S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/22/2016 - 09:04

ఆధునిక విద్యావిధానంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ప్రైవేటురంగంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనివార్యం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పలురంగాల్లో అభివృద్ధి, సేవలు మెరుగు పర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ఉన్నత విద్యాభివృద్ధిలో భాగంగా ప్రైవేటు యాజమాన్యంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు రావడం ఆహ్వానించదగిందే. ప్రైవేటురంగంలో యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యావకాశాలు మెండుగా ఉంటాయి.

12/22/2016 - 09:03

రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఏ ఏడాదికాయేడాది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తొంది. అందరు ఉన్నత విద్యను అభ్యసించాలంటే అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉండాలి. నేడు వెనుకబడిన ప్రాంతాల నుంచి కూడా ఉన్నత విద్యాభ్యాసానికి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.

12/22/2016 - 09:02

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కార్పొరేట్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఒకదాని వెంట మరొకటిగా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతిలో వందలాది ఎకరాల భూములను ఉచితంగా కాకపోయినప్పటికీ నిర్ణీత రేటుపై కట్టబెట్టడమే గాక స్వహస్తాలతో ప్రారంభోత్సవం కూడా చేసారు.

12/22/2016 - 09:01

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు తెరతీసే ముందు ప్రస్తుతం నడుస్తున్న విశ్వవిద్యాలయాలను బాగు చేయాలి. ‘ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాన’ని అన్నట్టు ఉంది..కెసిఆర్ ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వ నేతృత్వంలోని యూనివర్సిటీలను పటిష్టం చేసి, సమాజంలో పోటీకి సిద్ధం చేసి, ప్రైవేట్ యూనివర్సిటీల గురించి ఆలోచిస్తే బాగుండేది.

12/22/2016 - 08:59

డిమాండ్‌ను బట్టి ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతివ్వాలి. యూనివర్శిటీల ఏర్పాటులో విధివిధానాలు ప్రకటించకుండానే యూనివర్శిటీల అనుమతులపై కసరత్తు చేయడం మంచిది కాదు. నాణ్యతలేని విద్యాబోధన, సౌకర్యాలు లేని ప్రైవేటు కళాశాలలు ఎన్నో ఉన్నాయి. వాటి స్థానే యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి సరైంది కాదు. వంద ఎకరాల్లో యూనివర్శిటీ ఉండాలి. అలాంటి ఏ ఒక్క యూనివర్శిటీ లేదు.

12/22/2016 - 08:58

ప్రైవేట్ యూనివర్శిటీలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీలు పడి భూములు కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యా రంగం నిర్వీర్యమవుతుంది. విద్యారంగం ఎప్పుడూ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. కాని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఎడాపెడా అనుమతులు ఇవ్వడంవల్ల సామాజిక సంక్షేమం, సమతుల్యత దెబ్బతింటుంది. భవిష్యత్తులో అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తి, అశాంతికి కారణమవుతుంది.

12/22/2016 - 08:58

అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విద్యలో ప్రైవేటీకరణ భాగస్వామ్యం చేయడం లక్ష్యం మంచిదైనా, ఆశించిన సత్పలితాలు లభించవు. 1950లో భారత రాజ్యాంగంలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు విద్యాభివృద్ధి నిమిత్తం- ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు నిర్దేశించి తయారుచేసిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే అమలులోకి వస్తున్నాయి.

12/22/2016 - 08:57

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి క్షణం నుండి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులంతా తమకు ఉన్నత విద్య దొరుకుతుందని భావించారు. తాముకూడా ఉన్నత విద్యకు అర్హులం అవుతామని కలలు కన్నారు. ఆ సమయంలోనే కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్య తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించగానే విద్యార్ధులు, యువకులు, కార్మికులు, రైతులు, కర్షకులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.

12/22/2016 - 08:56

నూతన సంస్కరణల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ విద్యావిధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం కొంతవరకు మంచిదే. ప్రైవేటీకరణ విద్యావిధానం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ పోటీ పెరుగుతుంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల మాదిరిగా పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సర్వహక్కులు ఉంటూ, ప్రైవేట్ విద్యారంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యం.

12/15/2016 - 00:12

ఇస్లాం ప్రకారం తలాఖ్..తలాఖ్...తలాఖ్ అని భర్త మూడుసార్లు చెబితే భార్యకు విడాకులు ఇచ్చినట్టే. ఇక ఆ వివాహ బంధం రద్దయిపోతుంది. భార్యను వదిలేసి ఆ భర్త తన దారి తాను చూసుకోవచ్చు. ఆమె ఏమైపోయినా ఆ భర్తకు సంబంధం ఉండదు. సీరియస్‌గానే కాదు ఒకవేళ భర్త సరాదాగా తలాఖ్ అన్నా ఆ వివాహం చెల్లదు. ఖతర్‌కు చెందిన ఒక వ్యక్తి సరదాగా ఇంటర్నెట్‌లో తన భార్యకు తలాఖ్ అని మూడుసార్లు చెప్పాడు.

Pages