S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/21/2017 - 02:57

హైదరాబాద్, ఆగస్టు 20: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈనెల 22 నుంచి 26 వరకు నిర్వహించతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే ఆపివేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కమిటీ సభ్యులు పశ్యపద్మ, వీరయ్య, చంద్రశేఖర్, మార్త రాజయ్య మాట్లాడారు.

08/21/2017 - 02:56

హైదరాబాద్, ఆగస్టు 20: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు, గుండంపల్లి, సుంకెనపల్లిలో రాంకీ సంస్థ కొనుగోలు చేసిన భూముల రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిఎం కెసిఆర్‌ను కోరారు. రాంకీ బినామీ రిజిష్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన సిఎంకు లేఖ రాశారు. ఆ లేఖను ఆదివారం విడుదల చేశారు.

08/21/2017 - 02:56

హైదరాబాద్, ఆగస్టు 20: భారత వ్యవసాయ మండలి తెలంగాణ సిఎం కెసిఆర్‌కు వ్యవసాయ పురస్కారాన్ని ప్రకటించడం సిగ్గు చేటని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టిటిడిపి) విమర్శించింది. వ్యవసాయ మండలా..? లేక కెసిఆర్ భజన మండలా..? అని ప్రశ్నించింది. టిటిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

08/21/2017 - 02:46

హైదరాబాద్/గచ్చిబౌలి, ఆగస్టు 20: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. మసాజ్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మసాజ్ సెంటర్లు నడుపుతున్నారని సమాచారంతో పోలీసులు పలు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.

08/21/2017 - 01:54

హైదరాబాద్, ఆగస్టు 20: వచ్చే నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశం నిర్ణయించింది. ఆదివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

08/21/2017 - 01:51

హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో బాగా రద్దీగా ఉండే బాలానగర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు సోమవారం శంకుస్థాపన జరుగుతోంది. బాలానగర్ క్రాస్ రోడ్డు నుండి నర్సాపూర్ క్రాస్ రోడ్డు వరకు దాదాపు 1.09 కిలోమీటర్ల పొడవుతో ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మించేందుకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు శంకుస్థాపన చేస్తున్నారు.

08/21/2017 - 01:50

హైదరాబాద్, ఆగస్టు 20: భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో, వాట్సాప్‌లో సమీక్షిస్తున్నారు. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ విభాగాల సిఇలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు.

08/21/2017 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 20: దేశ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే గుండె వ్యాధులు రాకుండా ముందుగానే నివారణ ప్రక్రియ చేపడుతున్నారని ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్‌కుమార్ అన్నారు. గుండె వ్యాధుల భారాన్ని తగ్గించేందుకు అత్యవసరంగా 50 శాతం జనాభా నివారణ ప్రక్రియలను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

08/21/2017 - 01:48

హైదరాబాద్, ఆగస్టు 20: త్వరలో లోక్‌సత్తా పార్టీ నియోజకవర్గ కమిటీలను నియమించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు నందిపేట రవీందర్ తెలిపారు. అలాగే అక్టోబర్‌లో పార్టీ వార్షికోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

08/21/2017 - 01:47

హైదరాబాద్, ఆగస్టు 20: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వ్యవసాయ నాయకత్వ అవార్డు ఇస్తున్నట్లు భారతీయ ఆహార వ్యవసాయ మండలి ప్రకటించడం పెద్ద కుట్ర అని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మండలిని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా ప్రజలను భ్రమింపజేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

Pages