S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/18/2018 - 05:53

హైదరాబాద్, జూలై 17: ఫీజుల ఖరారుపై ఎందుకు జాప్యం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. 2016లో ఫీజులను తగ్గించమని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కోరారు, ఇలాగే జాప్యం చేస్తే వారి పిల్లలు ఇంజనీరింగ్‌కు వచ్చేస్తారు అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబీ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.

07/18/2018 - 05:52

హైదరాబాద్, జూలై 17: జనసేన పార్టీలో రెండు కోట్ల మందిని భాగుస్వామ్యులను చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తెలిపారు. సామాజిక, రాజకీయ బాధ్యతతో కూడిన వ్యవస్థను జనసేన తెలుగు రాష్ట్రాల్లో తీసుకు వస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన ఐటి సెంటర్‌ను, గిడుగు వెంకటరామమూర్తి ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను పవన్‌కళ్యాణ్ ప్రారంభించారు.

07/17/2018 - 05:50

హైదరాబాద్, జూలై 16: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.

07/17/2018 - 05:48

హైదరాబాద్, జూలై 16: ఉన్నత విద్యా కమిషన్‌ను వ్యతిరేకించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు, ఎన్‌జీవోల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులతో పాటు విద్యావేత్తలు కూడా ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యామండలిపై నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు, ఎంపీలు, వీసీలు మాట్లాడుతూ ఉన్నత విద్యా కమిషన్ ముసాయిదా బిల్లులో అనేక వైరుధ్యాలున్నాయని పేర్కొన్నారు.

07/17/2018 - 05:48

హైదరాబాద్, జూలై 16: వ్యాయామ విద్యా కోర్సుల్లో చేరేందుకు పీఈసెట్ తుది దశ కౌనె్సలింగ్ షెడ్యూలు సోమవారం నాడు విడుదల చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సర్ట్ఫికెట్ల పరిశీలన జూలై 21న ప్రారంభం అవుతుందని, దీనికి బీపీఈడీ, డీపీఈడీ అభ్యర్ధులు హాజరుకావాలని అన్నారు.

07/17/2018 - 05:47

హైదరాబాద్, జూలై 16: అన్ని రంగాల మేధావుల నిలయం శాసన మండలి అని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. సోమవారం ఒరిస్సా రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి నృసింహ చరణ్ సాహు ఆధ్వర్యంలో వచ్చిన ఎమ్మెల్యేల బృందానికి మండలి ప్రాధాన్యతలను ఆయన వివరించారు.

07/17/2018 - 05:45

హైదరాబాద్, జూలై 16: విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు టీడీపీ పోరాటాలకు సన్నద్ధం అవుతోంది. సుమారు 60 ఏళ్ల పోరాటం అనంతరం రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు ఎన్నో హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి చేయక పోవడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.

07/17/2018 - 05:45

హైదరాబాద్, జూలై 16: ఉద్యోగులను మంత్రులు బెదిరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక అధికారిపై బెదిరింపులకు దిగారని ఆరోపించారు. గతంలో ప్రజలను, అధికారులను రౌడీలు, గూండాలు బెదిరించేవారని, కానీ టీఆర్‌ఎస్ పాలనలో మంత్రులే అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

07/17/2018 - 05:43

కరీంనగర్ టౌన్, జూలై 16: అవును ఇది నిజమే.. ఆయనను బతికుండగానే నగర పాలక సంస్థ అధికారులు చంపేశారు. నిన్న కాదు.. మొన్న కాదు 40 ఏళ్ళ క్రితమే రికార్డుల్లో నమోదు చేశారు. దీనిని రూఢీ చేస్తూ గతేడాది నవంబర్ మాసంలో మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసి, కాసులిస్తే బల్దియాలో కాని పని ఉండదని నిరూపించుకున్నారు.

07/17/2018 - 05:42

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు సీమాంధ్ర పాలకులకు పాద సేవ చేస్తూ, ద్రోహులకు సద్దులు మోసారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. టిఆర్‌ఎస్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో ఇక ఎప్పటికీ అధికారం దక్కదన్న అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు సిఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ మండిపడింది.

Pages