S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2017 - 04:13

బాసర, ఆగస్టు 21: నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి విగ్రహం తరలింపు, అక్షరాభ్యాస పూజల వివాదం కొలిక్కివస్తోంది. అమ్మవారి విగ్రహాన్ని తరలించి నల్గొండ జిల్లా దేవరకొండలోని ఒక ప్రైవేటు పాఠశాలలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీంతో దేవాదాయ శాఖ ఆధికారులు స్పందించి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణదారు ప్రణవ్ శర్మను తొలగించడం తెలిసిందే.

08/22/2017 - 04:11

గోదావరిఖని, ఆగస్టు 21: సింగరేణి బొగ్గు పరిశ్రమలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నగరా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 6వ దఫా సింగరేణి ఎన్నికలకు తేదీ ఖరారయింది. 14 నెలల జాప్యం తరువాత గుర్తింపు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఎట్టకేలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

08/22/2017 - 04:10

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 21: గొల్ల, కుర్మలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గొర్రెల పంపిణీ పథకం’ ఆదిలోనే అభాసుపాలవుతోంది. పర్యవేక్షించాల్సిన అధికార గణం పట్టించుకోకపోవడంతో సర్కారు గొర్రెకు ‘రోగం’ సోకుతోంది. రాయితీపై అందించిన జీవాలు అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతుండడంతో లబ్ధిదారుల సంబరం అంతలోనే ఆవిరవుతోంది.

08/22/2017 - 04:09

కామారెడ్డి రూరల్, ఆగస్టు 21: సికింద్రబాద్ నుండి ముంబయ వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి కవలలు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి రైల్వే ఎస్‌ఐ సాహునాయక్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చందన చంద్రం-్భనుశ్రీలకు మూడేళ్ల క్రితం ఇద్దరు మగ కవల పిల్లలు చందన విఘ్నేష్, విద్వేష్ జన్మించారు.

08/22/2017 - 04:09

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 21: సక్రమంగా నడుస్తున్న ఆ సర్కారీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో అధికారులు మూసివేశారు. అయతే, అదే పాఠశాలలో పెద్దపల్లికి మంజూరైన అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తమ పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొండి పట్టుదలతో ఉద్యమం చేసి, చివరగా తమ బడిని సాధించుకున్నారు.

08/22/2017 - 03:54

సోమవారం రాజ్‌భవన్‌లో పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు. పౌర సన్మానంలో భాగంగా నిలువెత్తు చిత్ర పటాన్ని ఉప రాష్టప్రతికి అందజేస్తున్న సిఎం కెసిఆర్. చిత్రంలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి, ఎంపి జితేందర్‌రెడ్డి ఉన్నారు

08/22/2017 - 03:46

హైదరాబాద్, ఆగస్టు 21: వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, దీని కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో వరంగల్ జంట నగరాల శాసన సభ్యుల సమావేశం బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగింది. వరంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, పెండింగ్ పనులను సమీక్షించారు.

08/22/2017 - 03:46

బాల్కొండ, ఆగస్టు 21: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని, నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 8 టిఎంసిల వరదనీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఎస్‌ఇ శ్రీనివాస్ తెలిపారు.

08/22/2017 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 21: కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నం కల్పశ్రీ ఆర్ట్ సెంటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు కల్పశ్రీ అంతర్జాతీయ నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది.

08/22/2017 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 21: నల్లగొండ జిల్లా, సర్వేల్ గురుకుల పాఠశాల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో తనకు మాట్లాడే అవకాశం లేకుండా చేసి అవమానించిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల (సర్వేల్) యజమాన్య కమిటీ చైర్ పర్సన్ చెన్నోజు ధనలక్ష్మి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు.

Pages