S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/23/2017 - 03:14

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉన్న జిల్లాల్లో రూ.1300 కోట్ల నిధులతో 215 రోడ్ల అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి. కాని ఈ రోడ్ల అభివృద్ధికి దాదాపు వెయ్యి ఎకరాల అటవీ భూములను సేకరించాల్సి ఉంది. దీనికి అటవీ శాఖ అనుమతులు అవసరమని ప్రభుత్వం గుర్తించింది.

08/23/2017 - 03:14

హైదరాబాద్, ఆగస్టు 22: యాసంగి పంటల విత్తన సరఫరాకై రాష్ట్ర వ్యవసాయ శాఖ ధరలను ఖరారు చేసింది. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం అధికారులతో సమావేశం అయ్యారు. రాబోయే యాసంగిలో మొత్తం 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందులో శనగ , వేరుశనగ తప్ప మిగతా పంల విత్తనాల ధరల్లో మార్పు లేదు.

08/23/2017 - 03:13

హైదరాబాద్, ఆగస్టు 22: నియోజక వర్గ అభివృద్ధి నిధులు(సిడిపి) వార్షిక ఆడిట్ నివేదికతో అఫిడవిట్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాద్ హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన బెంచ్ విచారించింది.

08/23/2017 - 03:13

హైదరాబాద్, ఆగస్టు 22: ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి, బిసి కార్పొరేషన్‌కు ఎందుకు ఇవ్వరని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణయ్య నేతృత్వంలో బిసి సంఘం నాయకులు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి తమ ఆందోళనను వెలిబుచ్చారు.

08/23/2017 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 22: ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఈసారి ఖరీఫ్‌లో పంట దిగుబడి బాగుంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ, ఉత్పత్తి కమీషనర్, వ్యవసాయ కమీషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పత్తి రికార్డు స్థాయిలో సాగు అవుతున్నట్టు చెప్పారు.

08/23/2017 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 22: ఎందరో కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న చలనచిత్ర రంగాన్ని పరిరక్షించేందుకు పైరసీని అరికట్టడంలో అధికారులు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ ఇండియన్ కాపీరైట్స్ సంస్థ చైర్మన్ రత్నాకర్, డైరెక్టర్ అరవింద్‌లు మంత్రిని మంగళవారం కలిశారు.

08/23/2017 - 03:11

హైదరాబాద్, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

08/23/2017 - 01:53

హైదరాబాద్, ఆగస్టు 22: వాహనాల రిజిస్ట్రేషన్లు, మలి విడత విక్రయాల్లో బదలాయింపు వంటి వాటిల్లో సమూలమైన మార్పులు తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ సమాయత్తమైంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా శాఖ సంయుక్త కమిషనర్, కార్యదర్శి జె. పాండురంగ నాయక్ మంగళవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు.

08/23/2017 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 22: జిల్లాల్లో అభివృద్ధి పనులకు ‘క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్’ (సిబిఎఫ్) కింద 23.25 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో రెండో విడతగా ఈ నిధులను విడుదల చేశారు. ఒక్కో జిల్లాకు 75 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు.

08/23/2017 - 01:51

హైదరాబాద్, ఆగస్టు 22: గురుకుల విద్యాలయాలలో పిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్ పరీక్షను రద్దు చేసినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. తిరిగి మరోసారి ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. జూలై 18న గురుకుల విద్యాలయాలల్లో పిడి పోస్టుల భర్తీ కోసం టిఎస్‌పిఎస్‌సి మెయిన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

Pages