-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్‌కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై శాసనసభ సమావేశాల్లో భాగంగా ఒకరోజు ప్రత్యేక చర్చ జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. జాతీయ పౌర చట్టం (సీఏఏ) గురించి ఇంత గందరగోళం సృష్టించే కంటే జాతీయ గుర్తింపు కార్డును పెట్టవచ్చని కేసీఆర్ సూచించారు. కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టం ప్రాథక హక్కులనే అగౌరవపరుస్తోందని అన్నారు.
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు శనివారం నాడు వాడివేడిగా కొనసాగాయి. శాసనసభ నుండి కాంగ్రెస్ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడటానికి ప్రయత్నించినపుడు ముందుగా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
హైదరాబాద్: 2020-21 సంవత్సరానికి సంబంధించి తయారు చేసిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రగతిభవన్‌లో శనివారం రాత్రి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు వార్షిక బడ్జెట్‌ను శాసనసభకు ఆర్థిక మంత్రి టీ హరీష్‌రావు సమర్పిస్తారు. శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించే ముందే దీనికి మంత్రివర్గం ఆమోదం అవసరం ఉంటుంది.
హైదరాబాద్, మార్చి 7: రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు అయిపోయాయని, ఇప్పుడు ప్రభుత్వ దృష్టి కేవలం అభివృద్ధి, సంక్షేమంపై ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ అధికార పక్ష సభ్యులు శనివారం ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
హైదరాబాద్, మార్చి 5: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెందారని టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద ఏర్పాటుచేసిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్, మార్చి 5: మహిళాలు పిల్లలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలు, హింస, కేసులను ప్రధానంగా పోస్కో కేసులను పరిష్కరించేందుకు భరోసా హైదరాబాద్‌లో కేంద్రం ఇప్పటికే ఏర్పాటైంది. నగరంలోని భరోసా కేంద్రం సత్ఫాలితాలు ఇస్తున్నందున మరో పది జిల్లాలో ఈ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్, మార్చి 5: పత్రికా సంపాదకుడిగా ఆ స్థాయికి వనె్న తెచ్చిన పొత్తూరి వెంకటేశ్వరరావు మరణించడం ఎంతో బాధాకరమని, పాత్రికేయ రంగానికి దిగ్గజంగా నిలిచారని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పొత్తూరి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 5: నిషేధిత అలివిగాని వలలను వినియోగించి చేపల వేట కొనసాగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి టీ.శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు గండి కొట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మత్స్య శాఖ కమిషనర్ సువర్ణకు సూచించారు.
హైదరాబాద్, మార్చి 5: హైదరాబాద్‌లో కరోనా వ్యాధిపై అవగాహన కల్పించడానికి రవాణా శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. గురువారం హైదరాబాద్ కేంద్ర రవాణాశాఖ కార్యాలయంలో కరోనాపై రవాణా శాఖ అవగాహన కోసం పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్లను ఆటోలపై అతికించి ప్రజల్ని చైతన్యం చేయడానికి కమిషనర్ ఎంఆర్‌ఎం రావు ప్రారంభించారు.
హైదరాబాద్, మార్చి 5: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. సెకండియర్ పరీక్షలకు 4,18,944 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,03,459 మంది హాజరయ్యారని, 15,483 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారని అన్నారు. 22 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.