S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/17/2017 - 04:00

హైదరాబాద్, జూలై 16: రైలు ప్రయాణికులను దోచుకునే ముఠా గుట్టు రట్టయింది. క్రైం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ (సిపిడిఎస్) బృందం ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మలక్‌పేటకు చెందిన నల్ల రాఖేష్ (21), దమ్మాయిగూడకు చెందిన గాజుల రాజేష్‌లు రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి వస్తువులు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.

07/17/2017 - 03:59

హైదరాబాద్, జూలై 16: గత నెల 7న కూకట్‌పల్లి నిజాంపేటలో అదృశ్యమైన పదోతరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభించింది. 40 రోజుల క్రితం అదృశ్యమైన పూర్ణిమను ముంబయి పోలీసులు అదుపులో తీసుకుని బాలసుధార్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత నెల 14న ఉదయం స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పూర్ణిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/17/2017 - 03:57

హైదరాబాద్/సైదాబాద్, జూలై 16: చారిత్రక భాగ్యనగరం బోనమెత్తి మురిసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస అమ్మవారి బోనాల సంబురాలు పాతబస్తీలో అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయబద్ధంగా ముస్తాబు చేసిన బోనాలను భక్తి శ్రద్ధలతో నెత్తిన పెట్టుకున్న చిన్నారులు, మహిళలు..

07/17/2017 - 03:51

హైదరాబాద్, జూలై 16: రాష్టప్రతి ఎన్నికలకు జరిగే పోలింగ్‌లో ఎక్కడా పొరపాట్లు జరుగకుండా ఈ ప్రక్రియపై ఎమ్మెల్యేలకు పూర్తి అవగాహన కల్పించాలని పార్టీ సీనియర్ నేతలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం జరిగిన మాక్ పోలింగ్‌కు హాజరుకాని వారి కోసం మరోసారి సోమవారం ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

07/17/2017 - 03:48

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి బంపర్‌గా ఖరీఫ్ సాగు కానుంది. పెద్ద సంఖ్యలోరైతులు పత్తిపంట సాగుకు మళ్లారు. ఆశించినట్లుగా వర్షాలు బాగా కురుస్తుండడం, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడం, కరెంటు కొరతలేకుండా వ్యవసాయపంపుసెట్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు మంచి కుషీమీద ఉన్నారు.

07/17/2017 - 03:04

వరంగల్, జూలై 16: సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే పేరిట ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేయతలపెట్టిన రైతు సమాఖ్య వ్యవస్థ ఫార్సు అని, అవి ఓటు బ్యాం కుగా ప్రభుత్వానికి ఉపయోగపడటం తప్ప రైతులకు చేసే ప్రయోజనం ఏమీ ఉండదని తెలంగాణ జెఎసి చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

07/17/2017 - 03:03

మహబూబ్‌నగర్, జూలై 16: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు పనె్నండు లక్షల ఎకరాలకు కృష్ణాజలాలను అందించి రైతులకు వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

07/17/2017 - 03:01

వనపర్తి, జూలై 16: కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భిక్ష వల్లే నేడు టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందన్న వాస్తవాన్ని గుర్తించి యువరాజు కెటిఆర్, సేనాధిపతి హారీష్‌రావులు నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఏఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/17/2017 - 03:00

సూర్యాపేట, జూలై 16: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుండగా విపక్షాలు ఉనికి ఉండదనే భయం తో అసత్య ప్రచారం చేస్తున్నాయని, అలాంటి వారికి ప్రజలు చెప్పుతో కొట్ట్టేలా సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరా రు.

07/17/2017 - 02:59

ఆదిలాబాద్,జులై 16: కని పెంచిన అమ్మనాన్నలు కానరాని లోకాలకు వెళితే.. తోడునీడగా ఉండాల్సిన ఆత్మీయ బంధువులు పలకరించేందుకు కూడా ముందుకు రాలేదు. విధి వంచితులైన ఇద్దరు ఆనాథ యువతులు నా అన్న వారు లేక సమాజంతో ఎదురీదలేక నెల రోజులుగా స్వీయ గృహనిర్బంధంలో మగ్గు తూ మానసికంగా కృశించిపోయారు.

Pages