S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/14/2018 - 00:17

హైదరాబాద్, జూలై 13: దేశ, విదేశాల్లో సుప్రసిద్ధమైన ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్ళి కనువిందు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. నగరంలోని హెచ్‌ఐసిసి వేదికగా ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్) శుక్రవారం ప్రారంభమైంది. రెండో రోజు శనివారం కూడా కొనసాగుతుంది. 12 దేశాలు, 19 రాష్ట్రాల నుంచి 180 మంది ఎగ్జిబిటర్లు ట్రావెల్ అండ్ టూరిజంలో పాల్గొంటున్నారు.

07/14/2018 - 00:16

హైదరాబాద్, జూలై 13: పెట్రోలు, డీజిల్ కొంటున్నారా?..జర జాగ్రత్త!. అడుగడుగునా కల్తీ, నాసిరకం, నాణ్యత లేకపోవడం వంటి వాటితో ప్రజలు బేజారెత్తుతున్నారు. వాహనంలో ఇంధనం పోయించాలన్న అవకతవకలు. రాష్ట్రంలోని అనేక పెట్రోలు బంకులపై అవకతవకల ఆరోపణలు రావడంతో తూనికల కొలతల శాఖ శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా పెట్రోలు బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

07/14/2018 - 00:16

హైదరాబాద్, జూలై 13: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మధును అరెస్టు చేసిందని, దీనిని ప్రజాస్వామ్య వాధులందరూ ఖండించాలని న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ. కృష్ణ అన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు జరుగుతున్న కుట్రలను చేధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

07/14/2018 - 00:15

హైదరాబాద్, జూలై 13: భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం శే్వత పత్రం విడుదల చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యుడు రావుల చంధ్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్‌టీఆర్ ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 34 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అందులో టీడీపీ హయాంలో ప్రారంభించినవి సైతం ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు.

07/14/2018 - 00:14

హైదరాబాద్, జూలై 13: పులుల సంరక్షణాధికారిగా అరణ్యభవన్‌లో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(లా)గా విధులు నిర్వహిస్తున్న రాజా రమణా రెడ్డి నియమితులయ్యారు. అభయరణ్యంలోని పులల సంరక్షణపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అడవి జంతువుల వేట నియంత్రణాధికారిగా రాజా రమణారెడ్డి ఐదేళ్ల పాటు విధులు నిర్వహించారు.

07/14/2018 - 00:14

హైదరాబాద్, జూలై 13: కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని శనివారం నాడు నిర్వహిస్తున్నట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి తెలిపారు. సంజీవయ్య పార్కులో ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కార్గిల్ వరకూ ఫ్లాగ్ రైడ్ చేసే నాలుగో బృందం బయలుదేరుతుందని చెప్పారు.

07/14/2018 - 00:13

హైదరాబాద్, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సాకులను అడ్డు పెట్టుకుని పంచాయతీ ఎన్నికలను నిర్వహించకుండా జాప్యం చేస్తున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై లోగడ పలు పర్యాయాలు చర్చకు వచ్చిందని ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ గుర్తు చేవారు.

07/14/2018 - 00:12

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ విద్యార్ధులకు ప్రత్యేకంగా ఫార్మసీ కౌన్సిల్ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ 16వ తేదీ నుండి పని ప్రారంభిస్తుందని కౌన్సిల్ అధ్యక్షులు, సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ప్రీతి మీనా తెలిపారు.

07/13/2018 - 03:49

వరంగల్,జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హరితహార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హరితహారం, అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

07/13/2018 - 03:47

ఆసిఫాబాద్, జూలై 12: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయ. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కుమ్రం భీం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లను ఎత్తివేసి 13,376 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.

Pages