S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/20/2017 - 03:33

హైదరాబాద్, ఆగస్టు 19: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ దేశవ్యాప్తంగా ఒకేసారి సుమారు లక్ష మందితో యోగ, ప్రాణాయామం చేయించి రికార్డు సృష్టించారు. శనివారం టివీ ద్వారా రవి శంకర్ ప్రాణాయామం, యోగ గురించి తెలిపారు.

08/20/2017 - 03:32

హైదరాబాద్, ఆగస్టు 19: పోలీస్ శాఖలో 1989-91 బ్యాచ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా నియామకం అయినవారు శనివారం సచివాలయంలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మను కలిసి తమకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈ బ్యాచ్‌కు చెందిన వారికి ఇప్పటి వరకు సిఐలుగా ప్రమోషన్ లభించింది.

08/20/2017 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని, ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోందని శనివారం నాడిక్కడ జరిగిన విద్యావంతుల చైతన్య వేదిక సదస్సులో వక్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మద్యం నియంత్రణకే పరిమితం కాకుండా నిషేధించాలని వేదిక కోరింది.

08/20/2017 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్రానికి రావలసిన ఐటిఐఆర్ ప్రాజెక్టు, ఉద్యోగాలూ ఏమయ్యాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మూడేళ్ళ పాలనలో రాష్ట్రం అవినీతికి, అక్రమాలకు, మాఫియాలకు అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. శంషాబాద్ మండలంలోని మదనపల్లిలోని శనీశ్వరాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

08/20/2017 - 03:30

హైదరాబాద్, ఆగస్టు 19: మెట్రోరైలును వచ్చే నవంబర్ నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట మైత్రివనం ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ పనులతో పాటు ఇతర పలు ప్రాంతాల్లో ఆహార్నిశలు పనులు జరుగుతున్నాయి.

08/20/2017 - 03:28

హైదరాబాద్, ఆగస్టు 19: మహిళల రక్షణకు ప్రత్యేకంగా ‘మహిళా హెల్ప్‌లైన్-181’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలకు సలహాలు ఇచ్చేందుకు, కౌన్సిలింగ్ నిర్వహించేందుకు, రక్షణ కోసం ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడుతుంది. రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఈ హెల్ప్‌లైన్‌ను సచివాలయంలో ప్రారంభించారు.

08/20/2017 - 03:25

హైదరాబాద్/ఖైరతాబాద్, ఆగస్టు 19: తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై సమిష్టి పోరు సాగిద్దామని అఖిలపక్ష నేతలు తీర్మానించారు. శనివారం టి.జెఎసి ఆధ్వర్యంలో ‘సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు-ప్రభుత్వ ఆంక్షలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు లింగయ్య అధ్యక్షత వహించారు.

08/20/2017 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 19: బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్‌ను కోరారు. అరుణ్‌కుమార్‌ను శనివారం కలిసిన కెటిఆర్ రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ అంశాలను వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

08/20/2017 - 02:47

హైదరాబాద్, ఆగస్టు 19: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పాటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఉపాధ్యాయులు అంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని అన్నారు. జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాల్లో పాల్గొనాలని అన్నారు.

08/20/2017 - 02:46

హైదరాబాద్, ఆగస్టు 19: ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనలో స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్థన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో లోగడ 10 జిల్లాలు ఉండగా వాటిని 31 జిల్లాలుగా చేసిన ముఖ్యమంత్రి ఈ మొత్తం జిల్లాలలను ప్రాతిపాదికగా తీసుకుంటారా? లేక 10 జిల్లాలనే నియామకాల ప్రాతిపదికగా తీసుకుంటారా? అని ఆయన శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

Pages