S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/12/2018 - 06:10

హైదరాబాద్, జూలై 11: అలీ నవాజ్ జంగ్ అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు డిజైన్ చేసిన రూపకర్త అని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు కొనియాడారు. నిజాం సాగర్ వంటి అద్భుతమైన ప్రాజెక్టుకు డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించిన ప్రాజెక్టుల స్ఫూర్తితో ప్రాజెక్టులు నిర్మిస్తున్నమన్నారు.

07/12/2018 - 06:09

తిరుపతి, జూలై 11: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలనడకన బయలు దేరి మార్గమధ్యలో గాలి గోపురం వద్ద అస్వస్థతకు గురైయ్యారు. బీపీ తగ్గడంతో కింద పడిపోయిన ఆయన కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని తిరుమలకు చేరుకున్నారు. కాని అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

07/12/2018 - 06:08

హైదరాబాద్, జూలై 11: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని, దీంతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అఖిలపక్ష బృందం నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. బుధవారం సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.

07/12/2018 - 06:07

హైదరాబాద్, జూలై 11: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎందుకు భయపడుతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి ఇ. పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన వర్క్ షాప్ జరిగింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి, ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి చర్చించారు.

07/11/2018 - 04:39

ఆదిలాబాద్, జూలై 10: మూడు రోజులుగా కుదిపేసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరద తాకిడి ప్రాంతాలను సందర్శించి, యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు.

07/11/2018 - 04:36

నాగర్‌కర్నూల్, జూలై 10: పరిపూర్ణానందస్వామి గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ హిందూవాహిని ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

07/11/2018 - 04:32

కరీంనగర్, జూలై 10: దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. మంగళవారం స్థానిక ఇందిరా భవన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక, విదేశీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం మోదీ విస్మరించారని విమర్శించారు.

07/11/2018 - 04:30

ఆదిలాబాద్, జూలై 10: ఆదిలాబాద్ రిమ్స్ ప్రసూతి వార్డులో తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు రోజుల పసికందు అపహరణకు గురైన రెండు గంటల వ్యవధిలోనే నిందితులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన అలజడి రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్‌గాం గ్రామానికి మమత తొలికాన్పు కోసం ఈనెల 2న రిమ్స్ ఆసుపత్రిలో చేరగా 4వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది.

07/11/2018 - 04:27

దివ్యనగర్, జూలై 10: ఈ ఖరీఫ్ సీజన్‌లో స్వర్ణ ఆయకట్టు రైతులకు సాగునీరందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం స్వర్ణ జలాశయంలో 1166 అడుగుల నీరుందని, మరో మూడు రోజుల్లో 1175 అడుగులకు చేరుకుంటుందని, తదుపరి నీటిని విడుదల చేస్తామన్నారు.

07/11/2018 - 02:34

హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర మొత్తానికి, అన్ని శాఖలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రోజు వారి కార్యకలాపాలతో పాటు అత్యవసర సమయాల్లో అన్ని శాఖలకు ఉపయోగ పడేవిధంగా రాష్టస్థ్రాయి మల్టీ ఏజెన్సీగా ఆపరేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దాలని అన్ని శాఖలు కోరుతున్నాయన్నారు.

Pages