03:00

మహబూబ్‌నగర్, ఆగస్టు 20: రాష్ట్రంలో సామాజిక వర్గాలతో తెరాసను సవాల్ చేసే శక్తిగా టిమాస్ ఎదుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, టి-మాస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో టిమాస్ ఆవిర్భావ సభలు నిర్వహించారు.

08/21/2017 - 02:58

నల్లగొండ టౌన్, ఆగస్టు 20: దళితుల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు అన్నారు.

08/21/2017 - 02:58

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 20: దేశంలో ఉన్న నదీజలాలను దామాషా ప్రకారం రాష్ట్రాలకు కేటాయించే విధానాన్ని కేంద్ర నీటి సంఘం చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.

08/21/2017 - 02:57

కొత్తకోట, ఆగస్టు 20: పాముకాటుతో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అబ్దుల్ జబ్బార్ తెలిపిన వివరాల ప్రకారం... మదనాపురం మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన బోయ ఆశన్న, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు హరికృష్ణ (10), తమ్ముడు మహేష్. వీరు నానమ్మ దగ్గర ఉండి విద్యను అభ్యసిస్తున్నారు.

Pages