S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2017 - 03:42

హైదరాబాద్, ఆగస్టు 21: డిసెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతుందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటెక్ వెల్ నుంచి ఇంటింటికి నల్లా వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీటిని అందిస్తామన్నారు.

08/22/2017 - 03:41

హైదరాబాద్, ఆగస్టు 21: అసభ్య పోస్టర్‌పై ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావుకు కోసం వచ్చింది. ఇంకేముంది వెంటనే ఆ పోస్టర్‌ను చించి వేశారు. సోమవారం విహెచ్ గాంధీ భవన్ నుంచి బయటకు వెళుతుండగా, ప్రధాన రోడ్డు నుంచి ఒక బస్సు వెళ్ళింది. ఆ బస్సు వెనకాల ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ఉండడంతో వెంటనే ఆయన ఆ బస్సును ఆపించారు. కారు దిగి ఆ పోస్టర్‌ను చించేశారు.

08/22/2017 - 03:39

హైదరాబాద్, ఆగస్టు 21: గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి శిక్షణ ఇచ్చి, వారిలో వృత్తి నైపుణ్యాలను మరింత పెంచాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చి సర్ట్ఫికెట్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యుల జెఎసి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

08/22/2017 - 03:39

హైదరాబాద్, ఆగస్టు 21: జాతీయ స్థాయిలో ఈసారి అత్యధిక సీట్లుసాధించి స్వతంత్రంగా కేంద్రంలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి అందుకు అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాలపై, ప్రధానంగా తెలంగాణపై దృష్టిసారించింది.

08/22/2017 - 03:38

హైదరాబాద్, ఆగస్టు 21: షార్ట్ఫిల్మ్‌లలో నటిస్తే డబ్బులు బాగా వస్తాయని నమ్మించి అందమైన యువతులకు వల వేస్తూ, అశ్లీల సన్నివేశాలు చిత్రీకరిస్తూ యువతులను మోసం చేస్తున్న ముఠా వ్యవహారం సోమవారం బయటపడింది. హైదరాబాద్‌లో ఎంతోమంది యువతులు ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారు. సినిమాలో అవకాశం కల్పిస్తానంటూ ఇటీవల ఓ యువతిని ఓ మాయలేడి నమ్మించింది. మొదట్లో ఓ సినిమాలో చిన్న పాత్రకు అవకాశం కల్పించింది.

08/22/2017 - 04:03

వరంగల్, ఆగస్టు 21: మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొచ్చు సమ్మయ్య తీవ్ర అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1982లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలుపొందారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో సభ్యునిగా కొనసాగారు.

08/22/2017 - 03:05

హైదరాబాద్, ఆగస్టు 21: అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు కోసం కొంత సేపు ఎదురు చూశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాల్సిందిగా వంశీచంద్ మంత్రి జూపల్లికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

08/22/2017 - 03:03

హైదరాబాద్, ఆగస్టు 21: హైదరాబాద్‌లో నిషేధిత గుట్కాపై టాస్క్ఫోర్స్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నగరవ్యాప్తంగా సోమవారం ముమ్మర తనిఖీలు చేపట్టి రూ.54లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

08/22/2017 - 03:02

హైదరాబాద్, ఆగస్టు 21: సిరిసిల్ల జిల్లా, నేరెళ్ళలో దళితులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్‌సి కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే సమగ్ర నివేదిక తయారు చేసి తమకు ఫాక్స్ ద్వారా పంపించాలని కమిషన్ రాష్ట్ర డిజిపిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

08/22/2017 - 03:02

హైదరాబాద్, ఆగస్టు 21: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దొందు-దొందేనని ఎఐసిసి మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్ విమర్శించారు. ముస్లింలను మభ్య పెట్టేందుకే కెసిఆర్ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. మోదీ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు.

Pages