S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/28/2018 - 04:41

హైదరాబాద్, అక్టోబర్ 27: తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసింది ఎవరో తేల్చాల్సిన బాధ్యత మీకు లేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్ధేశించి ప్రశ్నించారు.

10/28/2018 - 04:40

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడుపుతోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ పార్టీ ప్రధానకార్యదర్శి ఇ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అరవీర భయంకరుడిలా విర్రవీగిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, అయితే ఐదు సీట్లలో బీజేపీకి, నాలుగు సీట్లలో ఎంఐఎంకీ సహకరించనున్నట్టు తెలుస్తోందని అన్నారు.

10/28/2018 - 04:39

హైదరాబాద్, అక్టోబర్ 27: సాంకేతికతకు మంచి ఉద్ధేశ్యాలు తోడ్పడితే అద్భుతాలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. విట్ -ఏపీ అమరావతి క్యాంపస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రిన్సిపాల్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

10/28/2018 - 04:33

ఖానాపూర్, అక్టోబర్ 27: టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్‌లో శనివారం విక్టోరియా స్టేట్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఉప్పు సాయిరా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు బాహాబాహీకి దిగారు.

10/28/2018 - 04:32

సిద్దిపేట, అక్టోబర్ 27: కృష్ణ, గోదావరి నీళ్లలో న్యాయమైన వాటా రావాలంటే తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని.. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

10/28/2018 - 04:30

జనగామ టౌన్, అక్టోబర్ 27: కొద్దిరోజుల్లో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జనగామ పట్టణంలోని 1,2,9,10,12,13 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.

10/28/2018 - 04:29

మహబూబ్‌నగర్, అక్టోబర్ 27: మహాకూటమో, గూటమో తేల్చుకుందాం రా బిడ్డా చంద్రబాబు అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సవాల్ విసిరారు.

10/28/2018 - 04:27

హైదరాబాద్, అక్టోబర్ 27: మాజీ సైనికులపై టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు ఇళ్ళ స్థలాలు, ఐదు ఎకరాల పొలం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులను నిర్లక్ష్యం చేసిందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని అమలు చేస్తామని ఆయన తెలిపారు.

10/28/2018 - 03:48

రామచంద్రాపురం, అక్టోబర్ 27: ఎంతో గొప్ప చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగర పరువును తీస్తూ, సమాజం సిగ్గుపడేలా దుర్మార్గపు కార్యక్రమాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు వి హనుమంతరావు మండిపడ్డారు.

10/27/2018 - 16:26

హైదరాబాద్: గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతిచెందింది. సాఫ్ట్‌వేర్ దంపతులైన రమ్య, ప్రవీణ్‌కుమార్ ద్విచక్ర వాహనంపై బాలాజీ గుడికి వెళ్లేందుకు బయలుదేరారు. విప్రో చౌరస్తా వద్ద లారీ దూసుకురావటంతో రమ్య అక్కడికక్కడే చనిపోగా, ప్రవీణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pages