S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/02/2016 - 07:20

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించగా, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి సభ్యత్వం తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

11/02/2016 - 07:19

హైదరాబాద్, నవంబర్ 1: నెదర్లాండ్‌కు చెందిన చైల్డ్ అండ్ యూత్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అంకుర సంస్థలకు నిర్వహించే యువ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును ఈసారి హైదరాబాద్‌కు చెందిన వెనె్నలకృష్ణ ఎంపికైంది. ఈ సంస్థ తొలిసారిగా అక్టోబర్‌లో ముంబైలో ఈ పోటీని నిర్వహించింది.

11/02/2016 - 06:57

హైదరాబాద్, నవంబర్ 1: సచివాలయాన్ని కూల్చి కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ప్రాంతంలో ఉన్నపురాతన భవనం జి బ్లాక్ చుట్టూ ఆసక్తికరమైన కథలు వినిపిస్తున్నాయి. పురావస్తు శాఖ సైతం గత పదిహేనేళ్ల నుంచి ఈ భవనం పట్ల ఆసక్తి చూపుతోంది. కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి సచివాలయంలోని ఈ భవనం వరకు సొరంగా మార్గం ఉంది.

11/02/2016 - 06:56

హైదరాబాద్, నవంబర్ 1: సచివాలయాన్ని కూల్చి వేసి వాస్తుప్రకారం అత్యంత ఆధునికంగా నిర్మించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదనకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఉన్న సచివాలయం కొత్తదేనని, కూలిపోయే దశలో ఏమీ లేదని విపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి.

11/02/2016 - 06:54

భద్రాచలం, నవంబర్ 1: ఏవోబి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్టల్ల్రో గురువారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దులకు భారీగా బలగాలను తరలిస్తున్నాయి. ఏవోబి, దండకారణ్యంలో అప్పుడే మావోయిస్టులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు.

11/02/2016 - 06:55

భద్రాచలం, నవంబర్ 1: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. జపనీజ్ ఎన్‌సైఫలైటిస్ (మెదడువాపు) వ్యాధి చిన్నారులను కబళిస్తోంది. ఇటీవలి కాలంలో 69 మంది పసికూనలు మెదడువాపు వ్యాధితో కన్నుమూశారు. గడచిన రెండు రోజుల్లోనే నలుగురు చిన్నారులు చనిపోయారు. దీంతో మల్కన్‌గిరి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

11/02/2016 - 06:53

ఖమ్మం, నవంబర్ 1: ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగ్యూ జ్వరంతో ఇద్దరు మాత్రమే మృతి చెందారని రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జ్వరాలతో బోనకల్ మండలంలో 22మంది మృతి చెందడం, అన్ని రాజకీయ పార్టీలు హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటంతో మంగళవారం వారు మండలంలో పర్యటించారు. పలుగ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు.

11/02/2016 - 06:52

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 2న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టిఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో అమలయినవి..అమలవుతున్న దశలో ఉన్న పథకాలపై ఈ సభలో చర్చిస్తారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.

11/02/2016 - 06:42

హైదరాబాద్, నవంబర్ 1: దేశవ్యాప్తంగా 32 లక్షల బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించినట్టు వచ్చిన ప్రకటనల నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం అప్రమత్తమైంది. సైబర్ నేరాలు దొంగతనాలు, దోపిడీల కంటే అతి సులువైందని నేరగాళ్లు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జీడిమెట్ల ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీ ఖాతా హ్యాక్ చేసి సుమారు రూ.

11/02/2016 - 06:41

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో రైతులందరి చేత పంటల బీమా చేయించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. జాతీయ నూనెగింజలు, ఆయిల్‌పామ్ మిషన్ కింద యాసంగి వేరుసెనగ అధిక దిగుబడి సాధనపై జిల్లా వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం సదస్సు నిర్వహించారు.

Pages