S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/20/2017 - 02:46

హైదరాబాద్, ఆగస్టు 19: రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు.

08/20/2017 - 02:43

హైదరాబాద్, ఆగస్టు 19: భూ నిర్వాసితులకు చట్టబద్ధమైన పరిహారం చెల్లించకుండా భూములు స్వాధీనం చేసుకోవాలనుకున్నా, పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలనుకున్నా ప్రతిఘటిస్తామని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్‌లో మొదలైన నిర్వాసితుల తిరుగుబాటు 15 జిల్లాలకు వ్యాపించిందని కమిటీ రాష్ట్ర కన్వీనర్ బి. వెంకట్, కో-కన్వీనర్ టి.

08/20/2017 - 02:43

హైదరాబాద్, ఆగస్టు 19: హరితహారంతోనే మానవ మనుగుడ సాధ్యం అనే నినాదంతో వికలాంగుడైన మహేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అభినందించారు. హరిహారం ప్రారంభమైన నాటి నుంచి 37రోజులుగా తెలంగాణలోని అన్ని అన్ని జిల్లాల్లో పర్యటించి శనివారం మంత్రి జోగు రామన్న నివాసానికి మహేష్ చేరుకున్నారు.

08/20/2017 - 02:41

హైదరాబాద్, ఆగస్టు 19:మేం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తాం మీరు రాజీనామా చేసి పోటీకి సిద్ధమా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన రామ్మోహన్‌రెడ్డి రాజీనామా చేసి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు, వంశీచంద్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అని సవాల్ చేశారు.

08/20/2017 - 02:40

న్యూఢిల్లీ,ఆగస్టు 19: తెలంగాణలో రజాకార్ వారసత్వ రాజకీయాలకు విరుద్ధంగా పోరాటం కొనసాగించాలని బిజెపి ఆధినాయకత్వం భావిస్తోంది. బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు శనివారం తనను కలిసిన విలేఖరులతో ఈ విషయం సూచనప్రాయంగా చెప్పారు. తెలంగాణలో బలపడేందుకు బిజెపి వద్ద బలమైన ఆయుధాలున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు రజాకార్ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

08/20/2017 - 02:39

హైదరాబాద్, ఆగస్టు 19: కోర్టు కేసులు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోందని, నిర్ణీత కాల వ్యవధిలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతే రైతులకు న్యాయం చేయలేమని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అన్నారు. జల సౌధలో ప్రభుత్వ ప్లీడర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి హరీశ్‌రావు శనివారం సమావేశం అయ్యారు.

08/20/2017 - 02:37

మేడ్చల్, ఆగస్టు 19: మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో 14ఏళ్ల బాలుడి కిడ్నాప్ జరిగింది. ఏపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై. గిరిబాబు తన భార్య కుమారుడు మణిందర్(14)తో కలిసి వలసవచ్చి నివాసం ఉంటున్నారు. మణిందర్ పట్టణంలోని నాగార్జున్ టాలెంట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

08/19/2017 - 04:07

సిద్దిపేట, ఆగస్టు 18: తెలంగాణ సర్కార్ వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించడంతో పాటు పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు 40డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

08/19/2017 - 04:05

నక్కలగుట్ట, ఆగస్టు 18: సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, 10 కోట్ల రూపాయలతో ఉస్మానియా సెంటినరీ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

08/19/2017 - 04:04

సిరిసిల్ల, ఆగస్టు 18: వచ్చే మార్చిలో ప్రత్యేకంగా ‘వ్యవసాయ బడ్జెట్’ ప్రవేశ పెడుతున్నామని, వ్యవసాయంపై ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది మొదటిదని, ఇది రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Pages